మామా సినిమాకు వస్తావా అంటే, పనుంది అని అబద్ధం చెప్పి

మామా సినిమాకు వస్తావా అంటే, పనుంది అని అబద్ధం చెప్పి చదువుతున్నాడు. మనసుపెట్టని పుస్తకంలో, తెరిచిన పేపరు మీద, కన్నీటి చుక్క పడింది.

డిగ్రీ అయిందని ఇంట్లో వాళ్ళు, పొలానికి అంటరాని వాడిని చేశారు. ఉద్యోగం రావాలంటే తన బలం ఏదో, బలహీనత ఏదో తెలుసు. పేపరులో చూసిన ఉద్యోగ ప్రకటన, ఆశ కలిగిస్తోంది. తన చదువు స్థాయికి అది చిన్నదైనా, పేదరికం పెద్దది కాబట్టి, అదో ఒయాసిస్సే. చినదానితో సర్దుకొని, ఆ జీతంతో, తన బలహీనతలు జయించాలనే కోరిక.

వెళ్లి రావాలి అంటే ఐదొందలు కావాలి. ఇన్నూట ఏభై పెట్టాలా.. కూలీలకు అని, ఇంట్లో అమ్మా నాన్నా పొలానికి వెళ్లారు. ఆ నేల తడుస్తూ వుంటుంది, వారి చెమటకు అని తెలిసీ, ఎలా అడగగలడు.

అమ్మే ..ఏరా డబ్బేమన్నా కావాలా అని అడిగితే, బావుణ్ణు అని ఆశపడి, అంతలోనే, అమ్మదగ్గరే లేకపోతే, ఊరికే కావాలా అని ఎలా అడుగుతుంది? అనే ఆలోచనలో మధ్యాహ్నం అయ్యింది.

సినిమాకు వెళ్లొచ్చిన మిత్రుడు, మొత్తం కథ చెప్పాడు, చివర్లో, మామా, నీ ఆధార్ నంబర్ చెప్పు మామా అన్నాడు. ఎందుకూ అంటే నీకో మిత్రుడిని పరిచయం చెయ్యాలి అని అంటే, లేచి చూసి చెబితే, తన ఫోన్లో ఎక్కించాడు.

మామా, నువ్వు బాబు నేస్తంగా అర్హత సాధించావు. మిగతా తతంగం నువ్వే పూర్తి చెయ్యి అని, ఫోను చేతిలో పెట్టాడు.

గాంధీ పుట్టిన మర్నాడు, ఇంటిలో పాత ఫోను టంగుమంది. తన ఖాతాలో వెయ్యి. తన ఆత్మాభిమానం చంపుకొని, ఏ రాజకీయ నాయకుడి దగ్గరా, ఏ ప్రభుత్వ అధికారి దగ్గరికీ, తిరగకుండా, తన డిగ్రీకి ఇచ్చిన విలువకు, ఫోను మీద కన్నీటి చుక్క పడింది. ఆ వెయ్యే, వెయ్యేనుగుల బలం, తమ పేదరికానికి.

ఆంధ్రాలోని ప్రతి నిరుద్యోగ యువనేస్తానికి శుభాకాంక్షలతో-చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “మామా సినిమాకు వస్తావా అంటే, పనుంది అని అబద్ధం చెప్పి”  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 900,540

తడి ఆరని ఉతుకులు

అక్టోబర్ 2018
సో మం బు గు శు
« సెప్టెం   నవం »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: