నాటి నిజాం మీద తిరగబడ్డట్టు, తెలంగాణా టీఆరెఎస్ సర్కారు మీద ఊర్లలో ఎందుకు తిరగబడుతున్నారో తెలుసా? అసలు కథ ఇది, తెలుసుకోండి.

నాటి నిజాం మీద తిరగబడ్డట్టు, తెలంగాణా టీఆరెఎస్ సర్కారు మీద ఊర్లలో ఎందుకు తిరగబడుతున్నారో తెలుసా? అసలు కథ ఇది, తెలుసుకోండి.

ఊరికో గ్రామ పోలీస్టేషన్ వచ్చింది. పోలీస్ ఉద్యోగాలకు తప్ప ఏ ఉద్యోగ ప్రకటన జారీ చేయలేదు. ఎందుకు?

ఊరికో రైతు కమిటీ వేశారు. ఆ కమిటీలతో రెవెన్యూ భూముల ప్రక్షాళన అన్నారు. ధరణి వెబ్ సైట్ అన్నారు. ఇప్పటికీ అది ప్రారంభించలేదు. ఎందుకు?

ప్రతి గ్రామాన్ని గుప్పిట పట్టే అధికారం కోసం గ్రామ పోలీస్ వ్యవస్థ తెచ్చారు. చెప్పిన మాట వినకుండా తోక తిప్పితే అంతే కథ.

ప్రతి గ్రామంలో టీఆరెఎస్ కార్యకర్తలతో రైతుకమిటీలు వేశారు. వీరే రెవెన్యూ భూ వివాదాలు కూడా పరిష్కరిస్తారు. అంటే వేరే పార్టీ అంటే ఉన్న భూముల హద్దులకు కూడా కాల్లు వస్తాయి. ఓ రకమైన భయం సృష్టించడం.

సాధారణంగా పాలక పార్టీలు ఎన్నికల హామీలు నెరవేర్చకపోతే పోలింగ్ రోజు వరకు, గుంభనంగా వుండి, తమ ప్రతాపం చూపుతారు. కానీ ఊర్లకు ఊర్లే ఒక్కటై పొలిమేర వరకు తరమరు.

దొరలకాలం నాటి పటేల్ పట్వారీ వ్యవస్థను గ్రామ పోలీస్ & రైతు కమిటీల రూపం లో తెలివిగా ప్రవేశపెట్టాడు, చంద్రశేఖర రావు.

క్రింది ఫోటోలో వున్న రైతుపేరు శ్రీనివాస్, పట్టా పాసుపుస్తకం కోసం సంవత్సరం తిరిగాడు. రాలేదు. నాగుపాముని చంపి కాల్చి తిని నిరశన తెలిపాడు.

ఏ స్థాయిలో వారు ఇబ్బందులకు గురవుతున్నారు అనడానికి అదో ఉదాహరణ. కానీ మీడియాలో, భూ ప్రక్షాళన, బ్లాక్చైన్ టెక్నాలజీతో అని ప్రచారం.

ఒక్క హామీ నెరవేరలేదు. విభజన హామీలు కేంద్రం నుండి అసలు ఏవి అమలుకాలేదో లిస్ట్ తెలియదు. అడగడం చేతకాదు. ఓ ప్రక్క అమరావతి శంఖూస్థాపనలకు హాజరవుతూ, మరో ప్రక్క తన హోమాలకు చంద్రబాబు ను ఆహ్వానిస్తూ, ఎన్నికల సమయంలో ఓట్లడిగేటప్పుడు మాత్రం చంద్రబాబు మీద తిట్ల దండకం, తారక మంత్రం.

జనం మరీ వెర్రోళ్ళు కాదు కదా. అపద్ధర్మం లోకి వచ్చాడో లేదో, తమ అసలు రూపం చూపుతున్నారు.

ఆఖరికి కేసీఆర్ సొంత గజ్వేల్ లో తాను ఓడిపోతానని రూఢీ అయ్యాక, నియోజకవర్గం మార్చుకోవాలనే ఆలోచనలంత, తిరగబడుతున్నారు జనం.

కొత్తగా, మరో కుట్రకు తెరలేపారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలుగుదేశం కీలక ఆర్థిక శాఖ, నీటిపారుదల శాఖ తీసుకొని, ప్రాజెక్టులు కట్టనివ్వకుండా, ఏ పనికి ఆర్థిక శాఖ ఆమోదం ఇవ్వకుండా, అడ్డుపడి, తెలంగాణాను అభివృద్ధి చెందకుండా అడ్డుకొని, భవిష్యత్ లో మళ్లీ ఆంధ్రాలో కలిపేస్తారు అని.

తెలంగాణాకు చేసింది ఏమీ లేకున్నా, చేటుగాలం వచ్చి అహంకారంతో ముందస్తుకు వెళ్లి, ఓటమి తెలుసుకొని, ఒక కుట్ర మీద మరో కుట్రకు తెరతీస్తోంది తెరాస.

అయినా జనం చాలా తేటతెల్లంగా వున్నారు. పాతిక సీట్ల దగ్గర తెలంగాణా రాష్ట్ర సమితి ప్రస్థానం పరిసమాప్తమవబోతోంది. ఇంకా భావోద్వేగాలతో తమ జీవితాలను బలిపెట్టుకోడానికి, అక్కడి జనం సిద్ధంగా లేరు.

ఈ సారి తెరాస ఓటమి తరువాత, ఆ పార్టీ కూడా వుండదు. ఎందుకంటే వారసుడు పార్టీ కార్యకర్తలకన్నా, ఎక్కువగా సెలిబ్రిటీలను ఇష్టపడి, వారితో గడపడంలో, తీరికాలేకుండా సమయం వెచ్చించాడు కనుక.

గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణం లేదు. నియోజకవర్గ నాయకుల స్థాయిలో నిర్మాణం జరిగింది. ఎందుకంటే మాయావతి గారి బిఎస్పీ అలా వుందని అలా తెలంగాణాలో చేశారంట.

ఇక్కడ నియోజకవర్గ స్థాయి అంటే, ఇతర పార్టీల నుండి వచ్చి నిండిన మందే, మొత్తం. అది ప్రభుత్వం ఎటైతే అటు వెళ్లేదని కేసీఆర్ బ్రతికి వుండగానే చూసే అదృష్టం, ఆయన స్వయంకృతం.

ఇప్పటికిప్పుడు కలిసిపోదామని, తెలంగాణా సమాజం కోరుకొన్నా, ఆంధ్రాలో కాలిజోళ్లు & చీపుర్లతో కొడతారు, ఆంధ్రా నుండి దానిని ఎవరు సమర్థించినా.

ఆ విషయం తెలంగాణాలో ప్రజలకు తెలియదని, పన్నే ప్రతి కేసీఆర్ కుట్ర, అక్కడ వికటిస్తూ వెళుతోంది.

ఇవన్నీ తెలిసి, ఓ అంచనాకు వచ్చాకే, బిజెపి మెడకు, ఈ మహాకూటమి గెలుపును ఉరిగా మార్చడానికి, తెలంగాణా ఎన్నికలను ఓ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ క్రింద మలుస్తున్నాయి, తెలుగుదేశం & కాంగ్రెస్ కలిసి. ..చాకిరేవు.

ప్రకటనలు

1 Response to “నాటి నిజాం మీద తిరగబడ్డట్టు, తెలంగాణా టీఆరెఎస్ సర్కారు మీద ఊర్లలో ఎందుకు తిరగబడుతున్నారో తెలుసా? అసలు కథ ఇది, తెలుసుకోండి.”


  1. 1 రవి 3:24 ఉద. వద్ద నవంబర్ 6, 2018

    అద్భుత విశ్లేషణ. నాలుగున్నరేళ్ళ తెరాస పాలనా వైఫల్యాలను చక్కగా వివరించారు

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 889,951

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2018
సో మం బు గు శు
« అక్టో   డిసెం »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: