గద్దెలో బాధ్యత లేని గద్ద – బాబో విచిత్ర రాజకీయ నేత

గద్దెలో బాధ్యత లేని గద్ద – బాబో విచిత్ర రాజకీయ నేత

రాష్ట్రాల పన్నులను గద్దలా తన్నుకు పోయే కేంద్రం, ఈ మధ్య ఎప్పటికప్పుడు కేటాయింపుల పద్దతులు మార్చే ప్రయత్నాలకు తెగబడుతోంది. తనకు సామంత బానిసల్లా వున్నా, తనకే రాజకీయ లాభం వున్నా, ఓ రకమైన కేటాయింపులు, కాని వారికి యుసిలు గట్రా అంటూ లేని పోని పేచీలు.

రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపుల తగాదా వస్తే, కోర్టులకు వెళ్లాల్సిన దుస్థితి. కేంద్రం కలగజేసుకోదు. అది రాజకీయంగా ఏదో ఒక రాష్ట్రంలో నష్టపోతుంది కాబట్టి, బాధ్యత తీసుకోదు.

కోర్టు తీర్పుల మధ్య, బందులు దహనాలు చేసుకొంటాయి, తమిళనాడు & కర్ణాటకా లాంటి రాష్ట్రాలు. రగిలిపోతూ, వ్యక్తిగత ఆస్తుల దహనాలకు తెగబడిన దాఖలాలు వున్నాయి.

ఎత్తున వున్న వారు, ఎంత ఎత్తు పెంచుతున్నారో, ఏమి చేస్తున్నారో తనిఖీలు చెయ్యరు. క్రింది వారు వెళితే, నిర్బంధించి కేసులు పెట్టి, దశాబ్దాల తరువాత కూడా వేధిస్తారు.

కేవలం రాజకీయ లాభం చూసుకోవడం తెలియని చంద్రబాబు, బంద్ లకు, రాష్ట్రాల మధ్య గొడవలకు కారణం అవ్వకుండా వెళ్లి, ప్రజా ఆస్తులకు నష్టం చేసే దేశంలోని సగటు రాజకీయ పార్టీల్లా బాధ్యతలేని పని చేయకుండా, స్వయంగా వెళ్లి, పొరుగు నిర్బంధంలో, అవమానింపబడిన విచిత్ర రాజకీయ నేత.

విభజనలో ఆస్తులు & అధికారుల పంపకాల అస్పష్టకు నాలుగేళ్లు. కేంద్రం, పెద్దరికం తీసుకొని పరిష్కరించదు. ఆ బాధ్యత తీసుకొంటే, రాజకీయంగా నష్టం. ఇక వీటికీ, దశాబ్దాలు కోర్టులకేసి తిరగాలి. దేశ పార్లమెంటు బాధ్యత వహించదు. కేవలం పనికిరాని, ఇలా స్పర్థలతో సచ్చే సచ్చు చట్టాలను చేస్తుంది.

విభజన కష్టాలకు చేతులెత్తేసింది. చట్టం అమలు మీద చవకబారు ఆరోపణలు, కుప్పిగంతులు. పార్లమెంటులో ప్రధాని హామీ మీద ఆ పదవినే అవమానించేలా, భవిష్యత్తులో ఎవ్వడూ ఆ హోదా మాటలనే నమ్మని విధంగా ప్రస్తుత కేంద్ర పాలన.

రాష్ట్రాల తీర్మానాలను ఆమోదించడంలో కూడా, అయినవాడికైతే, ఆఘమేఘాల మీద. కాని వాడికైతే కాలం వెళ్లబుచ్చే లేని పోని కొర్రీలు.

కొత్త కొత్త సాంప్రదాయలను పరిచయం చేస్తోంది, కేంద్రంలో వున్న బిజెపి. అధికారం శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యంలో మరో పాలక పార్టీ వస్తుంది. ఇలా ఒకరికి మించి ఒకరు వినాశక, పగబతీర్చుకొనే పాలనకు తెగబడితే, ఆయా రాష్ట్రాల సామాన్యులు నష్టపోతారు.

కేంద్రంలోని పాలక పార్టీకి ఒట్లేయకపోతే మన బతుకులు బుగ్గే, మన రాష్ట్రం పరిస్థితి ఇంతే అనే ఆలోచనకు తీసుకుపోతోంది బిజెపి.

అలా అని దానిని గెలిపించిన రాష్ట్రాలలో ఇరగదీస్తోంది అంటే, ఘోరాతి ఘోరమైన పాలనే, చాలా రాష్ట్రాలలో. ప్రాంతీయ పార్టీలు వున్న రాష్ట్రాలలో ఎంతో కొంత బాగున్న పరిస్థితి.

బాధ్యత లేని బిజెపి లాంటి పార్టీలు పెట్టే బాధలు ఎన్నాళ్లు భరించాలి. సంకీర్ణ ప్రభుత్వమే మేలు. పూర్తి అధికారంతో, నోట్ల రద్దు లాంటి పిచ్చి నిర్ణయాలతో నోటికాడ ముద్దను పోగొట్టుకొంది సామాన్యుడే.

ప్రతి పాలక నిర్ణయంలోనూ అభాసుపాలు అయ్యింది. ఏ ఒక్క దానికీ బాధ్యత వహించలేదు. కనీసం సిగ్గు పడలేదు. పైగా ఎదురుదాడి చేస్తోంది. ఒక్క ఆయిల్ ధరలమీద తన స్టాటిస్టిక్స్ ప్రవీణ్యం చూపి ప్రతిపక్ష దాడికి వ్యూహాత్మక మౌన పరాభవంతో కుమిలిపోతొంది. ఓ రకమైన భ్రాంతితో అతిపెద్ద పార్టీగా ఎదిగి అధఃపాతాళానికి వేగంగా జారిపోతోంది బిజెపి. ….చాకిరేవు.

ప్రకటనలు

1 Response to “గద్దెలో బాధ్యత లేని గద్ద – బాబో విచిత్ర రాజకీయ నేత”


  1. 1 Anon 4:43 సా. వద్ద సెప్టెంబర్ 14, 2018

    కేవలం రాజకీయ లాభం చూసుకోవడం తెలియని చంద్రబాబు- joke of the century

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 851,355

తడి ఆరని ఉతుకులు

సెప్టెంబర్ 2018
సో మం బు గు శు
« ఆగ    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: