శుభాకాంక్షలు జగన్ మోహన్ రెడ్డి గారు,

శుభాకాంక్షలు జగన్ మోహన్ రెడ్డి గారు,

గతవారం వచ్చిన సర్వేలు నీలో ఆనందం నింపి వుంటాయి. వైకాపా గెలవబోతున్నట్టు మరియు మీరు ఆంధ్రా ముఖ్యమంత్రి అవబోతున్నారు అని రావడం చదివి, శుభాకాంక్షలు చెప్పాలి అని అనిపించింది. మీకు ముందుగా అభినందనలు.

మీరు & మీ పార్టీ పచ్చి అబద్దాలు చెబుతున్నా, ప్రజలు నమ్ముతున్నారు అంటే, నిజంగా మీరు సాధించిన విజయమే అవుతుంది. మరియూ మీ గొప్పతనం కూడా. ఈ విషయంలో అధికారం వున్నా చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు & శ్రేణులు వైఫల్యం చెందినారనే చెప్పవచ్చు.

కాని ఇలాగే వుండేది 2014 లో కూడా మీకు అనుకూలంగా అన్నీ. స్వయంగా మీరు కూడా ఎన్నికల ఫలితాల ముందు రోజు కూడా, చూస్తూ వుండండి చిత్తూరు నుండి శ్రీకాకులం వరకు సునామీ సృష్టిస్తుంది అని మీడియాకు ఇంటర్వూ ఇచ్చారు నమ్మకంగా.

ఫలితాల తరువాత ప్రజల విజ్ఞత మీకు అర్థం అయ్యి వుంటుంది, అనుకొంటా. ఆరోజు మీరు అప్పట్లో ఎన్‌టీవీ మొదలు నేషనల్ మీడియా వరకు మేపి వేయించుకొన్న సర్వేల ఖర్చులను నష్టాల లెక్కల్లో వేసుకొని వుంటారు. అయినా ఆ నష్టం తాలూకూ కూడా ప్రజల దగ్గర కొట్టేసిందే కదా.

ఇప్పుడు, చంద్రబాబు పాలన గురించి వారి పార్టీ కార్యకర్త నుండి దారిన పోయే వాడి వరకు, వారి వారి వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేరలేదని, మెచ్చుకోకపోవచ్చు. బహిరంగంగా తిడుతూ వుండవచ్చు. అంత మాత్రాన దానిని నమ్మి నేనే సిఎం అని సంకలు గుద్దుకొంటే అంతకన్నా సన్నాసి వుండడు.

సరిగ్గా ఎన్నుకల ముందు రోజు భయం మొదలవుతుంది. క్రిష్ణా & గుంటూరు జిల్లాలలో. ఒక్క సారి చంద్రబాబు కు కాకుండా నీకు వేస్తే ఏమవుతుందో, ఒక్క క్షణం ఆలోచించినా, వారి వెన్నులో భయం మొదలవుతుంది. నువ్వు రాజధాని అమరావతిని ఆపడానికి చేయించిన రాక్ష కృత్యాలు, తిట్టిన తిట్లూ అన్నీ జ్ఞాపకం వస్తుంది. ఒక్క రోజు కూడా ఆంధ్రా రాజధాని మీద నువ్వు ప్రేమతో మాట్టాడిన ఒక్క మాటా లేదనే వాస్తవం గుర్తుకు వస్తుంది. అప్పుడే వారిలో కసి వస్తుంది, మరుసటి రోజు చంద్రబాబు మీద ప్రేమ పుట్టుకు వస్తుంది.

ఇక అనంతపురం, ఓ సారి నిండిన చెరువులు చూసుకొంటారు. కియాను కనులతో చూసుకొంటారు. కనులలో నీరు కూడా ఎండబెట్టిన ఒకప్పటి కరువు గురించి బేరీజు వేసుకొంటారు. నువ్వు వస్తే, లేపాక్షి నాలెడ్జ్ పార్కు భూముల నుండి గోరంట్ల దగ్గర సైన్స్ సిటీలకు లాక్కొన్న భూముల లెక్క, మనవి లాక్కొంటాడు అనే భయం వస్తుంది. ఇలా తిరుపతి ఎలక్ట్రానికి హబ్ అయ్యింది చిత్తూరు వాల్లకు తెలుసు. కడకు కడపలో నీ పులివెందులలో చీనీ చెట్లు కూడా చీ చీ అంటాయి.

ప్రకాశంలో కొంత నెల్లూరులో కొంత నీ మీద మమకారం వుండొచ్చు ఊడొచ్చు. చివర్లో రాష్ట్రం ఊపు బట్టి, మనం మాత్రం ఎందుకు అభివృద్ధికి దూరంగా వుండాలని ఆలోచిస్తే అక్కడా నీకు తగిన సీట్లు దక్కక పోవచ్చు.

గోదావరి జిల్లాల సంస్కారం, మర్యాద మరియు గౌరవం దక్కించుకొనే అర్హత నీకు లేదని భావిస్తాయి. ఉత్తరాంధ్రాలో, క్రితం కన్నా ఘోరంగానే వుంది వైకాపా పరిస్థితి.

మొత్తానికి చూస్తే ఏభై సీట్లు వస్తే అదే ఆందంతో ఇంట్లో భోరున ఏడవవచ్చు నువ్వు.

కాని మేము ఒంటరిగానే బరిలోకి దిగుతాము అని మేకపోతు గాంభీర్య ప్రకటనలు మీకు చేటు తెప్పిస్తాయి. జనసేన మరియు కమ్యూనిష్టులతో, కాంగ్రెస్స్ కలిస్తే? ఆలోచించావా? పవన్ ని మీ అన్న వున్న కాంగ్రెస్స్ తో పెట్టుకొన్నావా అని ఎవరన్నా ప్రశ్నిస్తే, ఏం తెలంగాణాలో తెలుగుదేశం కాంగ్రెస్స్ కలిస్తే తప్పులేదు కాని, నేను కలిస్తే తప్పా అంటే ఎవరి దగ్గరా సమాధానం వుండదు.

ఆ మూడింటి పొత్తులో కాంగ్రెస్స్ బలం పెరుగుతుంది. ఆ బలం నీ పార్టీని ముంచుతుంది. ఆ పాటికి నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో బిజెపి ఘోర ఓటమి నీలో భయాన్ని కలిగిస్తుంది. మోడీ ప్రభుత్వం చివరి రోజు వరకు, నువ్వు ధైర్యం చేసి, ఎదురు మాట్టాడలేవు. కాంగెస్స్ కాల్ల మీద పడి వారితో కలిసి పోలేవు. తెలుగుదేశం వ్యతిరేఖ ఓటు, జనసేన+కాంగ్రెస్స్+కమ్యూనిష్ట్‌లు చీలుస్తారు. అది నీ పార్టీకి నువ్వు వస్తాయనుకొనే ఓట్లే.

బిజెపికి కూడా తాము వస్తామని నమ్మకం లేదు. కాని వారికి కూడా చంద్రబాబు ప్రధాని కావాలి అనే కోరిక వుంది. ఎందుకంటే, నగదు మార్పిడి వరకు వారికీ నమ్మకం వుండేది మనమే మరో దశాబ్దం వుంటామని. ఆ అతి నమ్మకం & ధీమాతో, వైరి పక్షాలను వ్యక్తిగతంగా తమ అధికారంతో ఆదుకొన్నారు. చివరికి చిదంబరం కొడుకు వరకు వేటాడారు. దానికి ఆయా పక్షాలకు అధికారం వస్తే, ప్రతికారం తీర్చుకొంటాయని మోడీ & షా ద్వయానికి తెలుసు. వారు గుజరాత్ పాలనలో కొనసాగిన మతకలహాల మారణకాండ & ఎంకౌంటర్లలో, ఏ తుట్టే పట్టుకొన్నా, ఏ కేసు మీద కొత్తగా కసరత్తు మొదలెట్టినా, కట కటాలే అనే విషయం తెలుసు. రానా అయూబ్ రికార్డు చేసిన స్టేట్మెంట్ వీడియోలు చాలు. ఆ భయంతో, బాబు ప్రధాని అయితే, మన మీదకు వ్యక్తిగతంగా రాడనే, ప్లాన్ బి కి వారు మక్కువ చూపుతారు. అధికారంలోకి రావాలనే వారి ప్లాన్ ఎ ఫలించకపోతే.

కేంద్రంలో ఎవరు వస్తే ఏంది కాల్లు పట్టుకొందాం లే, అని నీవు అనుకొంటూ వుండొచ్చు. అప్పుడు చంద్రబాబు కాల్లకు మ్రొక్కినా ఎవరూ ఆశ్చర్య పోరు. రామోజీ విషయంలో జీర్ణం చేసుకొన్నారు కాబట్టి.

నువ్వు రావడం అనేది కల అని నీకూ తెలుసు. అది కేరళా బిజెపి రాష్ట్ర స్థాయి నాయకుడి మీడియా & సంస్థ సర్వే అని నీకూ తెలుసు. కాని, నీ చేతి చమురు విదల్చకుండా, ఖర్చు పెట్టుకొనే బకరాలు ఈ సర్వేలు నమ్మి, కోట్లు పెట్టి, గెలిస్తే నా బలం అని, ఓడితే వారే భ్రష్టు పోతారనేది నీ ఆశ అని, ఏమాత్రం రాష్ట్ర రాజకీయల మీద, కనీస అవగాహన వున్న వారికైనా అర్థం అయ్యే విషయం అని నీకూ తెలుసు.

కానీ నీ మేక పోతు గాంభీర్యం, పాదయాత్ర ఆడంబరం, అందులో చూపించే జనం, బూటకం. కానీ నీకు తప్పదు. కనీసం నీ కేసులకోసం అయినా, కనీసం ప్రతిపక్ష నాయకుడిగా అయినా నీ ఆట నువ్వు ఆడక తప్పదు. పులి స్వారీ, దిగితే ఆహారం అవుతావు. ఆపలేవు అది నీ బలహీనత. నిన్ను గుడ్డిగా నమ్మే వారే బలిపసువులు. వారే నీ పెట్టుబడి. ఆనందించు. శుభాకాంక్షలు. …. చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “శుభాకాంక్షలు జగన్ మోహన్ రెడ్డి గారు,”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 858,983

తడి ఆరని ఉతుకులు

అక్టోబర్ 2018
సో మం బు గు శు
« సెప్టెం    
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: