ఆపరేషన్ గరుడ అనేది అబద్ధం కాదా?

ఆపరేషన్ గరుడ అనేది అబద్ధం కాదా?

శివాజీ చెప్పినది కట్టు కథలు కాదు అని, ఈ రోజు మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు నోటీసులతో అందరికీ అర్థం అయ్యింది.

పదేళ్లకు ముందు బాబ్లీ పోరాట కేసులో, ఇప్పుడు నోటీసు ఇవ్వడం అనేది చిన్నదే అయినా, ఆషామాషీగా తీసుకొనే కుట్ర కాదు.

రాజకీయంలో బాబు కోడిపిల్ల కాదు. బెదిరించి సంకలో ఇరికించుకోడానికి. వచ్చిన గరుడ అనే సమస్యను అవకాశంగా మలిచి గరుడవాహనం లా వాడగల సమర్థుడు. కానీ అరాచకీయ కుట్రలలో బాబు గారిది బేలతనమే.

ఇక్కడి రాష్ట్ర అవసరాల దృష్ట్యా ఆంధ్రా అప్రమత్తంగా వుండాలి.

తమ సమర్థత మీద నమ్మకం లేని అసమర్థులు, బాబు ను చూసి భయపడి, ఆత్మనూన్యతతో మొదలెట్టిన ఆపరేషన్ గరుడకు, తెలుగు రాష్ట్రాలలో ఎవరు సహకరించినా, శత్రువుగా భావించి, ఇంటి శతృవులను రాజకీయ ఆనవాలు లేకుండా చేయాలి.

వారు చేసిన తప్పుల నుండి తప్పించుకోడానికి, దుర్మార్గులకు, బానిస ఊడిగానికి ఒప్పుకొని, ఢిల్లీలో చేసొచ్చిన ఆనలకు తగ్గ ఆటలు, ఇక్కడ సాగవని, సామూహికంగా చాచి కొట్టాలి.

అది మన ధర్మం. కర్తవ్యం. ..చాకిరేవు

ప్రకటనలు

3 Responses to “ఆపరేషన్ గరుడ అనేది అబద్ధం కాదా?”


 1. 1 Jai Gottimukkala 9:36 ఉద. వద్ద సెప్టెంబర్ 14, 2018

  ఈ శివాజీ అనబడే పచ్చ చంచా అది వరకు ఎన్నెన్నో జోస్యాలు (పవన్ కళ్యాణ్ దీక్ష, నరసింహన్ కుట్ర, సరికొత్త ఆగస్టు సంక్షోభం వగైరా) చెప్పాడు. ఒక్కటీ నిజం కాలేదు. ఆగస్టు నెల దాటిపోయింది కదా అని ఇతగాడు నిద్ర లేచి సోమవారం ఇన్కమ్ టాక్సు నోటీసులు అంటూ తాజా కథలు అల్లాడు. తీరాపోస్తే వచ్చింది ఎనిమిదేళ్ల (పది కాదు) డ్రామా తాలూకు అరెస్ట్ వారంటు (నోటీసు కాదు).

  చట్టానికి ఎవరూ అతీతులు కాదు. పచ్చ బాచీ వాళ్ళు 33 లక్షలు ప్రజాధనం లాయర్లకు తగలేయగలరు, బెబెబే బావ మరిది కకక కాల్పుల సాక్షులను తారుమారు చేయగలరు లేదా అసమదీయుల లాయర్లను రాజ్యసభకు పంపించగలరు కనుక కోర్టులు భయపడాలంటే చెల్లదు.

  ఐక్యరాజ్యసమితి కార్యదర్శి పదవి వెంట్రుకవాసితో తప్పిన మహనీయులకే కోర్టుల చుట్టూ తిరగడం తప్పలేదు ఆఫ్టరాల్ దశమ గ్రహ జామాత ఎంత.

  శుక్రవారం హాజరీ అంటూ ఎక్కిరించిన అల్లుడం గారికి అదే ముహూర్తం ఖరారు ఔరా విధి వైపరీత్యం! కాకపొతే ఆయనది నాంపల్లి, ఘనత వహించిన అయ్యగారిది నాందేడ్ తేడా ఇంతేనయా.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 2. 2 విన్నకోట నరసింహారావు 6:28 సా. వద్ద సెప్టెంబర్ 14, 2018

  జై గారూ I suggest you read this interesting WhatsApp forward posted by Bonagiri garu as his comment in రచ్చబండ blog 👇. You will hopefully appreciate the momentous contributions of Chandra Babu Naidu garu.
  ——————-
  bonagiri September 14, 2018 at 7:04 AM
  Forward from whatsapp…

  మెచ్చుకోండి

 3. 3 Jai Gottimukkala 9:00 ఉద. వద్ద సెప్టెంబర్ 19, 2018

  @విన్నకోట నరసింహారావు:

  I saw the Whatsapp forward sir.

  బోనగిరి గారు నలభై నిమిషాల ప్రచార వీడియో లింకు ఇచ్చి “బాత్ రూం లోనో, భోజనం చేస్తూనో” చూడమన్నారు. అంతంత సేపు తినడం లేదా బాత్ రూములో ఉండడం ఆరోగ్యకరమో కాదో మాత్రం వారు చెప్పలేదు 🙂

  కాకపొతే నేను అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబు ఇవ్వకుండా ద్వేషం అని కొట్టి పారేశారు. నా దురదృష్టం!

  మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

 • 892,685

తడి ఆరని ఉతుకులు

సెప్టెంబర్ 2018
సో మం బు గు శు
« ఆగ   అక్టో »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: