తోటి తెలుగు తెలంగాణా సోదర & సోదరీమణులకు ఆంధ్రా నుండి,

తోటి తెలుగు తెలంగాణా సోదర & సోదరీమణులకు ఆంధ్రా నుండి,

మా ఆంధ్రా మీద మీకు ఇంకా కోపం వుందా? వుంటే అర్థం చేసుకోగలం. కాని మీ మీద మాకు కోపం లేదు.

ఓ తరంలో రజాకార్లతో కష్టాలు పడ్డారు, తరువాత దొరలతో, వారి మీద కోపంతో నక్సలిజం, తరువాత తెలంగాణావాదం. ప్రతి దశలో మీ పోరాటం అద్భుతం. ఒకటి ముగిస్తే మరొకటి, అయినా విజయం సాధిస్తూనే వస్తున్నారు.

మీకు ఎందుకో మా మీద పగను నూరిపోస్తున్నారు. కాని మాకు అలా వుండదు. ఎవరితో అయినా పోటీపడాలని వుంటుంది. నిన్న కూడా, కడప యోగి వేమన యూనివర్సిటీలో, జ్ఞానభేరిలో, మన తెలుగు వారి శక్తి సామర్థ్యాలు, తెలివి తేటల గురించి, ఐటిలో మన స్థానం గురించి, ఇక్కడి నాయకుడు చెబుతూ వున్నాడు. ఈ మాటలు తప్పక ప్రభావితం చేస్తుంది. ఒక ఆశ కలిగిస్తుంది. ఆత్మస్థైర్యం కలిస్తుంది. ఆ వైపు నడిపుస్తుంది. ఆంజనేయులంతటి రామబంటుకే ఆయన శక్తి సామర్థ్యాలు గుర్తుచేయాలట. అలా భావి తరానికి ఈ మాటలు ఉపయోగపడుతాయి.

అందుకే నైపుణ్య సామర్థ్యంలో ఈ రోజు దేశంలో ప్రథమ స్థానం నిలిచాం. మీకు కూడా ఇది పెద్ద విషయం కాదు. కాని మనఃశాంతి లేకుండా, ఎప్పుడూ అక్కడి నాయకులు ఏదో ఒకటి చెబుతూ వుంటారు. అందుకే దృష్టిపెట్టలేక పోతున్నారేమో అనిపిస్తుంది.

నాయకులు అభివృద్ధిలో పోటీ పడాలి. ప్రజల మధ్య పగలు పెంచడంలో కాదు అని నా అభిప్రాయం. భవిష్యత్తులో, నిరుద్యోగ భృతి ఐదు వేలు ఇస్తే, అలాంటి వారికి అమ్మాయిని ఇవ్వడానికి, ఏ కన్న తండ్రి ముందుకు వస్తాడు. ఉద్యోగం ముఖ్యం. దానికి సామర్థ్యం ముఖ్యం, అది సాధించడానికి వనరులు కల్పించి ప్రోత్సహించాలి.

ప్రపంచం 3డి ప్రింటింగ్, ఎలక్ట్రిక్, 5జి, ఫోర్త్ జనరేషన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఆటోమేషన్, మెషిన్ లర్నింగ్, రోబోలు ఇలా చెప్పుకొంటూ పోతే చాంతాడంత లిస్ట్ తో వేగంగా వెళుతోంది. ఇప్పటి కాలం పిల్లలు ఈ రోజు ఏమి చదివితే, అందులో స్థిరపడుతారనే నమ్మకం లేని భవిష్యత్తు మీదపడుతోంది.

ఏ టెక్నాలజీ వచ్చినా, ఎదుర్క్కొని, అందులోకి చొచ్చుకెల్లి, పై చేయి సాధించే లాజిక్ ను పెంపొందించే దిశగా తెలుగు జాతి ముందడుగు వేయాలి. మా గోదావరి జిల్లాలంత లేని సింగపూర్ & మలేసియాలు మనకు ఆదర్శం కావాలి.

విడివిడిగా కలివిడిగా, సహకరించి పోటీ పడితే మనకు సాధ్యమే. ఆలోచించండి. అదే పనిగా మా గురించి చెప్పే చెడు మాటలను చెవికేసుకొని, మనసు పాడు చేసుకోకండి. ఆ దిశగా మీ రాజకీయ నిర్ణయం తీసుకోండి. …చాకిరేవు.

ప్రకటనలు

1 Response to “తోటి తెలుగు తెలంగాణా సోదర & సోదరీమణులకు ఆంధ్రా నుండి,”


  1. 1 anonym 1:34 ఉద. వద్ద డిసెంబర్ 7, 2018

    vote for చుండ్రు అలియాస్ నందమూరి సుహాసిని :D:D:D:D:D:D

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

  • జగన్ ప్రమాదకారి అని తన సాక్షిలో తెలియక పోవచ్చు, తెలుసుకొనే స్వేచ్చను తనను నమ్మిన శ్రేయోభిలాషులకు కూడా ఇవ్వలేదు. chaakirevu.wordpress.com/2019/02/14/%e0… 1 day ago

వీక్షణలు

  • 884,613

తడి ఆరని ఉతుకులు

డిసెంబర్ 2018
సో మం బు గు శు
« నవం   జన »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: