నాడు బ్రిటీషోడు బిత్తరపోయాడు, నేడు మనకు ప్రధాని కాదని తలచుకోవడం మానేసాడు

నాడు బ్రిటీషోడు బిత్తరపోయాడు, నేడు మనకు ప్రధాని కాదని తలచుకోవడం మానేసాడు

“ఓ తెలుగోడు చొక్కా విప్పి గుండె చూపిస్తే, తుపాకీ లో గుండ్లు వున్నా, ప్రకాశం పంతులను చూసి, గుడ్లు తేలేసాడు బ్రిటీష్ వాడు”.

దేశ బాష లందు తెలుగు లెస్స అని చెప్పింది పొరుగు శ్రీ క్రిష్ణదేవరాయలు. అందుకే ఈనాటికీ రాయలు పేరు మా తెలుగు తల్లికి మల్లె పూ దండ గేయంలో వుంది. విభజించినా ఆ గేయంలో ఒక్క పదమూ మార్పులు చేయక, నిజమైన సమైఖ్యత చాటుతోంది, ఆంధ్రా.

దేశానికి మూడు రంగుల పతాకం అందించినదీ ఈ గడ్డే. జాతీయ గీతాన్ని స్వరపరిచిందీ ఈ గడ్డే.

ఈ గడ్డతో పెట్టుకొన్న తిరుగులేని ఇందిరనే గడగడలాడించి, తన మూర్ఖ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనేలా చేసి, అన్న నందమూరిని అధిష్టింపజేసిందీ ఈ గడ్డే.

తగు ఆత్మస్థైర్యం లేక, ఆంధ్రా చంద్రాన్ని చూసి, శిఖరం ముందు, తనకు తానే మరుగుజ్జులా, మానసికంగా భావించి, సంకుచిత మనస్థత్వంతో, అడుగడుగునా అంధ్రా హక్కులను కాలరాస్తూ, అధికారం వెళ్లదీస్తున్నాడు.

ఆంధ్రోడి ప్రశ్నలకు, హస్తిన సభలో బిత్తరపోయి, దేశం నవ్వేలా తత్తరపడి, ఏ ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పలేదు. జాతీయ మీడియా ద్వారా నాలుగు సార్లు బాబు ప్రశ్నించినా, మాటలు లేక, మన్మోహన్ సింగ్ కు మించిన మౌనంతో, తానూ ఓ ప్రధాని అని అనుకొనేస్తున్నాడు. సిగ్గులేని అధికారాన్ని అనుభవిస్తున్నాడు.

అదే గుజరాత్ గడ్డలో దేశ సమైఖ్యతకు కృషి చేసిన సర్దార్ ముందు ఈ కురచ ప్రధాని ఎవరికి? ఎందుకు? తెలుగును మరిచి అవమానపరిచిన ఈయన, ఆంధ్రాకు తానే ప్రధాని కాదని, చేతల్లో చాటుకొన్నాడు.

ఆంధ్రాకు ప్రధాని అయ్యే అర్హత లేదని ఆయనే ఒప్పేసుకొన్నట్టుంది. శ్రీకాకుళం తుఫాను సాయం లోనే, తెలుగోడు థూ అనుకొన్నాక, ఇక తెలుగులో వ్రాస్తే ఎంత, రాయకపోతే ఎంత? ….చాకిరేవు.

ప్రకటనలు

1 Response to “నాడు బ్రిటీషోడు బిత్తరపోయాడు, నేడు మనకు ప్రధాని కాదని తలచుకోవడం మానేసాడు”


  1. 1 Jai Gottimukkala 12:22 సా. వద్ద నవంబర్ 1, 2018

    “ఐక్య భారతం శ్రేష్ఠ భారతం” అంటూ పప్పుకు ఆమ్మ సమాధానం:

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • అందాల ప్రపంచం పారిస్ ప్రకృతి సేద్య ఆహారం అందాన్నే కాదు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది ఆంధ్రా ప్రకృతి వ్యవసాయ ప్… twitter.com/i/web/status/1… 1 hour ago

వీక్షణలు

  • 866,562

తడి ఆరని ఉతుకులు

అక్టోబర్ 2018
సో మం బు గు శు
« సెప్టెం   నవం »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: