పాదయాత్ర క్లైమాక్స్ లో, జగన్ పరువెందుకు తీసుకొన్నాడు? పావుగా మారాల్సిన పరిస్థితి ఏంది?

పాదయాత్ర క్లైమాక్స్ లో, జగన్ పరువెందుకు తీసుకొన్నాడు? పావుగా మారాల్సిన పరిస్థితి ఏంది?

అన్ని జిల్లాలూ పాదయాత్ర చేసుకొంటూ వచ్చి, ఇంకో జిల్లా మాత్రం మిగిలి వుండగా, కోడి కత్తితో పరువు తీసుకొనే తెలివి తక్కువ వ్యక్తి కాదు జగన్. సంఘటన జరిగిన ప్రదేశంలో కూడా నవ్వుతూ, నమస్కరిస్తూ, అక్కడి నుండి నిష్క్రమించిన విషయం, అందరికీ తెలిసిందే.

పులివెందుల పులి బిడ్డ స్థాయి నుండి సీమ టపాకాయ్ లా ఎందుకు మారాల్సి వస్తోంది?

సిఎం పదవి బదులు, అసలు తను బయటవుంటే చాలు అనే భయానక పరిస్థితికి నెడుతున్న, జాతీయ & అంతర్జాతీయ స్థాయిలో సమస్యలు. పైకి ఎంత మేకపోతు గాంభీర్యంతో సెల్ఫీలు తీసుకొంటున్నా, లోపల మానసిక సంఘర్షణ.

డబ్బులు ఖర్చుపెడితేనే పోగయ్యే జనం & ఫ్లెక్సీలు అంటే, ఎవరికి మాత్రం విసుగెయ్యదు? నవరత్నాల నుండి ఎన్ని హామీలు ఇస్తున్నా, పైకి లేవని పార్టీ అంటే ఎవరికి మాత్రం విరక్తి వెయ్యదు? వేల కోట్ల డబ్బున్నా, మనఃశాంతి లేకుండా, రాజకీయ పులి స్వారీనీ పావులా చెయ్యక తప్పని పరిస్థితి. దిగితే వ్యక్తితగ జీవితానికే స్వేచ్చ వుండదు. దానికోసం ఎవరో చెబితే, చెప్పినట్టు విని, చెయ్యాల్సిన ఖర్మ.

కోడి కత్తి తో జాకీలోకి దూర్చి ప్రయత్నిస్తే పార్టీ పైకి లేవదని తెలుసు. తాత నుండి తన వరకు తన కులంలో వున్న పరువు ప్రతిష్ట పణంగా పెట్టి, ఆడించిన నాటకంలో, ఆ పాత్రలో ఒదిగిపోక తప్పని స్థితి.

ట్రంపు టార్గెట్ గా, అమెరికా ఎన్నికలకు ముందే, ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ డెకాయిట్ ఫిర్టాష్ కోసం, అమెరికా ఎఫ్‌బిఐ కేసు విచారణ మొదలెట్టింది. కాని టైటానియం కుంభకోణం కోసం, మా గడ్డను వాడుకొన్నారని ఫిర్టాష్, వైఎస్ & కెవిపి ల పేర్లతో సహా చికాగో కోర్టులో కేసు వేసింది. ఇందులో ముడుపులు తీసుకొని & టైటానియం కోల్పోతున్న భారత దేశానికి లేని బాధ మీకేమని, ఎఫ్‌బిఐ మీద ఫిర్టాష్ లాయర్లు డిఫెండ్ చేసినా, పన్ను ఎగవేత దేశాల నుండి, భారత దేశ డొల్ల కంపెనీల బదిలీకి మా గడ్డ మీద కంపెనీల ద్వారా అవినీతి చెల్లింపులు చేసారని, శిక్షించే ఆ హక్కు మాకు వుందని వాదించింది.

ఇందులో ఎక్కడా జగన్ పేరు లేదు, ప్రస్తావించలేదు. కాని అవి పట్టుకొన్న కంపెనీలలో సిప్రస్ నుండి చెల్లింపులు వచ్చినవి పట్టుకొంది. చిలుక ప్రాణం అన్నట్టు మన జగన్ కేసుల తాలూకూలో ఈ సిప్రస్ కీలకం. ఆ బాంధవ్యం అటువంటిది.

మొన్న యూరోపియన్ యూనియన్ లక్సంబర్గ్ కోర్టు, ఫిర్టాష్ మీద ఆస్ట్రియా కోర్టు ఇక నిర్ణయం తీసుకోవచ్చు అనంగనే, ట్రంపు వ్యతిరేఖులు అమెరికాలో తన్మయం చెందారు. ట్రంపు మేనేజర్ కి ఇక మూఢిందే అన్న గాఢ నమ్మకం. కాని పట్టుకొస్తోంది మన టైటానియం విచారణ ప్రధానంగా చెప్పి. కాబట్టి దానికి శ్రీకారం చుడుతుంది అది. ఎఫ్‌బిఐ అంటే అమెరికా అధ్యక్షుడి నుండి ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడి వరకు ఎవరూ కలగజేసుకోరు. కొరివితో తలగోక్కొన్నట్టే. మన దేశంలో ప్రధాని ఆఫీసు చుట్టూ తిరిగితే ప్రభావితమయ్యే వ్యవస్థల లాంటి అవస్థల్లో అది లేదు.

అది అంతర్జాతీయ సమస్య అయితే, పులి మీద పుట్రలా, సిబిఐ లో, 1 & 2 స్థానాల్లో వున్న అధికారుల గొడవలు, సెలవులకు దారితీసినా, అది జగన్ మెడకు చుట్టుకొనేలా తయారయ్యింది. వాన్‌పిక్ కు ముడుపులు పంపారు మీరు అంటే కాదు కాదు అంటూ సానా సతీష్ బాబు ఏకంగా సిబిఐ కే ఇచ్చానని, ఆ సంస్థే విచ్చిన్నం అయ్యే , కేసు పెట్టారు. వాన్‌పిక్ నిమ్మగడ్డ ప్రసాద్ గారి సోదరుడు డైరెక్టరుగా చాల కంపెనీలలో సతీష్ బాబు సానా గారు వున్నారు. ఇప్పుడు మేటరు సుప్రీం కు చేరింది. సిట్టింగ్ జడ్జ్ & సివిసి పర్యవేక్షణలో విచారణలు. వాన్‌పిక్ అంటే జగన్ సాక్షి తో సహా చాలా కంపెనీలలో పెట్టుబడులు పెట్టినవి. అరిటాకులా మారింది జగన్ పరిస్థితి. అరిటాకు పడ్డా, ముల్లు పడ్డా, అరిటాకే చిరుగుతుంది. మరో ప్రక్క ఏడాదిలో రాజకీయ నాయకుల కేసులు తెమల్చాలన్న సుప్రీం కోర్టు. తిన్నగా ఏ మనిషినీ నిలవనియ్యవు. మానసికంగా నలిగిపోయే వార్తలతో & విచారణలతో విసిగిపోయే జగన్ కే అర్థం అవుతాయి, వాటి లోతు ఎంతో.

ఈ పరిస్థితుల్లో చిగురుటాకులా వణికే జగన్ కు జోకర్ గా నవ్వించాలని ఆదేశాలు వచ్చాయి. విషాదకరం అయినా ఆడక తప్పని స్వయంకృతం. కోడి క్తత్తిని జాకీలోకి దూర్చి జోకర్ లా నవ్విస్తున్నాడు. రాజకీయంగా నష్టపోక తప్పదని తెలుసు. వ్యక్తిగత సేచ్చా స్వాతంత్రాలకోసం మసలుకొంటున్నాడు.

పాదయాత్ర చివరి అంకానికి వస్తున్నా రాజకీయ చేరికలు లేవు. తెలివైన నాయకులు దూరాలోచనతో దూరంగా వున్నారు. బలం వున్న నియోజకవర్గాలలో కూడా పీలికలూ అవుతూ జగన్ పట్టుకోల్పోయేలా వెక్కిరిస్తున్నాయి.

కాంగ్రెస్స్ ఒంటరిగా గెలిచే రాష్ట్రాలు మాయం అవుతున్నాయి. అదే సమయంలో అక్కడ బలమైన ప్రాంతీయ పార్టీని ఎదుర్కోడానికి మిగిలిన ప్రాంతీయ పార్టీలను మింగేస్తోంది బిజెపి. యుద్ధ సమయానికి చవటల్లా చేస్తోంది. పొరుగున ఎఐడిఎంకె, టీఅర్ఎస్, ఇక్కడ వైకాపా ఉదాహరణ.

తెలివిడితో దాని విష కౌఉగిలినుండి బయటపడి బట్టకట్టింది తెలుగుదేశం.

వ్యవస్థలన్నీ గుప్పిట పడుతోన్న బిజెపికి, కేసులు, అక్రమ సంభందాలు, అవినీతి గట్రా బలహీనతలు వున్న పార్టీలను, పాత సామాన్ల లెక్క తుక్కు తుక్కు చేసి, తనకే తూకం వేసుకొని, రాజకీయ తక్కెడలో తూగడం , వెన్నతో పెట్టిన విద్య. …చాకిరేవు.

ప్రకటనలు

2 Responses to “పాదయాత్ర క్లైమాక్స్ లో, జగన్ పరువెందుకు తీసుకొన్నాడు? పావుగా మారాల్సిన పరిస్థితి ఏంది?”


 1. 1 Anon 1:56 సా. వద్ద అక్టోబర్ 28, 2018

  ఛీ నువ్వు మారవు బయ్యా. కొంచెం కూడా మానవత్వం లేని పచ్చ పైశాచికం చూస్తే జుగుప్స కలుగుతుంది. మధ్యలో కేతిగాడి ఆపరేషన్ పెరుగువడ. ఆంధ్రులను కసితీరా కుళ్ళబొడుస్తున్నారు గదంట్రా

  మెచ్చుకోండి

 2. 2 kollurirao 1:42 సా. వద్ద నవంబర్ 5, 2018

  మొన్న యూరోపియన్ యూనియన్ లక్సంబర్గ్ కోర్టు, ఫిర్టాష్ మీద ఆస్ట్రియా కోర్టు ఇక నిర్ణయం తీసుకోవచ్చు అనంగనే, ట్రంపు వ్యతిరేఖులు అమెరికాలో తన్మయం చెందారు. ట్రంపు మేనేజర్ కి ఇక మూఢిందే అన్న గాఢ నమ్మకం. కాని పట్టుకొస్తోంది మన టైటానియం విచారణ ప్రధానంగా చెప్పి.
  I did not understand this episode. May be explained again please.

  మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

 • 889,951

తడి ఆరని ఉతుకులు

అక్టోబర్ 2018
సో మం బు గు శు
« సెప్టెం   నవం »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: