పరిపూర్ణానందస్వామి గారికి… నా స్వార్థంతో,

పరిపూర్ణానందస్వామి గారికి… నా స్వార్థంతో,

మిమ్మల్ని మీ పేరులో వున్న స్వామితో పాటు గౌరవంగా పలకడం అలవాటు. మీరు వయసులో ఓ సంవత్సరం పెద్దవారు. నా ప్రాపంచిక విషయాలతో విసుగొచ్చినప్పుడు, ఆధ్యాత్మికత ఒయాసిస్సులా కనిపించేవారు మీరు. మీ మాటలు విన్నంత సమయం కొంత స్వాంతన కలిగేది. గృహస్తు జంజాటం నాది. కాబట్టి, తప్పక కుక్కతోక లాంటి మనసు, మళ్లీ ప్రాపంచిక ప్రపంచంలో పడేస్తూ వుండేది.

మీరు కూడా ఈ ప్రాపంచిక రాజకీయ ప్రపంచానికి వచ్చినందుకు స్వాగతం, సుస్వాగతం & సంతోషం.

ప్రాపంచికంలో నేను నుండి రాష్ట్రం వరకు మాత్రమే పట్టించుకొనేవాడిని. దేశం గురించి కూడా కొద్ది మాత్రం దేశ భక్తితో తెలుసుకొనేవాడిని. తెలుసుకొన్న కొద్దిలో కాంగ్రెస్స్ పాలన అంతా కుంభకోణాల మయం గా కనిపించింది. ఆ మిడి మిడి జ్ఞానంతో మోడీ వస్తే భారత దేశం సనాతన ధర్మం వైపు మరలుతుంది, అన్యాయానికి గురైన నా ఆంధ్రాకు కూడా అండ దొరుకుతుంది అని మనసా వాచా నమ్మా.

నా పిచ్చి, కాషాయం రంగు & కమలంలో దేశ భక్తి కనిపించేది. మోడీ గెలిచి పార్లమెంటు ముందు నేలను ముద్దాడి లోనికి వెళ్లాడని తెలుసుకొని & ఆ చిత్రాలు చూసి పులకించి & ముగ్దుడయ్యా.

అంతా అలాగే వుంటే భగవంతుడిని కూడా మరిచిపోయేవారమేమో, మీలాంటి స్వాములు కూడా గుర్తొచ్చే వారు కారేమో. అమరావతికి పవిత్ర మట్టి & నీరు తెచ్చినప్పుడు, నొసట భృకుటి పైకి లేచేలా ఆలోచన వచ్చినా, మన మోడీ గారు కాబట్టి పెద్దగా అనుమానం రాలేదు.

కాని మెల్ల మెల్లగా అప్పటి నుండి విభజన హామీల విషయంలో నా ఆంధ్రాని చిన్న చూపు చూస్తున్నాడని మీడియాలో వస్తున్నా, ఇక్కడ చంద్రబాబు రాజకీయం ఏమో అని మనసుకు సర్ది చెప్పుకొనేవాడిని. కానీ తన అధికార కార్యాలయం దగ్గర, ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టు బోనులో తిరిగేవారు తచ్చాడుతూ వున్నారని విన్నా, ఏదో తప్పుగా విన్నామని అనుకొన్నా. కాని కలిసి చిత్రాలు కూడా తీసుకొని మనకు తెలిసేలా చేసినప్పుడు, మబ్బులు విడిపోవడం మొదలయ్యింది.

అప్పుడు మొదలెట్టా, అసలు ఈ మోడీ జాతకం ఏంది, చరిత్ర ఏంది అని. కొన్ని పుస్తకాలు చదివా, రానా అయూబ్ అచ్చేసిన గుజరాత్ ఫైల్స్ పుస్తకం చదివా. ఒళ్లు గుగుర్పాటుకు గురయ్యింది. కొన్ని రాత్రులు నిద్ర పట్టలేదు, ఈ దేశం ఏమయిపోతుందో, ఆయన చేతిలో అని. ఓ పుస్తకంలో తాజాగా శశిథరూర్ చెప్పిన వాఖ్యాన్ని కూడా చదివా. వెంటనే ఆరెసెస్ మీద జాలి కలిగింది. ఎందుకంటే అలా వాఖ్యానించింది, ఒక సుధీర్ఘకాలంగా ఆ సంస్థలో వున్న అనుభవం వున్న నేత అని సదరు రచయిత ఉటంకించారు కాబట్టి. ఏమన్నారో తెలుసా, ఆరెసెస్ శివలింగం లాంటిది అయితే దాని మీద తేలు లాంటి వారు మోడీ గారు, చేత్తో తోసెయ్యలేము, చెప్పుతో కొట్టలేము అని వుంది.

బహుశా లెఫ్ట్ బావజాలమో, పశ్చిమ దేశాల కుట్రతోనో, అలా చిత్రీకరించి వుండొచ్చొనే అనుమానం కూడా వచ్చింది, నేనూ మనిషినే కదా, మోడీ గారి మీద అంత నమ్మకం, అంత త్వరగా ఎలా తొలగిపోతుంది.

మోడీ గారి గుజరాత్ పాలనలో పని చేసిన నలుగురు ఐపిఎస్ లను గురించి తెలుసుకొనే కొద్ది, భయం వేసింది. వారు ఐఐటి నుండి వచ్చిన విద్యావంతులు, కొందరు సివిల్స్ లో ఐఏఎస్ వచ్చినా, ఉప్పొంగే యువరక్తంతో ఐపిఎస్ ఎంచుకొన్నారు. అలాంటి నలుగురూ, నాటి మోడీ పాలన మీద తిరగబడ్డారు. ఒక్కరూ ఈ రోజు సర్వీస్లో లేరు. కొందఱు ఐఏఎస్ లకు కూడా ఆ దుర్గతి పట్టింది. ముప్పై మందికి పైగా పోలీస్ ఆఫీసర్లు జైలు పాలు అయ్యారు. ఎంకౌంటర్లకు, గోద్రా నరమేధ అల్లర్లకు, ఇప్పటికీ దేశంలో న్యాయం జరగలేదని జాలి, బాధ ఎన్నో రకాల భావాలు కలిగాయి. కానీ నాటి ఆ పాలనలో అధికారంలో వున్న మోడీ గారు నేడు ప్రధానిగా, మీకు పార్టీ సభ్యత్వం ఇచ్చిన అమిత్ షా గారు బిజెపి అధ్యక్షులుగా వున్నారు.

ఆలస్యంగా తెలుసుకొని పశ్చాత్తాపంతో వున్నప్పుడే, మొన్న ఈశాన్య రాష్ట్ర ప్రమాణస్వీకరంలో అద్వానీని అవమానించినదీ చూసి, అయ్యోపాపం అనిపించింది. అదే సమయంలో నా మీద నాకే జాలి కలిగింది.

ఆధ్యాత్మిక విషయాలలో మీరు గొప్పవారు. పశ్చాత్తాపం మించిన ప్రాయశ్చిత్తం లేదని మన వేదాలు చెబుతాయి. అలాంటి స్థితిలో వున్న నాకు, మీరు ఆ పార్టీలోకి వెళుతుంటే, సంతోషంగా అనిపించింది. ఆనందంతో ఆశలు చిగురించాయి.

అధికారంలో వున్న మీ పార్టీ పెద్దలిద్దరినీ, మీరే సంస్కరించగలరని భావిస్తున్నా. కళియుగ వైకుంఠనాథుడే మిమ్ములని పంపారని భావిస్తున్నా. తన పాదాల చెంత ఆడిన మాటలే, తప్పే వారి కోసం, తప్పక మీరు వెళ్లాలని ఆదేశించి వుండవచ్చు. రాజధర్మం గురించి వాజ్‌పేయి చెప్పినా, ఆయనే హేళనకు గురికాబడి, క్రమంగా పార్టీకి దూరం అయ్యి, ఇటీవలే అందనంత దూరాలకు వెళ్లిపోయాడు. ఆయన అంతిమ యాత్రలో పరుగులెట్టే అభిమానం ఇంకా వున్న మీ పార్టీ పెద్దల్లో, మీరే మార్పు తేగలరు. అది అవసరం కూడా. ఆ పార్టీ ఈ దేశానికి అవసరం. వీరి చేతుల్లో అది చచ్చిపోకూడదు.

నాకున్న ప్రాపంచిక అనుభవంతో (బహుశా మిడి మిడి జ్ఞానం కూడా కావొచ్చు), కాంగ్రెస్స్ కాని, మరో సంకీర్ణ కూటమి గాని అధికారం లోకి రావడం ఖాయం. వారు తప్పు చేసినప్పుడు దేశానికి ప్రతిపక్షం అవసరం. ప్రజాస్వామ్య అవసరం కూడా. సమయానికి మీరు చేరారు. వినే వారు అధికార పక్షంలో వుండి, మీ లాంటి వారు ప్రతిపక్షంలో వుండి, తప్పొప్పులు చెబితే, దేశం కొత్తపుంతలు త్రొక్కుతుంది.

ఈ వేద భూమిలో సన్యాసులు మొత్తం రాజకీయాల్లోకి వెళ్లిపోతే, మా బోటి వారికి దొరికే కొద్దిపాటి ఆధ్యాత్మికతా కొరవడుతుంది. దేశానికి అది కూడా అరిష్టమే. కాబట్టి మీరే ఆఖరు కావాలి. మాకు మనశ్శాంతి కూడా కొంతైనా కావాలి. ఇది నా స్వార్థం మాత్రమే స్వామి. …చాకిరేవు.

ప్రకటనలు

7 Responses to “పరిపూర్ణానందస్వామి గారికి… నా స్వార్థంతో,”


 1. 1 Anon 3:06 సా. వద్ద అక్టోబర్ 29, 2018

  పోనే ఆ మాత్రం గౌరవమిచ్చావు స్వామికి. గుండె తెరిచే పిచ్చి కార్యక్రమంలాగా వెకిలిగా పొగరుగా అనలేదు. త్వరలో పచ్చ పైశాచికానికి స్వామి కూడా బలే.

  మెచ్చుకోండి

 2. 2 Zilebi 12:48 ఉద. వద్ద అక్టోబర్ 30, 2018

  ఈ టపా రాసింది నిజ్జంగా చాకిరేవు గా రే నా ? 🙂

  జిలేబి

  మెచ్చుకోండి

 3. 3 Jai Gottimukkala 6:08 ఉద. వద్ద అక్టోబర్ 30, 2018

  గుజరాత్ అల్లర్లు అప్పుడెప్పుడో జరిగాయి. రాణా అయూబ్ రాసిన పుస్తకం కూడా చాలా పాతదే. మీరు ఈ విషయాలను కొత్తగా తెలుసుకున్నారేమో కానీ మీ అభిమాన నాయకుడికి మాత్రం ఇవి అప్పటి నుండే తెలుసు కదా.

  అవన్నీ తెలిసి కూడా మోడీతో ఎందుకు జత కట్టారోనని మీ పార్టీ వారిని నిలదీయాలని మీకు ఎందుకు తట్టడం లేదు? ఇప్పుడిప్పుడే కమలతీర్థం పుచ్చుకున్న కొత్త సాములోరు మోడీ-షా ద్వయాన్ని సంస్కరించాలని అడిగే బదులు ఆ సంస్కరణలు ఏవో ఎందుకు చేయలేదని దేశంలోనే సీనియర్ మోస్ట్ నాయకుడిని ఎందుకు అడగరు?

  మెచ్చుకోండి

 4. 4 బాబు 6:16 ఉద. వద్ద అక్టోబర్ 30, 2018

  అవునండి నేనే వ్రాసాను.

  మెచ్చుకోండి

 5. 5 బాబు 6:19 ఉద. వద్ద అక్టోబర్ 30, 2018

  వాజ్పేయి గారికి చెప్పి, రాజధర్మాన్ని చెప్పిస్తే, ఎగతాళి చేసారు. ప్రధాని పదవి వచ్చాక 29 సార్లు వెళ్లి చెప్పారు. ఆంధ్రా అసెంబ్లీలో నుండి చాలా సార్లు చెప్పారు. ధర్మదీక్షల ద్వారా చెప్పారు. పార్లమెంటులో అవిశ్వాసం పెట్టి చెప్పారు. గత శనివారం నాలుగోసారి జాతీయ మీడియా ద్వారా చెప్పారు. ప్రయత్నిస్తూనే వున్నారు, ఓ అనుభవం వున్న నేతగా. గుడ్లేసుకొని చూస్తున్నారు అందరూ. మీకు ఎందుకో కనిపించడం లేదు.

  మెచ్చుకోండి

 6. 6 Jai Gottimukkala 7:03 ఉద. వద్ద అక్టోబర్ 30, 2018

  నిప్పు 29 సార్లు ఢిల్లీ వెళ్ళింది గుజరాత్ అల్లర్లు, రాణా అయూబ్/సంజీవ్ భట్ గార్ల ఆరోపణల గురించా?

  వాజపేయి హితోక్తులు మోడీ పెడచెవిన పెట్టింది గతంలో తమరు ఎన్డీయేలో ఉన్నప్పటి సంగతి. ఆ తరువాత బయటికి వచ్చిన వాళ్ళు అది తెలిసే మళ్ళీ వెనక్కు వెళ్లడం జరిగింది.

  The so called (self proclaimed) senior most leader knows all about Gujarat riots *before* rejoining NDA just before 2014 elections. ఆయన చంచాలకు చరిత్ర తెల్వదేమో కానీ ఆయన తెలివి ఏమైంది?

  మెచ్చుకోండి

 7. 7 kollurirao 2:09 సా. వద్ద నవంబర్ 5, 2018

  ఇది నా స్వార్థం మాత్రమే స్వామి. I am also selfish like you.

  మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

 • 889,951

తడి ఆరని ఉతుకులు

అక్టోబర్ 2018
సో మం బు గు శు
« సెప్టెం   నవం »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: