అభిమానిది అసహ్యమా, ఉన్మాదమా, అభిమానమా?

అభిమానిది అసహ్యమా, ఉన్మాదమా, అభిమానమా?

అభిమానే ఉన్మాదిలా జగన్ ను గాయపరచడం బాధించేదే. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. నాయకుల నోట్లోకూడా కాల్చెయ్యాలి, ఉరెయ్యాలి, చెప్పు / చీపురు చూపించండి లాంటి మాటలు ఆగాలి. ఉన్మాదులకు, అభిమానులకు, నాయకులకు తేడా వుండాలి. అప్పుడే సమాజంలో కొంతైనా ఇలాంటి ఉన్మాదాలను తగ్గించగలం.

గిరిజన ప్రజాప్రతినిధులను నక్సలైట్లు ఉన్మాదంతో కాల్చేస్తే, వాళ్లు క్వారీ చెయ్యడం ఆపేసి వుంటే ఇలా జరిగేదా అని పవన్ కళ్యాణ్ లాంటి వారు మాట్టాడ్డం బాధ్యతా రాహిత్యం. ప్రజాస్వామ్యాన్ని కోరుకొనే వారు ఎవరైనా హింసను ఖండించాల్సిందే. ప్రతి శుక్గ్రవారం కోర్టుకు వెళ్లేంత, డజను చార్జ్‌షీట్లలో అవినీతి చేయకపోతే, ఇలాంటివి జరిగేదా అని ఎవరన్నా అంటే కూడా తప్పే.

ఎందుకంటే, ఉరి శిక్ష వేసే ఖైదీకి కూడా ఆరోగ్య పరీక్షలు చేసి ఉరేస్తుంది, మన న్యాయవస్థ.  అంతేకాని ఎలాగూ చస్తున్నాడు కదా అని, పట్టించుకోకుండా ఉరెయ్యదు.

గవర్నర్ గారు, కేంద్ర మంత్రులు, ప్రతిపక్షం, పాలక పక్షం అంతా ముక్త కంఠంతో ఖండించినందుకు సంతోషం. కాని ఇలా మనం గిరిజిన ఎమెల్యేని & మాజీ ఎమెల్యేని కాల్చి చంపేస్తే, ఎందుకు ఆ రోజు ఇంత వేగంగా స్పందించలేకపోయాం? మన మనఃసాక్షికే సమాధానం చెప్పుకోవాలి.

కొన్నేళ్ల క్రితం అరవ డబ్బింగ్ సినిమా రంగం సినిమా వచ్చింది. అందులో సిఎం అయ్యే అభ్యర్థి తనకు తానే కుట్ర చేసి బాంబులు పెట్టిస్తాడు. టివీలో కూడా చాలా సార్లు ఆ సినిమా వచ్చింది. ప్రజలకు సులభంగా అర్థం అవుతుంది, కుట్ర ఏదో, నిజం ఏదో అని.

శ్రీకాకుళంలో తుఫాను సహాయక చర్యలు చేసుకొని, హుద్ హుద్ తరువాత విశాఖను చూసి మెచ్చుకొన్న కోహ్లీ మాటలు విని ఆనందిస్తూ, అతను 10000 పరుగుల మైలు రాయి దాటిన సంధర్భంగా గర్వపడుతూ, మరో ప్రక్క ఫింటెక్ లో డెలాయిట్ లాంటి సంస్థలు పెట్టుబడులు పెడుతూ వుంటే, విశాఖ అంతా ఉత్సాహంగా వున్న వేళ, కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీ సిబ్బంధి ఆధీనంలోని విమానాశ్రయంలో, జగన్ వీరాభిమానుల కుటుంబం నుండి, ఇలాంటి దాడి అంటే, ఎన్ని అనుమానాలు వున్నా, ప్రజాస్వామ్యయుతంగా ఖండించాల్సిందే.

దాడి నిజమైనదే అని నమ్మే వారు నిజంగా దిగ్బ్రాంతికి గురవుతారు
ఎక్కువ విమర్శలతో చెలరేగిపోతే కుట్ర చేసుకొన్నారని ప్రజలకు అర్థం అయిపోతారు

ప్రజలు కూడా మారారు కొత్త కొత్త సినిమాలను చూస్తున్నారు
ప్రపంచాన్ని అరచేతి మొబైల్ లో చూస్తున్నారు

వారికి అర్థం కాదనుకొని పాత సినిమాల పద్దతులు ప్రయోగిస్తే, మేము ఎలా కనిపిస్తున్నామని జనం జాలి పడతారు. నిజమైన అభిమానులు కూడా గట్టిగా అరచినా, ఏకాంతాంగా వున్నప్పుడు తన మనఃసాక్షికి సమాధానం చెప్పుకోలేక అసహ్యపడతాడు.

జగన్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ. ….చాకిరేవు.

ప్రకటనలు

1 Response to “అభిమానిది అసహ్యమా, ఉన్మాదమా, అభిమానమా?”


  1. 1 Anon 3:22 ఉద. వద్ద అక్టోబర్ 26, 2018

    అభిమాని సంగతేమో కానీ నీకు పచ్చ బ్యాచీకి ఉన్నది మాత్రం కులోన్మాదం పైశాచికం.

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • అందాల ప్రపంచం పారిస్ ప్రకృతి సేద్య ఆహారం అందాన్నే కాదు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది ఆంధ్రా ప్రకృతి వ్యవసాయ ప్… twitter.com/i/web/status/1… 1 hour ago

వీక్షణలు

  • 866,562

తడి ఆరని ఉతుకులు

అక్టోబర్ 2018
సో మం బు గు శు
« సెప్టెం   నవం »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: