ఓ శిశువు భూమి మీద రావడానికి పురిటి నొప్పులు & ప్రసవ వేదన తప్పనప్పుడు, అమరావతికి మాత్రం తప్పుతుందా?

విభజ జరిగి ప్రభుత్వం రాజధాని ప్రకటన చేసిన వెంటనే, తటపటాయించకుండా అన్నదాతలు సాటి ప్రజలు ఎన్నుకొన్న సిఎం ను నమ్మి, ముప్పైవేల ఎకరాల పై చిలుకు ఇచ్చారు.

ముంబై స్టాక్ ఎక్చేంజి లో బాండ్లు విడుదల చేసిన గంటల్లో అమ్ముడుపోయాయి.

వీళ్ల దేశంలో ఇలాంటి రాజధానిని అసలు వీళ్లకు కట్టుకొంటారా అని ఆలోచించకుండా ఓ గొప్ప ప్రణాళిక ఇచ్చింది సింగపూర్ దేశం.

ఎవరూ లేని అక్కడ చదివేదానికి ఎవరు వస్తారు అని ఆలోచించకుండా
విఐటీ & ఎస్సార్ఎం యూనివర్సిటీలు భారీ భవనాలు కట్టి తరగతులు మొదలెట్టాయి.

వారంలో ఓ అంతస్థు లెక్క భారీ భవనాలు వెలుస్తున్నాయి.

విశాలమైన రోడ్లు అంతర్జాతీయ ప్రమాణాలు, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు నిర్మిస్తున్నారు.

ముంపుకు గురికాకుండా నిర్మాణాలు పూర్తి అయ్యాయి.

ఎక్కడికి వెళ్లినా మా అమరావతి వచ్చి స్థిరపడండి, అక్కడి నీలి, పచ్చ, స్వచ్ఛ. హరితాలతో మీరు ఆరోగ్యంగా ఎక్కువ ఆయుష్షుతో జీవిస్తారు అని సీఎం చెబుతుంటారు.

హైకోర్టు మొదలు న్యాయనగరం ఇలా వుంటుంది అని సంబంధిత వృత్తిలో పెద్దలకే చూపుతూ సలహాలు ఇవ్వండి అని అడుగుతున్నారు.

ఇలా ప్రతి ఒక్కటీ పేరు నుండి ప్రజల మరియు సంబంధిత వర్గాల అభిప్రాయాలు స్వీకరిస్తూనే వున్నారు ఆరంభం నుండి.

శంఖూస్థాపలో ప్రతి ప్రాంత పవిత్ర మట్టి & నీరు సేకరించి పవిత్రతతో రాజధాని నిర్మాణం.ప్రారంభించారు.

క్రీడలు, వినోదం, ఆతిధ్యం నుండి ప్రతి రంగంలోని వారు తమకు ప్రాతినిధ్యం ఇచ్చే నిర్మాణాల కోసం ఆసక్తితో చూస్తున్నారు.

రాష్ట్రంలో రెండు దిష్టిబొమ్మలను పెట్టుకొని, ఇది అమరావతి అని ఆటంకం కలిగించాలని హస్తిన అసురులు, వారికి స్థానికంగా సహకరించే వారు, ఎన్నో కోర్టు ఆటంకాలు, మరెన్నో ఫిర్యాదులు ప్రపంచబ్యాంకు వరకు. ఘోరమైన రాతలు, ఈటెల్లాంటి మాటలు.

అయినా ఆగుతోందా మన అమరావతి. ఒకే ఒక మనిషికి ఎంత మొండితనం వుంటే, ఎంత ఆలోచన వుంటే అవుతుంది.

ఇంతమంది నమ్మకం ఆయనకు బలం. అది మన ప్రాచీన వారసత్వ వైభవాన్ని సరి కొత్తగా, దేశంలో దానికి ఏదీ సరిరాదు అనేలా, ప్రపంచంలో ఓ గొప్ప రాజధాని అమరావతి అని చెప్పుకొనేలా వెలుస్తుంది.

ఓ శిశువు భూమి మీద రావడానికి పురిటి నొప్పులు & ప్రసవ వేదన తప్పనప్పుడు, అమరావతికి మాత్రం తప్పుతుందా.

అవన్నీ మనమే భరించాలి, సహనంతో అండగా వుండి, ఆ అబ్బురాన్ని మనమే చూసి తరించాలి. తరతరాల చారిత్రకతకు మనమే సాక్ష్యం అని బాధ్యతతో గుర్తెరగాలి. ..చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “ఓ శిశువు భూమి మీద రావడానికి పురిటి నొప్పులు & ప్రసవ వేదన తప్పనప్పుడు, అమరావతికి మాత్రం తప్పుతుందా?”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • అందాల ప్రపంచం పారిస్ ప్రకృతి సేద్య ఆహారం అందాన్నే కాదు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది ఆంధ్రా ప్రకృతి వ్యవసాయ ప్… twitter.com/i/web/status/1… 1 hour ago

వీక్షణలు

  • 866,562

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2018
సో మం బు గు శు
« అక్టో    
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: