నవంబర్ 5th, 2018ను భద్రపఱచు

సిబిఐ కోర్టులో మోడీ ఉలిక్కిపడే మలుపు

సిబిఐ కోర్టులో మోడీ ఉలిక్కిపడే మలుపు

మోడీ గారు సిఎం గా వున్నప్పుడు హత్యకాబడ్డ హోమ్ శాఖా మంత్రి హరేన్ పాండ్యా కేసులో కొత్త ట్విస్టు ఇది

గుజరాత్ పోలీస్ ఆఫీసర్ & ఎంకౌంటర్ స్పెషలిస్ట్ వంజర గారే ష్రాబుద్దీన్ కి చంపే కాంట్రాక్టు ఇచ్చాడని, ష్రాబుద్దీన్ కేసులో కీలక సాక్షి సిబిఐ కోర్టులో చెప్పారు.

అయితే మోడీకి వచ్చిన ఇబ్బంది ఏంది అంటే, త్వరలో అన్నీ మొదటికి వచ్చేలా వున్నాయి. అధికారంలో వున్నా వెన్నంటే ఇవి, దిగితే ఏకంగా మెడకు చుట్టుకొంటాయి.

ఈ మధ్య తెలంగాణాలో వున్నట్టుండి నయీమ్ ని ఎంకౌంటర్ చేశారు. ఆయనకు, ష్రాబుద్దీన్ మరియు తులసి ప్రజాపతికి ఈ కాంట్రాక్టు ఇచ్చింది వంజర అంటున్నాడు సాక్షి.

మన నయీమ్ బతికి వున్నప్పుడు, వైఎస్ హయాంలో, హైదరాబాద్ కు వచ్చి వెళుతున్నప్పుడు, ష్రాబుద్దీన్ ని ఎంకౌంటర్ చేశారు. వెంట వున్న అతని భార్యను కూడా అత్యాచారం చేసి ఎంకౌంటర్ చేశారు. జైల్లో వున్న తులసి ప్రజాపతి ని చంపేశారు.

మన నయీమ్ చనిపోయాక డైరీలు గట్రా చాలా లోతుగా దర్యాప్తు జరిగి, వున్నట్టుండి ఉలుకూ పలుకు లేకుండా పోయింది. మన తెలుగు మీడియా హడావిడి & కేసీఆర్ ప్రభుత్వ అధికారులు, అతనిని ఓ నక్సలైట్ గా సెటిల్మెంట్ చేసే వాడీగా గట్రాల వరకే పరిమితం చేశారు.

గుజరాత్ ఫ్లాష్ బ్యాక్ బయటకు రాలేదు. కానీ గుజారాత్లో విచారణ చేసిన ఓ మహిళా అధికారి ఆ నయీమ్ ఈ నయీమ్ అని ముందే మాకు తెలవలేదు అని వాఖ్యానించారు.

కానీ దాని తరువాత ఈ మధ్య కేసీఆర్ “మోడీ గాడు” అనడం, తరువాత అలా అనలేదు అనడం గమనార్హం.

అంతకు ముందు అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వచ్చి కేసీఆర్ పాలనను పెద్ద ఎత్తున విమర్శించడం, తరువాత వీళ్లూ తిరిగి తిట్టడం తెలిసిందే. అచ్చం ఆంధ్రాలోలా.

కానీ తరువాత రెండు పార్టీల మధ్య పెద్దగా విమర్శలు లేవు. ఢిల్లీ స్థాయిలో కొంత సఖ్యతగా వుండడం బహిరంగ రహస్యమే.

ఆ మధ్య జైల్లో నుండి వంజర కొంచం బెదిరింపు ధోరణిలో మోడీ & అమిత్ షా లకి లేఖలు వ్రాయడం కూడా సంచలనం కలిగించింది. ఇటీవలే వంజర మొదలగు వారి మీద కొన్ని కేసులు డిశ్చార్జ్ కావడం గమనార్హం.

కొన్ని ఏళ్లకు సరిపడే చిత్ర విచిత్ర మలుపులు వున్న మోడీ గారి గుజరాత్ పాలనలోని క్రైమ్ అసాధారణమైన నడిచె యదార్థ గాథ. ఆ వ్యథలో హతులకి న్యాయం ఇంకా జరగలేదు, శిక్షలూ పడలేదు. కానీ నిజం దాగదని, దాయలేరని నమ్ముతున్నా
ఎందుకంటే ఒకదానిని కప్పి పుచ్చడానికి మరొకటి లెక్క ఆగడం లేదు కనుక. …చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 889,951

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2018
సో మం బు గు శు
« అక్టో   డిసెం »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: