కీలక సమయంలో జగన్ కొంప ముంచిన కేంద్ర మంత్రి

కీలక సమయంలో జగన్ కొంప ముంచిన కేంద్ర మంత్రి

జగన్ ఇస్తున్న అబద్దపు హామీలకు దొంగ నోట్లు అచ్చేసే ప్రింటింగ్ మిషన్లు పెట్టినా, దాని కాగితాన్ని కూడా ఆంధ్రా కొనలేని స్థాయి.

నవరత్నాలకు తోడు, కనిపించిన కులం, మతం, మనిషి, పశు మరియు పక్ష్యాదులకు అబద్దాల హామీల పేకమేడలు పేర్చుకొంటూ పోతున్నాడు, పాదయాత్ర పొడవునా.

నేడు జగన్ కు నాడు బిజెపికి ఎన్నికల వ్యూహకర్త ఒక్కరే…. ప్రశాంత్ కిషోర్.

మనం ఎలాగూ రామని నమ్మే వారి చేత, ఆచరణ సాధ్యం కాని పటోటమైన అబద్దాలు పలికించే కర్త కర్మ క్రియ ప్రశాంత్ కిషోర్.

మోడీ పేరు చెప్పుకొన్నా, అధికారంలోకి  మనే నమ్మకం బిజెపిది 2014 లో. అందుకే ఆచరణ సాధ్యం కాని హామీలు. ఒక్కొక్కరి బ్యాంకు అకౌంట్లో 15 లక్షలు వేస్తామనేవరకు అబద్దాలు కమలపు కోటలు దాటాయి. మన రాష్ట్రంలో అయితే తిరుపతి నుండి విశాఖ వరకు, ఢిల్లీకి మించిన రాజధాని అని ప్రత్యేక హోదా అని అబ్బో.. అబ్బో … కలియుగ భగవంతుడు వెంకటేశ్వరుడి పాద పద్మాలు అయిన తిరుపతి అని కూడా చూడకుండా, తిరుగు లేని అబద్దాలు, మోడీ చేత కూయించారు.

అబద్దాల మేడ బద్దలయ్యేలా, గడ్కరీ ఇంటర్వూ ఇచ్చాడు. అవును, మా బిజెపి వస్తాది అనే నమ్మకం లేదు. అందుకే ఆచరణ సాధ్యం కాని పొడవాటి హామీలు మా చేత ఇప్పించారు . మా అదృష్టం పండి జనం ఖర్మ కాలి ఎన్నుకొన్నారు. ఆ హామీలను ప్రజలు అడుగుతుంటే, నవ్వుకొని వెళ్లిపోతున్నాము అని గడ్కరీ గారు, పికె అబద్దాల పేకమేడలను కూల్చారు.

అదే పీకే తో జగన్ ఒప్పందం చేసుకొని, మన ఆంధ్రాలో ఆడిన అబద్దం ఆడకుండా, హామీల శర పరంపర గుప్పించుకొంటూ పోతున్నాడు అడుగడుగునా, పాదయాత్రలో, జనం అడిగినా, అడగకపోయినా.

అసలే రాష్ట్రం లోటు బడ్జెట్ నుండి ఇప్పుడిప్పుడే కోలుకొంటోంది. కొత్త అప్పులు తీసుకోడానికి కూడా పరిమితులకు భయపడే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో జగన్ హామీలు అంటే, దొంగ నోట్లు అచ్చెయ్యడానికి, పేపరు కూడా కొనలేని పరిస్థితి.

మోడీ విషయంలో, దేశం మేల్కోక ముందే, తెలుగుదేశం మేల్కొని, దేశానికి సుప్రభాతం పాడి మోడీ విషయంలో నిద్రలేవండి అని , పార్లమెంటు సభల సాక్షిగా నిలదీసింది. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ అని సుప్రభాతం వినిపించే ఏడుకొండల స్వామి పాదాల చెంత, మోడీ నమ్మబలికిన హామీలను, ఎలా తప్పిందీ దేశానికి ప్రదర్శించింది.

మోడీకి ప్రదక్షిణలు చేసే వైకాపా వారు, ప్రశాంత్ కిషోర్ ని వెంటబెట్టుకొని అమిత్ షాతో కలిసింది కూడా ఆంధ్రా అంతటికీ తెలిసేలా, జగన్ బట్టలిప్పినట్టు, ఫోటోలతో సహా చూపారు.

ఒక్క ప్రశాంత్ నిర్మించిన అబద్దాల సౌధం కళ్ల ముందు కూలుతుంటే, అదే ప్రశాంత్ కిషోర్ అలియాస్ పికె తో, ఆంధ్రా లాంటి ఆలోచనా పరులు వున్న రాష్ట్రంలో, అబద్దాలు నిర్మించడానికి,  ప్రజలను దోచిన పాపిష్టి డబ్బులు ఖర్చు పెట్టి మరీ జగన్, అబద్దాల కోటలు కట్టిస్తే, నమ్మేది ఎవరు? ఒకరు జఫ్ఫా అయ్యి వుండాలి లేదా పవన్ కల్యాణ్ చేతిలో పాగల్ అయ్యి వుండాలి.

జగన్ పాదయాత్ర చివరి దశకు చేరిన కీలక సమయంలో, తప్పుడు హామీలు చెప్పించే, చెప్పుడు పికె బంఢారం, బిజెపిలోని కేంద్ర మంత్రి గడ్కరీ ద్వారా బద్దలు కావడంతో, ఆంధ్రాకు మేలే జరిగింది.

2019 ఎన్నికల ఫలితాల మరుసటి రోజు నుండి, మళ్లీ జగన్ బయట వుంటే, 2024 నేనే సిఎం అనేలా, అబద్దాల హామీల పాపపు పుట్టపగిలింది. పాపం ఆంధ్రా అనే జాలి కూడా లేకుండా కూయించిన ప్రశాంత్ కిషోర్, ఇప్పటికే వృత్తి మార్చుకోవడం & బీహారు రాజకీయలలో కురుదురుకోవడం, అందుకే అనుకొంటా. …చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “కీలక సమయంలో జగన్ కొంప ముంచిన కేంద్ర మంత్రి”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • అన్నదాతల బడి - అమ్మ ఒడి ఈ అపూర్వ ఘట్టం ఆంధ్రాలో ప్రకృతి వ్యవసాయ శిక్షణలో #ZBNF #Andhra https://t.co/9SAgEpD30Q 3 hours ago

వీక్షణలు

  • 873,404

తడి ఆరని ఉతుకులు

అక్టోబర్ 2018
సో మం బు గు శు
« సెప్టెం   నవం »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: