కేసీఆర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి

కేసీఆర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి

నాయుడి ఫ్రంట్ కి తెలంగాణా ప్రతిష్టాత్మకం & కేసీఆర్ కి ప్రాణసంకటం.

మన గురించి అసలు సగటు మనిషి ఏమనుకొంటున్నాడు అని తెలుసుకోడానికి, ప్రత్యేక మార్గం ఒకటి వుండాలి. ఆ మార్గంలో చెప్పే వారికి సహనంతో వినే చేష్టలతో ధైర్యాన్ని ఇవ్వాలి. అప్పుడు మనకు ఏమన్నా చేటుగాళం వుందా లేదా ఒక అవగాహన వస్తుంది ప్రజాస్వామ్యంలో.

దండోరాలో చెప్పిన పండగ, నిరంకుశ రాజు గారి సభలో మహోత్సవంలా జరపవచ్చు. కాని రాజ్య ప్రజల కంచం వెక్కిరిస్తే, వర్షించే పేదోడి కన్నీరు, రాజును శపిస్తుంది.

కెసిఆర్,  పొగిడే భట్రాజుల భజనతో పాటు, మీడియాను కూడా పూర్తిగా దానికే కేటాయించాడు. సరిహద్దులు దాటి, పొరుగు రాష్ట్రాలు, దేశం అంతా కూడా మీడియాలలో డబ్బుకు వెనకాడకుండా, ప్రకటనల దండోరాలతో, గొప్పలు చాటాడు.

పొడుస్తున్న పొద్దు మీద పోరు తెలంగాణా తరువాత జరిగే అద్భుతాలను కూడా, ఆ పోరులోనే హోరెత్తించారు. సాకారమయిన విభజన తరువాత, అనుభవంలో వున్న అవస్థలే, గొంగలి పురుగులా. ఇందుకా, శ్రీకాంత్ ఆచారి మంటల్లో మాడిపోయింది అని. ప్రతి ఇంటిలో పొయ్యి మంటా గుర్తుచేస్తూనే వుంది. పుండు మీద కారంలా, తమ బతుకమ్మ కూడా కెసిఆర్ కు పుట్టిన కవితమ్మే అని భ్రమలు కల్పిస్తుంటే, భరించలేకపోయారు.

కెసిఆర్ కుటుంబం అంతా, ఉద్యమ ఫలితాల ఉద్యోగాలలో ఊడ్చేస్తూ, వారి సభల్లో సంబురాలు చేసుకొని, ప్రగతి నివేదనలు చేసుకొంటుంటే, సగటు తెలంగాణా మనిషి కడుపు, పొయ్యి మీద పప్పులా, కెసిఆర్ గొప్పల మీద ఉడికిపోయింది.

ప్రజల గురించి వినే దారి మూసేసుకొన్న కెసిఆర్ , కళ్లకైతే శస్త్ర చికిత్స చేసుకొన్నాడు, పదవి మీద తనే కనుమరుగయ్యే ప్రమాదం గ్రహించలేకపోయాడు.

భట్రాజుల గొప్పల నివేదికలో, అధికారాన్ని పదిలం చేసేయాలని, ఆత్రపడ్డాడు. ముందస్తు అచ్చిరాదన్నా, తనకు కాదని ముందుకెళ్లాడు. అపద్దర్మ ముఖ్యమంత్రి అయిన క్షణం నుండి పాత అస్త్రం తీశాడు. అది పాశుపతాస్త్రం అనుకొన్నాడు. పాచి పోయిన అస్త్రం అని తెలుసుకోలేక పోయాడు. విడిపోయాక, చంద్ర బాబు గాని, పై నున్న తెలంగాణా నుండి వెళ్లే నీటిని క్రింద వున్న ఆంధ్రా ఎలా వాడుకొంటుంది అని ప్రజలు ఆలోచించరా అని కూడా పట్టించుకోకుండా, మళ్లీ ఆంధ్రోళ్లు & చంద్రబాబు అనే అస్త్రమే పారుతుంది అని బయటకు తీశాడు.

అపద్దర్మంలో వున్నాడు, ఇప్పుడు మనలను ఏమీ చెయ్యలేడు అని నిర్దారించుకొన్న జనం, కోపాన్ని బహిరంగా చూపించడం కాదు, గులాబి గుర్తులు కనిపిస్తే, గ్రామ పొలిమేరల వరకు తరుముతున్నారు.

ఇవన్నీ ముందే తెలుసుకోవాల్సిన కెసిఆర్ కంటే ముందు, చంద్రబాబు బాగా తెలుసుకొన్నట్టున్నాడు. దేశంలో తన ఫ్రంటుకు, ప్రయోగంగా తెలంగాణానే ఎంచుకొన్నాడు. ఇక్కడి విజయాన్ని దేశానికి చూపిస్తే, బాబు ప్రయోగం బ్రహ్మాండం అంటుంది దేశం. అటూ ఇటు అయితే, కెసిఆర్ ఫెడరల్ లా, తన ఫ్రంటు కూడా, నవ్వుల పాలు అయ్యి, మఖలో పుట్టి పుబ్బలో లో కలిసిపోయినట్టు కలిసిపోతుంది. అది బాబుకు తెలుసు. ఆచి తూచి అడుగులు వేస్తూ, వున్నఫలంగా ఢిల్లీలో  40 ఏళ్ల అనుభవ విశ్వరూపాన్ని, దేశ రాజకీయ పక్షాలకు చూపాడు.

ఆ దర్శనం చేసుకొన్న ప్రతి ఒక్కరికీ, కెసిఆర్ ఓటమితో, మీడియా తన పేరునే పెట్టిన నాయుడి ఫ్రంట్ మీద నమ్మకం కలిగేలా చేసుకోవడం, ఆయనదే బాధ్యత. అందుకే తెలంగాణాలో తన పార్టీ త్యాగాన్ని కూడా, ఉదహరించడానికి మానసికంగా తయారు చేసాడు ముందే శ్రేణులను. అతి తక్కువ స్థానాలు తీసుకొని మరీ, కెసిఆర్ & వెనకున్న కమలదన్ను కుంభస్థలాన్నే, కూల్చే కంకణం కట్టుకొన్నాడు. కెసీఅర్ కి ప్రాణసంకటం కాదు, ఓటమి లాంచనమే.

తలంగాణాలో నాయుడి కూటమి దేశ రాజకీయాలను మరో మలుపు తిప్పే నాంది అవుతుంది.

ఎటూ కనుమరుగు కానున్న కేసీఆర్ ని ఒక్క మాట అనకుండా, మేము కలిసి వుందాం అనుకొన్నా కాని ఆయన ఒప్పుకోలేదు. ఆయన ఏ పక్షమో ఆయననే అడగండి, ఆయన చెబితేనే బావుంటుంది అని నర్మగర్భంగా బాబు అన్న మాటలు, కెసిఆర్ చెవుల్లో బాంబుల్లా వినిపిస్తూ వుండోచ్చు. ఇప్పుడు చేసేదేమీ లేదు. మహాకూటమితో యుద్ధంలో మాకు వీరస్వర్గం అని కెసీఅర్ తన మనసుకు సర్దిచెప్పుకోవడం తప్ప. …..చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “కేసీఆర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి”  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 889,951

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2018
సో మం బు గు శు
« అక్టో   డిసెం »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: