అమాయక సేనలకు,

అమాయక సేనలకు,

“పరిటాలను చంపించాక, ఆయన భార్య నామినేషన్ వేస్తుంటే, పెనుగొండలో ఏడుమంది టిడిపి కార్యకర్తలను పోలీసులతో కాల్పించాడు వైఎస్”

ఆమె గెలిచింది.

వందలాది సహచర కార్యకర్తల చావులతో కూడా టిడిపి వెనక్కి తగ్గలేదు.

ఆ నమ్మకం & ధైర్యం టిడిపికి ఎందుకుంది? విశ్లేషించండి.

జీవితమంతా ఓ నిర్మాత లేదా ఓ హీరో కష్టపడితే ఎంత సంపాయిస్తాడు. కొంత పేరుండి, సరిగ్గా ఎన్నికల నెలలకు ముందు, ఓ పార్టీ పెట్టి, కులం & అభిమాన బలహీనతనే పెట్టుబడిగా పెట్టి, టికెట్లు అమ్ముకొంటే జీవితం అంతా సంపాదించేంత వస్తుంది. బోనస్ గా పార్టీని విలీనం చేస్తే దానికి రెండు రెట్లు.

ఈ క్రమంలో ప్రజాసమస్యల వారిగా నిత్యం పోరాడాలి అన్నా పెట్టుబడులు కావాలి. ఈజీ మనీకి అలవాటు పడ్డ ఎవడూ, తన కష్టార్జితం పెట్టుబడిగా పెట్టడు. ఏమరిన వారిదే పెడతాడు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య వచ్చే ప్రజలకోసం, పోరాటానికి, ప్రతిసారి ఏమారే వారు దొరకడం కష్టం.

కాబట్టి తుఫాన్ లు వచ్చినా సహాయ సామగ్రి సేకరించడం, పంపిణీ చేయడం, బాధిత ప్రజలను పలకరించడం, సమయం & డబ్బు వృధాగా, అసందర్భంగా భావిస్తారు.

సమయోచితంగా సెక్యూరిటీ ప్రాబ్లం అనో మరోటనో నమ్మే అమాయక వెఱ్ఱి గొఱ్ఱెలను నమ్మిస్తారు.

ప్రజలు అమాయకులు కారు, ఒక్కో సమస్య మీద, ప్రతి నాయకుడి మీద , ఓ అభిప్రాయం, సబ్ కాన్షియస్ మైండ్లో పెట్టుకొంటూ, పైకి మనోడు అనుకున్నా, లోపల వేల సార్లు కంపేర్ చేస్తూ కంపరం పెంచుకొంటారు. సామూహికంగా ఒకరికి ఒకరు చెప్పుకోకున్నా, చెప్పుతో కొట్టారు, ఎన్నికల ఫలితాల్లో అని జనం గురించి చెప్పుకొనేలా తీర్పు ఇస్తూ వుంటారు.

అమ్మి ఆదాయం చేసుకొనే వారికి తెలుసు. చివరి వరకు తెలియక సమాజంలో సానుభూతికి కూడా నోచుకోకుండా, అన్నిరకాలుగా నష్ట పోయేది అమాయక పావులే.

ఒకే ఒక్క సారి గత ప్రజారాజ్య విలీనం తరువాత రోడ్డుపాలు అయ్యి శాపనార్థాలు పెట్టిన జీవితాలు పరిశీలిస్తే, జాగ్రత్త పడవచ్చు. తెలిసీ నష్టపోతే, సాటి అభిమాని కానీ, తోటి కులం గాని, బంధువులు గాని, ఎవడి ఖర్మకు ఎవరు బాధ్యులు అని, వారి ఖర్మకే వదిలేస్తారు. ఈ కాలం కుటుంబాలు చిన్నవి. పెళ్ళాం పిల్లలు వదిలేసిన ఆశ్చర్య పోనక్కరలేదు.

బాగా డబ్బుండి, అభ్యర్థిగా అయినా సమాజంలో ఓ పరపతి కావాలనుకునే బకారాలకు అన్నీ తెలుసు. వారితో పాటు ఊగిపోయి జీవితాలను నాశనం చేసుకొనే వారే, ప్రతి కొత్త పార్టీ వలల్లో, వేలల్లో వెఱ్ఱివాళ్లు పడతారు. ..చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “అమాయక సేనలకు,”  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 889,951

తడి ఆరని ఉతుకులు

అక్టోబర్ 2018
సో మం బు గు శు
« సెప్టెం   నవం »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: