అక్టోబర్ 12th, 2018ను భద్రపఱచు

సిఎం రమేష్ గారికి,

సిఎం రమేష్ గారికి,

బాగా అయ్యిందా సార్… వ్యాపారాలు వుంటే అవి చేసుకోవాలి కాని, కడపకు ఉక్కు ఫ్యాక్టరీ వస్తే, మీకేమొస్తుంది. జగన్ ను చూడండి, వాళ్ల కుటుంబాన్ని దశాబ్దాలు నెత్తిన పెట్టుకొన్నా, కడప స్టీల్ ప్లాంట్ కావాలి అని కనీసం గొణిగాడా. 43000 కోట్ల సిబిఐ దర్యాప్తులతో, కోర్టు కేసుల్లో తిరుగుతున్నా, తన మాజీ చంచల్‌గూడా సహచరుడు విజయ సాయి రెడ్డిని, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ప్రధాని కార్యాలయానికి పంపి, చక్కగా మోడీతో కూర్చోబెట్టించి, ముచ్చట్లు చెప్పిస్తున్నాడు.

జగన్ బాబాయి వివేకానంద రెడ్డిని, కడపలో మీరంతా, కలిసి ఓడించారు. ఆ కసి వాళ్లకు వుంది. మోడీతో కూర్చొని మీ మీద ఎన్ని కుట్రలు చేసివుండరు. మొన్న అంబటి మాట్టాడింది, మీరు వినలేదా? మీ మీద ఐటి దాడులు, ఎందుకు చేయడం లేదని సాక్షి మీడియాలో, గట్టిగా మోడీని నిలదీసాడు. ఆయన అలా అన్న వెంటనే సుజనా గారి మీద, మీ మీద దాడులు చేసేసారు, అని అనుకొంటున్నారా? ఇవన్నీ 420 కేసుల్లో వున్న వైకాపా వాళ్లతో బిజెపి కలిసి చేసిన కుట్రలు అని, చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు.

మీ ఆఫీసుల్లో ఏదన్నా వాల్లే కొన్ని పడేసి, ఓ కేసు పెడితే, ఓ పదేళ్లు తిప్పవచ్చు అని, ఒక ఆశ. ఓ కేసు పెడితే, సిఎం రమేష్ గారు కూడా, మా మాదిరి కోర్టులకు తిరుగుతున్నాడు అని, చెప్పుకోవాలనే కోరిక, జగన్ & వైకాపాకు చాల రోజుల నుంచి వుంది.

అయినా బ్యాంకుల్లో కొన్ని వేల కోట్లు తీసుకొని, ఎగరేసి, మోడీతో ఓ ఫోటో తీసుకొని, మాల్యాలా చెప్పి మరీ వీడ్కోలు తీసుకొని. విదేశాలలో స్థిరపడవచ్చు కదా. ఎన్ని వ్యాపారాలు చేసి కష్టపడితే, జగన్ లా, నీరవ్ మోడీలా, మాల్యాలా సంపాయించగలరు, కూడబెట్టగలరు.

నోట్ల రద్దు అప్పుడు కూడా, ఇలా వందల మంది ఐటి అధికారులను దాడులకు పంపాలని తెలియదు, మోడీకి. వైకాపా & కేసీఅర్ తో కలిసి అధికార వ్యవస్థలను ఎలా వాడుకోవాలో, వైఎస్ అధికార చరిత్రను చదివి మరీ, వాడుతున్నట్టున్నారు.

కుప్పంలో చంద్రబాబు పనులు చెయ్యిస్తే, వాటి మీద విచారణ వెయ్యించి, ఓ రోజంతా, ఓ బెంచీ మీద కూర్చోబెట్టి, విచారణతో వేధించిన వైఎస్ చరిత్ర, అధికారాన్ని గుర్తుచేసివుంటారు.

ఇప్పుడైనా మించి పోయింది లేదు, ఆలోచించుకోండి.

ఆంధ్రా … ప్రజలు అని మీరు అనుకొంటే … తెలుగు దేశం పార్టీ అండగా వుంటుంది. అందులో వుంటే ఈ కష్టాలు తప్పవు, భరించాలి. పార్టీ ఆఫీసు నుండి బయటకు వస్తుంటే, పరిటాలను కాల్చి చంపించిన వైఎస్ అధికారం, అంతటితో ఊరుకోలేదు. కోపం చల్లారలేదు, ఆయన భార్య పరిటాల సునీత గారిని నామినేషన్ వెయ్యనియ్యకుండా, వేలాది మంది పోలీసులను, పదుల్లో డిఎస్పిలను, ఏబైమందికి పైగా సిఐలను & ఎసైలను, తమ రౌడీమూకలను మోహరించి, గొడవలు రేపి, ఇద్దరు పోలీసుల మృతికి కారణం అయ్యి, తెలుగుదేశం కార్యకర్తలను చంపి భయపెడితే…. తాళి తెగినా, భర్త మీద బుల్లెట్ లతో తన కుంకుమ చెరిగినా… వైఎస్ అధికార మదాన్ని ఎదిరించి … ఓ మహిళగా ముందుకే వెళ్లి నామినేషన్ వేసింది. ప్రచారం చెయ్యించకుండా గ్రామాలలో తెలుగుదేశం సానుభూతిపరులను, కేసులు పెడతామని బెదిరించి, ఖాలీ చెయ్యమని చెప్పినా… అఖండ విజయంతో … నాడు వైఎస్ అధికారాన్ని ఎగతాళి చేసింది, ప్రజా మద్దతుతో, కార్యకర్తల త్యాగంతో.

ఇలాంటి తెలుగుదేశం గురించి, మోడీకి తెలిసే అవకాశం లేదు.

అసెంబ్లీలో, మీ పార్టీ ఫినిష్ అని చంద్రబాబుకు వేలు పెట్టి చూపిస్తూ అన్న వైఎస్ తో, తొణకకుండా…ఎవరు ఫినిష్ అవుతారో చూద్దామని, అదే స్వరంతో తిరిగన్న చంద్రబాబు నాయకత్వం గురించి, మోడీకి తెలిసి వుంటే, ఇలాంటి కుట్రలకు వెన్ను జలదరించును. అవి తెలియవనుకొంటా.

అందుకే అధికారం శాశ్వతంగా కైవసం చేసుకోవాలనే, ఓ నియంత కోరికతో, మోడీ పరివారం, వరుసగా దక్షిణాది లోను, తెలుగుదేశం మీదే దాడులతో నీలుగుతూ, విర్రవీగుతున్నారు. చెయ్యిస్తూ లక్ష్యాల గురించి జివిఎల్ లాంటి చెంచాలతో చెప్పిస్తున్నారు.

ప్రజాస్వామ్యంతో మోడీ పాతర వెయ్యించుకొన్న రోజున, ఇదే స్థాయిలో ఆయనకు ఎదురైతే, ఎందుకు ప్రధానిగా వెళ్లానా, హాయిగా టీ అమ్ముకొంటూ వుండే రోజులు బావుండేవి అని అనిపించేలా, దేశ ప్రజాస్వామ్యం వీలు కలిపించకపోయినా, ఆలోచించేలా చేస్తోంది మోడీ పాలన.

ఆలోచించండి సార్ …. బాబు వెంట కష్టాలు వుంటాయి, ప్రజల కష్టాలు వుంటాయి. తుఫానులకు వీడ్కోలు చెప్పాలన్నట్టు అక్కడ వాలి, జనం కష్టాల్లో వుండే ఆయన పిచ్చి మీకు ఆనందం అయితే

తల తెగిపడినా మొండెం కూడా మోడీకేసి ఎదురెళుతుంది

కడప ఉక్కు కోసం దేశం అంతా వినిపించేలా
రాష్ట్ర ప్రత్యేక హోదా గురించి హిమాలయాలు ప్రతిధ్వనించేలా
విభజన చట్ట అమలుకు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దిక్కులు పిక్కటిల్లేలా
వినిపిస్తున్న ఆంధ్రుడి గర్జనలో గొంతు కలపండి …..

ఆంధ్ర గర్వం పొందండి ….

బానిస వాసనలతో తిరిగే & మొరిగే శునకాల గురించి పట్టించుకోకండి

వాటికి మోడీ పాలన జాతరగా కనిపించవచ్చు
ఎన్నికల రోజు ప్రజాస్వామ్య వ్యాను వస్తుంది
వారి భరతంపట్టి అందులో కుక్కి ఆంధ్రా అవతల విడిచిపెట్టబడతారు

ఆంధ్ర పౌరుషాన్ని లిఖించే చరిత్ర పుటలో
రెండు పదాల మీ పేరుకోసం
ఎంత సంపద ధారపోసినా చోటు దొరకదు

ఆంధ్రుడిగా ఎలుగెత్తి
దాడులకు ఎదురొడ్డి
నిలిచిన ధీరుడివి నువ్వని
గుర్తుంచుకో

రేపటి చరిత్ర అలాగే వుంటుంది.
జై ఆంధ్ర ప్రదేశ్
జై అమరావతి. …చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 900,539

తడి ఆరని ఉతుకులు

అక్టోబర్ 2018
సో మం బు గు శు
« సెప్టెం   నవం »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: