నవంబర్ 2nd, 2018ను భద్రపఱచు

నాయుడి ఫ్రంట్ గురించి బిజెపి పరివారాలు ఎంత సంతోషపడుతున్నాయో?

నాయుడి ఫ్రంట్ గురించి బిజెపి పరివారాలు ఎంత సంతోషపడుతున్నాయో?

కాంగ్రెస్స్ మీద దశాబ్దాల వ్యతిరేఖత గీతను దాటి, దేశం కోసం తెలుగుదేశం దగ్గరయ్యింది. అదే దేశం పేరు వింటే, జై బారత్ మాత అనే సంఘ్ పరివారానికి అంతే వెసులుబాటు వుంటే, దానిలోని పాతతరం సంతోషంతో గావు కేక పెట్టేదేమో.

ఇప్పుడైతే కేంద్రంలో ఏకచత్రాధిపత్యం వుంది కాబట్టి, నేరుగా అమిత్ షా నుండి బిజెపి పార్టీలోని అందరూ, న్యాయస్థానాల మీద వాఖ్యలు చేసేస్తున్నారు. శబరిమల అయ్యప్ప గొడవ నుండి అయోధ్య మందిరం వరకు.

కాని ఇప్పటిలా ఒకప్పుడు దానికి బలం లేదు. అందుకే సంఘ్, భజరంగ్ దళ్, విహెచ్‌పి మొదలైన అనుబంధ సంస్థలను అందుకు వినియోగించి, వివాదాస్పద వాఖ్యానాలు చెయ్యించేది. క్రికెట్ పిచ్ త్రవ్వుతామనో, ప్రేమికుల రోజు పండగలు చేసుకొంటే, పెళ్లి చేస్తామనో అవే కలగజేసుకొనేవి. బిజెపి మాత్రం పరిశుద్ధ రాజకీయ పార్టీగా వుండేది. దేశంలో ఏ పార్టీకి ఈ వెసులుబాటులు లేవు.

దేశం అంతా విస్తరించేసాం అనే ధైర్యం వచ్చేసరికి, గుజరాత్ గుత్తాధిపత్యానికి ఎదురు వుండకూడదని, ఒక్కో సంస్థనూ అణచివేశారు. ముందులా అవి అంత స్వేచ్చగా లేవు. ఎక్కువ కార్యకలాపాలు చేయడంలేదు.

తొగాడియా నుండి అలా చాలా మంది. కాని సంఘ్ లో, అది పుట్టినప్పటి కంటే పెద్దాయన మాదవ్ గోవింద్ వైద్య గారు. సంఘ్ తరపున మాట్టాడే వారు, దానిలొ పనిచేసారు.

2012 లో మోడీ గారిని ప్రధాని అని సంఘ్ అనుకోలేదు. కాని అప్పటి బిజెపి అధ్యక్షుడి (గడ్కరీ) మీద వ్యతిరేఖ కథనాలు వచ్చాయి. దాని వెనుక గుజరాత్ నుండి మోడీ గారి మనుషులు వున్నారని, ఎంజి వైద్య గారు తన బ్లాగులో వాఖ్యానించారు. ఆ మాటన్న ఆయన అబ్బాయి, మన్‌మోహన్ గోవింద్ వైద్య గారు కూడా సంఘ్ లో మీడియా సెల్ లో పనిచేస్తారు.

సీనియర్ వైద్య మాటలను జూనియర్ వైద్యతో అంటే కొడుకుతోనే ఖండింపజేసారు, అది ఆయన వ్యక్తిగతం అని. గడ్కరీ ద్వారా కూడా అదే చెప్పించారు. అదీ గుజరాత్ బలం. అప్పటికే వున్న గుత్తాధిపత్యం. వాజ్‌పేయి గారు గోవాలో మోడీ రాజీనామా కోరినప్పటికే, ఆ స్థాయికి ఎదిగారు మోడీగారు.

ఓ సారి అద్వానీ అలక వహించి, అన్ని పదవులకూ రాజీనామా చేస్తా అంటే, పెద్ద వైద్యగారు మాట్టాడుతూ, అద్వానీ అనుచరులంతా కూడా పార్టే వీడిపోతారేమో అని ఆందోళన వ్యక్తం చేసారు.

ఇలాంటి పరిష్థితులలోనే, సంఘ్ లో ఓ పెద్ద వ్యక్తి, మోడీ మీద పుస్తకం వ్రాసిన ఓ రచయితతో, మోడీ గారు శివలింగం మీద తేలు లాంటి ఉపమానాన్ని వాడారు.

అదే ఇటీవల శశిథరూర్ చెబితే వివాదాస్పదం చేస్తున్నారు. అచ్చం అలా సుబ్రమణ్య స్వామి, రాజీవ్ & సోనియా గాంధీల గురించి, ఏ చెత్త వ్రాసినా ఎవరూ ఖండించరు. కాని, వీరి గురించి చెబితే వులిక్కిపడి క్షమాపణలు కోరుతారు.

పటేల్ విగ్రహం పెట్టి మొన్న పొగిడిన నోర్లే, దేవ గౌడ గారు ప్రధానిగా వున్నప్పుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని, అహ్మదా విమానాశ్రయానికి పెడితే, వ్యతిరేఖించడం గమనార్హం.

అంతటి జ్ఞాపక శక్తి జనానికి లేదనే, దేశంలోని ఒక్కో వ్యవస్థను అహంకారంతో గుప్పిట పడుతూ వస్తున్నారు, సొంత సంఘ్, భజరంగ్ దళ్, విహెచ్‌పి లు అయ్యాక.

దేశంలోని అన్ని పార్టీలు తిరగబడుతున్నాయి. నాయుడు ఫ్రంట్ పెట్టాక. అన్నింటికీ ధైర్యం వచ్చింది. ఓ కదలిక మొదలయ్యింది. బిజెపి హెడ్ క్వార్టర్స్ లో కలవరం మొదలయ్యింది.

తెల్లారే సరికి సంఘ్ గుర్తుకు వచ్చి బిజెపి అధ్యక్షుడు పరుగున మహారాష్ట్రలో వాలారు. సంఘ్ లో చిన్నా పెద్ద తో సమావేశాలు జరుపుతున్నారు.

ఓ విధంగా దేశ వ్యవస్థలను కాపాడ్డమే కాదు, బాబు పుణ్యం బిజెపి సొంత అనుబంధ సంస్థలలోని పాత తరం కూడా, ఎగిరి గంతేస్తూ, మనసులో దీవిస్తూ, ఆశీర్వదిస్తూ వుంటారు.

ఒకప్పుడు బిజెపి పార్టీ కార్యాలంలోకి రానించక పోతే, తన కార్యాలయంలో కూర్చోబెట్టుకొన్న తొగాడియా, తన ద్విచక్రవాహంలో మోడీ తో గుజరాత్ అంతా చక్కర్లు కొట్టిన వ్యక్తి. ఇటీవల ఆయన అనుచరుల ఆధిపత్యం నుండి విహెచ్‌పి ని దూరం చేసారు. ఆయన ఏకంగా, నన్ను చంపేస్తారని మీడియాతో చెప్పే వరకు వెళ్లింది ఎవ్వారం.

నా అనుమానం ఆపరేషన్ గరుడా కూడా అలానే బయటకు వచ్చి వుంటుంది, కుట్రల సమావేశాల నుండి.

అలాంటి వారంతా నాయుడి అడుగును, ఆంధ్రా అడుగులను ఎంత ఆనందిస్తారో. ….చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 889,951

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2018
సో మం బు గు శు
« అక్టో   డిసెం »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: