కేంద్ర చట్ట & న్యాయ శాఖకు,

కేంద్ర చట్ట & న్యాయ శాఖకు,

ఈ దేశంలో అత్యంత ద్వేషంతో, ఓ చట్టాన్ని పార్లమెంటు సభల్లో ఆమోదించారు. ఆ చట్టమే ఆంధ్రా గొంతు అడ్డంగా కోసినా, ఆ చట్టమే ఆంధ్రుల స్వేదాన్ని & రక్తాన్ని తోడేలులా త్రాగేసినా, దిక్కూ దివాణం లేకపోయింది ఆంధ్రాకు, ఈ దేశంలో.

అట్టాంటి మోసపూరిత ఆమోదిత చట్టాన్ని అమలు చెయ్యడానికి కూడా, కేంద్రానికి చేతులు రావడం లేదు. మరింత విద్వేషంతో ఆ చట్టాన్ని నానబెట్టి తూట్లు పొడుస్తోంది.

ఆ చట్టం పేరు “THE ANDHRA PRADESH REORGANISATION ACT, 2014”.

అత్యంత దయనీయమైన స్థితిలో వుండే రాయలసీమ & ఉత్తరాంధ్రా జిల్లాలకు, అందులో పొందు పరిచిన క్రింది సాయాన్ని కూడా, చేయకపోవడం హేయం & దుర్మార్గం.

చట్టంలో నలభై ఆరో సెక్షన్ … మూడో భాగం

46. (3) The Central Government shall, while considering the special development package for the successor State of Andhra Pradesh, provide adequate incentives, in particular for Rayalaseema and north coastal regions of that State.

దీనిని అమలు చేయలేని దయలేని స్థితిలో వున్న దయనీయమైన కేంద్ర చట్ట & న్యాయ శాఖ ను, ఆంధ్రా ఏమని పిలవాలి? కేంద్ర చట్టబండ & అన్యాయ శాఖ అని పిలుచుకోవాలా? లేదా కేంద్ర కన్నెర్రకు కళ్లు మూసుకొన్న శాఖ అని అనుకోవాలా?

దేశ చరిత్రలో మొదటి పేజీలో వచ్చేది ఆంధ్రాదే. అందులోనే దుర్మార్గుల గురించి లిఖించబడుతుంది. మిగిలినది అంతా చదవక్కరలేదు. ఈ చరిత్ర శాశ్వతం. రాజకీయ పార్టీలు అశాశ్వతం.

మా ఆంధ్రా మీదా అన్యాయానికి పోతూ, కళ్ళు నెత్తికెక్కిన బిజెపి మూడూ రూపంలో వున్నది ముప్పై ఎనిమిది ఏళ్లుగానే. ఆంధ్రా ధర్మాగ్రహంలో మూడితే, ముచ్చటగా నాలుగో పేరు పెట్టుకోవాల్సి వస్తుంది. కాలి బూడిద అయిన కాంగ్రెస్స్ ని చిగురించేలా చేస్తోంది మోడీ & మరియు అమిత్ ద్వయమే.

ఇలాంటి కేంద్ర ద్వేషం ఆంధ్ర ఎఱుగదు, చరిత్రలో. కొత్త పుంతలు త్రొక్కిస్తున్నారు.

అన్నం పెట్టే ఆంధ్ర చేయి … అదే అన్నపూర్ణ శపిస్తే, ఢిల్లీలో దిక్కే వుండదు. దేశంలో దైన్యంగా అడుక్కోవాల్సి వస్తుంది. నేటి కాంగ్రెస్స్ లా లెంపలు వేసుకోవాల్సి వస్తుంది.  …చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “కేంద్ర చట్ట & న్యాయ శాఖకు,”  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 900,539

తడి ఆరని ఉతుకులు

అక్టోబర్ 2018
సో మం బు గు శు
« సెప్టెం   నవం »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: