అక్టోబర్ 8th, 2018ను భద్రపఱచు

కేసీఅర్ తిట్టి అలిసిపోతున్నా, బాబు వణుకుతున్నట్టేనా?

కేసీఅర్ తిట్టి అలిసిపోతున్నా, బాబు వణుకుతున్నట్టేనా?

ఈ మధ్య బాబు మాటలు వింటుంటే కేసీఆర్ కు భయపడినట్టు అనిపించడం సహజం. కేసీఆర్ నోరు పారేసుకొంటూ రెచ్చిపోతున్నాడు. అయినా కలిసి వుందామని కోరాను, కానీ కేసీఆర్ కాదన్నాడు అని బాబు చెబుతున్నారు.

తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ వున్నా, అక్కడి వారికే వ్యవహారం అంతా అప్పగించి, బాబు అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నాడు. చంద్రబాబూ… తేల్చుకొందామా అని కేసీఆర్ అంటున్నా, ఇటువైపు నుండి అదే స్థాయిలో, బాబు నుండి సమాధానం రావడం లేదు.

బాబు గట్టిగా స్పందించే వరకు వదలకూడదన్నట్టు, కేసీఆర్ పదే పదే ప్రగల్భాలకు పోతున్నాడు. వాళ్లే అలసిపోవాలన్నట్టు బాబు గారు చప్పుడు చేయడం లేదు. ఇలా కాదని, నాయిని నరసింహా రెడ్డి చేత, ఇక్కడ గెలవబోయేది వైకాపా, సిఎం అవ్వబోయేది జగన్ అని చెప్పిస్తున్నారు.

అంటే చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబును కావాలని రెచ్చగొట్టడానికే ఇవన్నీ చేస్తున్నారని. కొంచం స్పందించినా, నేరుగా తమకూ చంద్రబాబుకు మధ్యనే పోరాటం అని చెప్పుకోవాలనే, ఆరాటం కనిపిస్తోంది. అక్కడ బలమైన కాంగ్రెస్స్ ని వదిలి, బాబు మీద ప్రగల్భాలకు పోవడం వెనుక, ఢిల్లీ స్థాయిలో మోడీ కుట్ర వుంది.

అవునన్నా కాదన్నా దేశంలో మోడీని ఎదుర్కోవడంలో బాబు ప్రత్యామ్నాయంగా కనిపినిస్తున్నాడు. చత్తీస్‌ఘడ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికలు వున్నాయి. తమ పాట్లు తాము పడాలి. కాని తెలంగాణాలో కెసీఆర్ లాంటి బూతులు మాట్టాడే ఆయన స్థాయికి, బాబు ని దించి పరాభవించాలనే కుట్ర.

ఇటీవల కర్ణాటకాలో ఏకంగా మోడీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ మరియు ఇతర కేంద్ర మంత్రులు, ఆంధ్రా & తెలంగాణా నుండి బిజెపి నాయకులను అంతా మోహరించి, వందకు పైగా బహిరంగ సభలు, రోడ్డు షోలు తామే చేసినా, ఇక మా గెలుపును అడ్డుకోలేరు అని బళ్లారి గాలి డబ్బులు, శ్రీరాములును మరో స్థానంలో నిలుచోబెట్టి శ్రమ పడ్డారు.

బాబు తన ఎడమ కాలు కూడా కర్ణాటకాలో పెట్టలేదు. అరవలేదు, ఆంధ్రా అసెంబ్లీలో కొంత ఆవేదనగా మాట్టాడాడు.

ఆ మాటలు, బెంగుళూరు తెలుగుదేశం ఫోరం అనే చిన్న గుంపు గుండెలను కదిలించింది. తెలుగు సంఘాలను చలి చీమల్లా పేడారు. మధ్యలో వైకాపాతో బెంగుళూరులో బుసకొట్టినా,
తెలుగు ప్రాంతాలలో బిజెపి అనే మహా సర్పానికి పాతర వేసి, అధికారం అందని ద్రాక్షను చేసారు. ఆ అక్కసు, ఆ పరాభవం మరిచిపోలేందు, బిజెపి.

బకరాగా, పావుగా కెసీఅర్ దొరికాడు బిజెపికి. అదే బాబు గారి బాధ. పావు కేసీఅర్ మీద జాలి. బిజెపితో వద్దన్నాడు, వినలేదు. కళ్లు తెరవమన్నాడు. అవి నెత్తికెక్కిన కెసీఅర్ మూదేవిలా, వారి కుట్రలో ఇరుక్కు పోయాడు. ఇంకా కొన్ని నెలల సమయం వుండగనే.

కేసీఆర్ మీద చాలా అంచనాలు వున్నట్టున్నాయి, బిజెపికి. ఆయన చేతిలో తెలంగాణాలో చంద్రబాబు ఓడి, తమ చేతిలో మిగిలిన రాష్ట్రాలలో కాంగ్రెస్స్ ని ఓడిస్తే, ఇక తమకు అడ్డు లేదు అని నిరూపించుకొని అదే ఉత్సాహంతో, పార్లమెంటు ఎన్నికలకు వెళ్లాలని కలలు కంటున్నారు.

అదే సమయంలో, తెలంగాణాలో కెసీఅర్ కి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. కాళేశ్వరం లాంటి వేల కోట్ల ప్రాజెక్టులో భారీ ఇంజినీరింగ్ తప్పు చేసి, ఇప్పటికే 30 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టేసారు. అక్కడ చదువుకొన్న మేధావులు, విద్యా వేత్తలు, అదో తిప్పిపోతల అని ఉమ్మేస్తున్నారు. అది తప్పించుకోడానికి, చంద్రబాబు తెలంగాణా ప్రాజెక్టులు అడ్డుకోడానికి ప్రయత్నించిన దుర్మార్గుడని కెసీఆర్ పదే పదే వాగుతున్నాడు. చంద్రబాబును బూచిగా చూపి, తాను కనీసం పట్టిసీమ లాంటి ప్రాజెక్టు కాదు కదా పూచిక పుల్ల లాంటి కాలువ లో కూడా నీరు ఇవ్వని తన చేతకాని తనాన్ని కప్పెట్టుకోవలనే క్రోథంతో ఊగిపోతున్నాడు.

రాయల తెలంగాణాలో చేర్చాలన్న అనంతపురం లో, కరువు చెరువులు కూడా, తనను కాండ్రించి ఉమ్ముతున్నట్టు అనిపిస్తోంది కెసీఅర్ కి. అందుకే ఇక్కడ జగన్ గెలుస్తాడని అక్కసు మాటలు. దానితో పాటు రేవంత్ తో పాటు వెడుతున్న సామాజిక ఓట్లను చీల్చాలనే ఆలోచన. అందుకే అవినీతి పరుడైన జగన్ కు పొగడ్తలు.

రెచ్చిపోతున్నా, కనీస స్థాయిలో కూడా బాబు తిట్టకపోవడమే కేసీఆర్ కు కాలుతోంది. మరింత కోపం తెప్పిస్తోంది. ఆ కేసీఆర్ కోపమే బలిపీఠంగా మారుతోంది. చిన్నా చితకా గొర్రెల పథకం కూడా వినిపించడం లేదు. ఈ రోజు కెసీఆర్, బూతుల బలిలా మారిపోయాడు. తన అఘోరిస్తున్నదే అథమస్థాయికి లాక్కొని వెళుతోంది అని కెసీఆర్ కి అర్థం అయ్యే సరికి ఎన్నికల షెడ్యూలు వచ్చేసింది.

ఆ నియమావలిలో చిన్న అధికారి కూడా కెసీఅర్ మాట వినడు. మీడియాకూడా స్వరం మార్చుతుంది. ఆయన హుంకరించడానికి అధికారంలో లేదు. మారే ఆట, అపద్ధర్మ ముఖ్యమంత్రి నుండి ఆయనను మాజీ ముఖ్యమంత్రికి మార్చేస్తుంది.

ఎళ్లకాలం ఏమార్చలేము, అదీ ఏమారే వారినే. నోట్ల రద్దు నుండి పెట్రోలు ధరల వరకు తలపట్టుకొన్న మోడీ ప్రభుత్వానికి పావుగా ఫలితం అనుభవిస్తాడు కేసీఅర్ కూడా. ….చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 900,540

తడి ఆరని ఉతుకులు

అక్టోబర్ 2018
సో మం బు గు శు
« సెప్టెం   నవం »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: