గవర్నర్ శ్రీ నరసింహన్ గారికి,

గవర్నర్ శ్రీ నరసింహన్ గారికి,

మిమ్ములను కలిసి మాట్టాడడానికి అర్హత ఏముండాలి. సామాన్యుల సమస్యలను వినడానికి మీరు అనుమతి ఇస్తారా? అనుమతి ఇస్తే, తెలియజేయగలరు.

ఇది నా సొంత సమస్య కాదు. ఇది మీరు పొరుగు రాష్ట్రం నుండి గవర్నర్ గా బాధ్యతలు నెరవేర్చే, మా ఆంధ్ర రాష్ట్ర సమస్య.

మేమంతా విభజన జరిగాక ఎన్నుకొన్న పార్టీ చేత, శాసనసభ నేతగా ఎన్నుకోబడి, మీరు ప్రమాణస్వీకారం చేయించిన ముఖ్యమంత్రి గారికి సంభందించిన సమస్య.

మా ఆకాంక్షల మేరకు ఆయన పనిచేయడం లేదు. మేము ఊహించిన విధంగా పనిచేయడం లేదు. అలాగే కొన్ని సంధర్భాలలో మేము నవ్వుకొనే విపరీత శపధాలు చేస్తున్నాడు. అసలు ఆయన ఒక రాజకీయ నాయకుడిగా కాని, కనీసం మనిషిగా కూడా ప్రవర్తించడం లేదు.

ఇది నిజం గవర్నర్ గారు. మాకు రాజధాని ఒకటి కడితే చాలు అనే ఆకాంక్ష. ఆయన అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మా ఆకాంక్షలకు మించి చేసుకుపోతున్నాడు.

కనీసం రెండు దశాబ్దాలకు పైగా కట్టాల్సిన దానిని ఊహించని విధంగా తాత్కాలికం అని సంవత్సరంలో సచివాలయం & శాసన సభ కట్టేశాడు. ఈ డిసెంబురుకు తాత్కాలిక హైకోర్టూ కట్టేస్తున్నాడు. గ్రౌండ్ మరియు 12 అంతస్థుల నిర్మాణాలతో 60 భారీ భవనాలను వారానికో స్లాబు ఏసుకు పోతూ నిర్మించేస్తున్నాడు. దేశంలో ఏ రాజధానిలోకి ప్రవేశిస్తున్నా, అది రాజధానిలోకి అన్నట్టు విపరీత ట్రాఫిక్ జాం వుండాలి. అది లేకుండా విశాలమైన సీడ్ ఆక్సిస్ రోడ్లను వేసేస్తే, మేము రాజధానిలోకి వెలుతున్నామనే ఫీలింగ్ వుండదు.

ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడూ కనీసం తెలుసుకోని అంతర్జాతీయ దావోస్, ఐక్యరాజ్యసమితి గట్రా సభల్లోకి వెళ్లిపోయి ప్రసంగాలు ఇచ్చేస్తున్నాడు. కనీసం ఓ మనిషి ఎంత కష్టపడాలో అంత కష్టపడకుండా, తన కష్టంతో విపరీతంగా కనిపిస్తున్నాడు.

మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా శతాబ్దాలుగా చెప్పుకొంటూ పోతుంటే, ఈ మనిషి అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రాను, రాజధాని అమరావతిని, రాష్ట్ర అన్నదాతను ప్రకృతి వ్యవసాయ గురువుగా నిలబెట్టాలని ప్రణాళికా బద్దంగా, తీరిక లేకుండా పనిచేసుకుపోతున్నాడు.

అసలు ఓ మనిషి ఇన్ని రకాలుగా, ఇంత ఒత్తిడితో, ఎన్నో సమస్యలతో, ఎన్నో ఆలోచనలతో, ఎలా పనిచేయగలగుతాడో ప్రపంచ సైంటిస్ట్ ల చేత, పరీక్షలు చెయ్యించాల్సిన మనిషి. మానవ జాతిలో అరుదైన మనిషి.

అలాంటి మనిషి పాలనపై కొందరు పనిగట్టుకొని చాడీలు చెప్పడానికి వస్తే, అనుమతించే మీరు, మా సమస్యలను కూడా వినాలి. మేము ఎన్నుకోబడిన ఆయన తీసుకొనే నిర్ణయాలు ఏవైనా, ప్రజాస్వామ్యం బద్దమే అని మీకు తెలుసు.

అలా ప్రభుత్వ విప్ గా ఆయన పరిధిలో నిర్ణయం తీసుకొనే వెసులుబాటు ఆయనకు వుంది. ఆ విప్ ను వారంలో తొలగించకపోతే మీకు వచ్చి చాడీలను చెబుతా అని జనసేన అనే పార్టీ నేత హెచ్చరిస్తున్నారు. ఆయన మానసిక స్థితి దృష్ట్యా ఎవరూ పట్టించుకోరు. కాబట్టి మీ దగ్గరకు వస్తారు. కొంచం ఆయనకు చెప్పి పంపండి. ప్రజలు ఎన్నుకొన్న వారిని రౌడీలు గూండాలు అని వాగే హక్కు వుందని ఎవరన్నా మొరగవచ్చు.

కాని ఇష్టంలేదని తీసేయమనే చెప్పే హక్కు కనీసం పంచాయితీలో వార్డు కూడా గెలవని పార్టీకి లేదని చెప్పండి. మిమ్మల్ని కలిసి, చాడీలు చెప్పే అవకాశం మాత్రమే వుందని విశదీకరించ చెప్పండి.

రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే మాత్రమే చింతమనేని, కాని జాతీయ స్థాయి కేంద్ర పాలక పార్టీ బిజెపి అధ్యక్షుడు, జైలుకు పోయి వచ్చాడు. ఆయనను రాజ్యసభ నుండి తీసేయమనే ధైర్యం & దమ్ము ఈ హీరొకు వుందా అని అడగండి. అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేత 16 నెలలు జైలు లో వుండి వచ్చాడు, ఆయను తీసేయమని మీకు చెప్పమనండి. మీకు చెప్పినా మీకే ఆ హక్కు లేదు, ప్రజాస్వామ్యాన్ని పాతరేసే కొమ్ములు మీకు లేవని, కుల్లబొడిచి చెప్పండి.

రాష్ట్రా పాలనకు పదే పదే అడ్డుపడుతూ, పసలేని ఆరోపణలకు ఆయన దగ్గర ఆధారాలు వుంటే, న్యాయస్థానాలకు వెళ్లమని హితబోధ చెయ్యండి. మీకు అలా చెప్పగలిగే వెసులుబాటు వుంటే ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చి చెప్పండి. లేదంటే, ప్రతి సామాన్యుడికీ అనుమతి ఇవ్వండి./మీకు ఇలాంటి పని లేని వారు, పని చేసే వారిని ఎలా విసిగిస్తున్నారో చెబుతాము. మీకు పనిలేకుంటే పవన్ కల్యాణ్ కు మాకూ అనుమతి ఇవ్వండి. పని వుండి, కలవాలనుకొన్నా మానసిక పరిణితి కలిగిన వారిని కలవండి.

జాలితో మానసిక స్థితి సరిగా లేని వారిని కలవాలి అనుకొంటే ఎర్రగడ్డ కాని వైజాగ్ ఆసుపత్రిలోని రోగులను కలవండి. పుణ్యం వస్తాది.

రాష్ట్రం పడే ఇబ్బందులు, లక్ష్యాలు, చేస్తున్న పనులు, మీరు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేప్పుడు, ప్రతి సంవత్సరం సభలో మీ ప్రసంగంలో ప్రస్తావిస్తూ వుంటారు. అవన్నీ, చాడీలు చెప్పడానికి వచ్చే వారికి వివరించి చెప్పండి. మీరు చెప్పినా వినకపోతే, మళ్లీ కలవడానికి అనుమతి ఇవ్వకండి. కలవాలి అనుకొంటే చికిత్స తీసుకొని రమ్మని షరతు పెట్టండి.

దయచేసి ఆంధ్ర రాష్ట్రం కోసం, ఈ సమస్యనైనా సావధానంగా చదివి అర్థం చేసుకొని, తగువిధంగా రాష్ట్రానికి సహకరిస్తారని ఆశిస్తున్నా. …చాకిరేవు

ప్రకటనలు

0 Responses to “గవర్నర్ శ్రీ నరసింహన్ గారికి,”  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 900,540

తడి ఆరని ఉతుకులు

అక్టోబర్ 2018
సో మం బు గు శు
« సెప్టెం   నవం »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: