రాజకీయం / సినిమా – కింకర్తవ్యం

రాజకీయం / సినిమా – కింకర్తవ్యం

పొలోమని నారాయణ లేదా చైతన్యా గట్రాలో చేరుస్తున్నారు. విద్యలో కులం చూడ్డం లేదు. తమ వారసుల భవిష్యత్తు కోసం, ఎవరూ వెనుకాడడం లేదు. వాటి గురించి ఎన్ని కథలు, కథనాలు వినిపించినా.

అదో వ్యాపారం అందులో సూత్రం అందరికి మించి ర్యాంకులు తీసుకొనే శ్రద్ధ కావచ్చు. పిల్లలను గ్రైండర్లో వేసి రుబ్బినా ఇష్టంగానే ఫీజులు కడుతున్నారు.

ఆ యాజమాన్యాలు కూడా ఎక్కడా తమ కులాల హెచ్చులకు పోలేదు.

మధ్యలో కేశవరెడ్డి విద్యాసంస్థలు వచ్చాయి. డిపాజిట్లు వసూలు చేసి, నమ్మిన వాళ్లకే నామం పెట్టి పోయాయి.

పొలోమని రాజకీయ నాయకుల సభలకు కూడా జనం వస్తారు. సీట్లు ఒకే కులానికి ఇవ్వడం కుదరదు. ఒకే కులం వాళ్లు ఓట్లు వేస్తే గెలవలేరు. ఇది తెలిసిన వాడు నాయకుడు అవుతున్నాడు.

అది తెలియని కులానికి ప్రతినిధిగా, రాజకీయంలో కుల బలహీనతను వాడుకొని, డబ్బులు ఎలా సంపాయించుకోవాలో నేర్చుకొన్నారు. సీట్లు అమ్మి, పార్టీలకు మద్దతులు ఇచ్చి సంపాయించుకొన్నారు.

అదో వ్యాపారంలా తమ సినిమా అనుభవం మొహం పెట్టుబడిగా పెట్టేవాళ్లు వున్నారు. ముందు రాజకీయ పార్టీలలో సంపాయించి, సొంత మీడియాలు పెట్టి, మేమూ నాయకులమే అనే వారూ సంపాయించుకొంటున్నారు. కానీ జనానికి మరో ఐదేళ్లకు  మొహం చూపించడానికి, మొహాలు మారిస్తే ఏమారతారు, మళ్లీ సంపాయించుకోవచ్చు, అనే ధైర్యమూ చెస్తూ వున్నారు. పాదయాత్రలు చేసి నమ్మించవచ్చని, ప్రయత్నం చేసే వారినీ చూస్తున్నాం.

వీరు సంపాయించుకోవడం ఆయా కులాల మొత్తానికి ఒక ఎమోషన్ గా ఇష్టమే అనే నమ్మకానికి వచ్చేసి, మరింత విజృంభిస్తున్నారు.

కాని కాలం మారింది. వాళ్లు మన కులం పేరు చెప్పుకొని సంపాయిస్తే, మనకేంటి? అనే ప్రశ్న మొదలయ్యింది. ఓడినా వాళ్లకు డబ్బులే, మనకు అవమానాలా అనే అంతర్మధనం, సమాజంలో చీత్కారాలా అనే చింత మొదలయ్యింది. కొందరైతే లౌఖ్యంగా వాటా కోసం వాటేసుకొంటున్నారు. ఈ లెక్కంతా తెలియని వయసు యువతనే, పెట్టుబడిగా చూపుతూ, సంపాయించుకోడానికి ప్రణాళికలు & కుట్రలు రచించుకొంటున్నారు.

ఎన్నో ఆశలతో ఎగెరిగెరి కుల ముద్ర చాటాలనే తహ తహలో, కులాల సమ్మిళిత సమాజంలో, మిగిలిన వారి దృష్టిలో చులకన అయ్యి, గౌరవం కోల్పోయేది, ఈ యువతే. వారూ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఊగి ఊగి, ఇప్పుడిప్పుడే దూరమవుతున్న స్నేహాల ప్రభావంతో, తెలుసుకొంటున్నారు. బాహాటంగా తమకే నమ్మకం లేని తమ కుల ప్రతినిధులను, తప్పు చేసిన ప్రతి సారీ, వెనకేసుకురావడానికి ఇష్టపడ్డం లేదు.

సినిమాల్లో దర్శకులు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, నటులు, ఒకే కులం వారు దొరకరు. సమూహంగా పని చేయాలి. అన్ని కులాలు చూస్తేనే సినిమా ఆడుతుంది కాబట్టి మంచి సినిమా తీయాల్సిందే. ఓ హిట్టుకు కులగౌరవం నిలబడదు. మరో డిజాస్టర్ కు కుల గౌరవం కూలిపోదు. కానీ పంతాలకు పోయి, బాహాటంగా నేను తలచుకొంటే, అనే అహంకారానికి వెళితే, అన్ని కులాలు ఒక్కటై చేసే, అవహేళన ఎలా వుంటుందో, తెలియజేస్తారు. సోషల్ మీడియాలో అదే జరుగుతోంది.

విజ్ఞత వుండేవాడు, తమ సంతానాలు & బంధువులు మొత్తం నమ్ముకొన్న సినిమాను నమ్ముకోకుండా, కులాన్ని ఎగదోసే కాష్టం పేర్చుకొంటే, కాలేది వారికే. జరిగే అనర్థం, అర్థం చేసుకొంటే, వారసత్వానికి వీరే అడ్డవ్వరు.

కాదు రాజకీయానికి కూడా ఇదే పంధా అంటే, ఆరునెలల ఎన్నికల తరువాత, మరో ఐదేళ్లు ఎన్నికలు వుండవు. కాని వచ్చే ఎన్నికల్లో కులాల పేరుతో దండుకొనే డబ్బుతో, వారసులంతా వాటాలేసుకొని, మరిన్ని సినిమాలతో వచ్చి, ఐదేళ్లు పడే అవమానాలతో, సంతృప్తి పడాల్సి వస్తుంది.

ఆ ఐదేళ్ల కాలం చాలు. సినిమా పరిశ్రమలో కూడా విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. టెక్నాలజీ వస్తోంది. టాలెంట్ వున్న వారిదే భవిష్యత్తు. ఒక్క వారంలో దండుకొనే పెద్ద కుటుంబాల సినిమాలకే థియేటర్లు & విడుదలయ్యే సినిమాలకు ఎక్సల్ షీట్ల కలెక్షన అబద్దపు ప్రచారాలు చేసి, మరో సినిమాకు దాన్ని పెట్టుబడిగా పెట్టి మోసగించడం మొత్తం మారుతుంది. టెక్నాలజీ ద్వారా తెలిసిపోతుంది ఆ అబద్దాలు. ఈ అబద్ద కాలాన్ని కాలరాయబోయే టెక్నాలజీ తరం వస్తోంది. వీలైతే ప్రేక్షకుడు విసుగు చెంది ఇంట్లో నుండి మూవీ చూస్తా అనే రోజులు వస్తే, సినిమా విడుదల మాఫియా మొదలంటూ కూలిపోతుంది. వారసత్వాలకు మొహం వాచిపోతుంది. ఏమీ లేకున్నా ఎగిరే కులబలుపు అభిమానం, మొదలంటూ కూలిపోతుంది.

కింకర్తవ్యం ఎంచుకొని, జనం ఇచ్చిన సెలెబ్రిటీ జీవితాలను, మలచుకొంటె మనగలుగుతారు. అబద్దంలో బతికితే అంతర్మథనం అద్దం లా వెక్కిరిస్తుంది. మనుషులకు చెడ్డ చేయడానికి కూడా వెనకాడని సంపాదన, మానసిక మనోవ్యధనే మిగిల్చి, మరుగున పడేలా చేస్తుంది.

హీరోలుగా ఓ వెలుగు వెలిగి, సహాయ పాత్రల్లోనో లేదా విలన్లుగానో సర్దుకు పోలేక, గోళ్లు గిల్లుకొంటున్న హీరోలు డజన్లకొద్దీ వున్నారు. వచ్చిన పాత్రలతో మెప్పించి జనం మదిలో గుర్తుండిపోయేలా, పడి లేచిన కెరటాల్లా వున్న హీరోలనూ చూస్తున్నాం. మనిషికి అంతర్మధనం అవసరం. మల్టిస్టార్ సినిమాలకైనా మళ్లే వెసులుబాటుతో, ఉన్నతమైన విజయాలతో ఆనందాన్ని అందుకొనే వయసులో చిన్న & హీరోయిజంలో పెద్ద వారి నుండి, నేర్చుకొంటె ఎంతో నేర్చుకోవచ్చు.

సోషల్ మీడియాలో వచ్చి కూసిన రోజు, వచ్చే కిక్కు బావుంటుంది. శత్రువు పట్టించుకోకుండా వదిలిస్తే సగం సచ్చి, మిగిలిన జీవితాన్ని కూడా పదే పదే పోగొట్టుకొంటూ, ఇలా దొరికే రోజు కుమిలిపోవాల్సి వస్తుంది.

ఇదంతా అర్థం అయితే కింకర్తవ్యం బోధపడుతుంది. రాజకీయం, సినిమాలే కాదు, ఏ కుల వృత్తైనా సమాజంతో ముడిపడి వుంటుంది. దాని మంచి కోరే మనుషులకే మనసులు ఇస్తారు. జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలకు అభివృద్ధి లెక్కలు & ర్యాంకులు వస్తున్నాయి. పచ్చగా వుంటె పచ్చగా, కరువుతో కునారిళ్లితే నెర్రెలు చీలిన నేలలా చూపే గూగుల్ చిత్రాల కాలంలో, సెకండ్లలో దానావలవంలా చుట్టే అబద్దాల పైన నిజాలు కూడా అలాగే తెలుస్తాయి. మీడియా గుత్తాధిపత్యాలు పోయి వాతిని నమ్ముకొని చేసే కుల పైత్య రాజకీయాలు కూడా పోతాయి. నిజం మాట్లాడుతుంది. మనగలుగుతుంది. …చాకిరేవు.

ప్రకటనలు

1 Response to “రాజకీయం / సినిమా – కింకర్తవ్యం”


  1. 1 Anon 5:58 సా. వద్ద జనవరి 11, 2019

    నువ్వు కూడా కులపిచ్చి గురించి సుద్దులు చెబుతావా. ఛీ పాడు. ఇదే మరి బయోగ్యాస్ అంటే.

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 889,951

తడి ఆరని ఉతుకులు

జనవరి 2019
సో మం బు గు శు
« డిసెం   ఫిబ్ర »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: