పోలవరంలో బాబు బడాయి జగన్ లడాయి మధ్య మనకేం లాభం

పోలవరంలో బాబు బడాయి జగన్ లడాయి మధ్య మనకేం లాభం

సోమవారం అయితే అమ్మో పోలవారం అని పరుగులెడుతూ, ఇంటిపట్టున ఓ తాత పత్తా వుండడు.

ఆయనే సమీక్షస్తాడని,  ఆ పనుల్లో ని పురోగతిని సమీక్షించుకోడానికి అధికారులకు, మంత్రికి, ముందు రోజు ఆదివారం ఖర్చైపోతుంది.

ఇక శ్రామికులు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు, తమ టార్గెట్లను అందుకోవడంలో, వారమంతా, ఎన్ని రోజులు, ఏ ఏ సమయాల్లో తిన్నారో, తినలేదో, ఏ ఏ సమయాల్లో ఇల్లకు చేరారో, చేరలేదో.

అలా పోలవరం అనే ఆంధ్రా కలలో, అందులో పాలు పంచుకొనే వారి కష్టాలు, ఆ కుటుంబాలకు అర్థం అవుతూ వుంటాయి. కాని ఎప్పుడూనా, అసలు మీరే చేసేస్తున్నారా, పండగా లేదు పబ్బమూ లేదు, ఇంట్లో వాల్లతో మాట్లాడడానికి కూడా సమయం లేనంత ఏమి చేసేస్తున్నారో అనే సన్నాయి నొక్కులు మరియు సాధింపులు వుంటాయి.

ఈ రోజు ఆ కుటుంబాలన్నీ, పోల్వరం దగ్గర స్పిల్ వే వాక్ అని పాలుపంచుకొంటున్నాయి.

అదెంత పెద్ద ప్రాజెక్టో కళ్ళతో చూసాక, తమ ఇంటిలోని వారి కష్టాన్ని అర్థం చేసుకొని, మనసులో గర్వ పడతారు. పూర్తయ్యే వరకు ఆ కుటుంబాలు సహకరిస్తాయి. త్యాగాలు చేస్తాయి.

ఈ విధంగా బాబు గారి బడాయి వల్లా పోవరం అనుకొన్నట్టు సాగే లాభం మనకు దక్కుతుంది.

ఇక శుక్రవారం అయితే ఎందుకు ఇంటిలో కాని, అసెంబ్లీలో కాని, పాదయాత్రలో కాని, జగన్ కనిపించకుండా, ఉరుకులు పరుగులు పెడుతూ కోర్టుకు వెళుతాడో అర్థం కాని పిల్లలు కూడా వుండరు రాష్ట్రంలో కాని, వారి ఇంటిలో కాని. భార్యా సమేతంగా కోర్టుకు పోయే జగన్ కు పోలవరంలో ప్రతి పని గొప్పతనం అర్థం కాదు ఈ జన్మకు.

ఇలా పోలవరంలో ప్రతి దానికీ లొడ లొడా అని లడాయి చేసే జగన్ దానికి ఓ దిష్టి బొమ్మ.

ఈ దేశ చరిత్రలో, మొట్టమొదట తెలుగుజాతి, ఓ జాతీయ ప్రాజెక్టును భుజానికి ఎత్తుకొంది. కేంద్ర ప్రభుత్వల్లా, కానంత వేగంగా చేయాలనే క్రమంలో, శ్రమిస్తోంది.

తెలుగు జాతి ఆకాంక్షకోసం, సమయం, ఒత్తిడి, శ్రమ, కుటుంబ అనుబంధాలు ఎన్నో మరిచి చేసుకుపోతున్నారు.

దిగ్విజయంగా పూర్తైతే తెలుగోడు వాడికోసం వాడు వేగంగా కట్టుకొన్నాడు, వాడు తెలుగోడు, ఆంధ్రోడు మరి దేశం అంతా కీర్తిస్తుంది.

పోలవరం పూర్తయ్యాక, ప్రతి పొలంలో నీరు పారుతుంటే, ప్రతి రైతు కుటుంబం సభ్యుల మొహాలలో ఆనందం వెలకట్టలేనిది. పోలవరం ద్వారా విద్యుత్ కూడా మొదలెడితే, ఇప్పటికే మిగులు విద్యుత్ వున్న రాష్ట్రం, అమ్మకాలు ప్రారంభించి అప్పులు కూడా తీర్చేయ వచ్చు.

భవిష్యత్తులో దేశంలో విద్యుత్ అమ్మే రాష్ట్రంగా ఆంధ్రా నిలుస్తుంది. రాబోయే విద్యుత్ వాహనాల శకంలో, అరబ్ దేశాల ఐశ్వర్యాలను తలదన్నేలా ఆంధ్రా ఆర్జిస్తుంది.

పనిచేసే వాడు బడాయి పోతే తప్పులేదు, పంగమాలిన వాడు తప్పుడు కూతలు కూస్తూ, మనుషుల మనసులను చెడగొడితేనే ప్రమాదం.

జై #పోలవరం, జై అమరావతి, జై ఆంధ్రాప్రదేశ్ ….చాకిరేవు.

ప్రకటనలు

4 Responses to “పోలవరంలో బాబు బడాయి జగన్ లడాయి మధ్య మనకేం లాభం”


 1. 1 Anon 4:14 సా. వద్ద సెప్టెంబర్ 12, 2018

  పోలవరం 9 ఏళ్ళు పట్టించుకోకుండా వదిలేసింది ఎవరు. పోలవరానికి ఢిల్లీలో అధికారి ని ఉంచి అన్ని అనుమతులు తెచ్చింది ఎవరు. ఇప్పుడు పట్టిసీమ కు నీలు ఇవ్వడానికి కాలువలు తవ్వించింది ఎవరు. కేంద్రం కడతామంటే బులిబూచికం చేసి ఇప్పుడు కట్టలేక అవస్థలు పడుతూ గాలరీ గారడీ చేస్తున్నది ఎవరు బయ్యా.

  మెచ్చుకోండి

 2. 2 తాడిగడప శ్యామలరావు 2:45 ఉద. వద్ద సెప్టెంబర్ 13, 2018

  . . . అదెంత పెద్ద ప్రాజెక్టో కల్లతో చూసాక . . .

  తప్పు ఎత్తిచూపవలసి వస్తున్నది. అందుకు అన్యధాభావించవలదని విన్నపం.

  కల్లు అనటం సరికాదండి కన్ను అనే పదానికి బహువచనం కళ్ళు. అందుచేత కళ్ళతో అనటం సరైనది. మీకు ఈ సలహా హితవైన పక్షంలో దయచేసి మీటపాను సరిజేసుకొనవలసింది.

  ఈమధ్యకాలంలో టీవీస్క్రోలింగులలోనూ, వార్తాపత్రికలలోనూ, బ్లాగువ్రాతల్లోనూ అనేక అక్షరదోషాలు కనిపించి బాధిస్తున్నాయి. ఇక శ్రవ్యమాధ్యమాల్లో ఐటె ఉఛ్చారణాదోషాలను గురించి చెప్పనలవి కాదండి.

  బ్లాగుల్లో ఐతే కంటబట్టప్పుడు ఉండబట్టలేక ఇలా ఉ,బో,స. ఇవ్వటమూ అది నచ్చనివారి నుండి మాటలు పడటమూ ఇబ్బందిగానే ఉంది. నిజానికి తాజాగా నిన్ననే ఇటువంటి అనుభవం కలిగింది కాబట్టి కొంత సంకోచిస్తూనే ఈ వ్యాఖ్యను వ్రాస్తున్నాను. మీకు ఇబ్బంది కలిగిన పక్షంలో మన్నించండి.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 3. 3 ramesh 3:32 సా. వద్ద సెప్టెంబర్ 13, 2018

  భవిష్యత్తులో దేశంలో విద్యుత్ అమ్మే రాష్ట్రంగా ఆంధ్రా నిలుస్తుంది. రాబోయే విద్యుత్ వాహనాల శకంలో, అరబ్ దేశాల ఐశ్వర్యాలను తలదన్నేలా ఆంధ్రా ఆర్జిస్తుంది.
  May i know how many MW or Giga watts of the electricity will be produced by this project ?
  Seems to be you are building air castles ..

  మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

 • 892,685

తడి ఆరని ఉతుకులు

సెప్టెంబర్ 2018
సో మం బు గు శు
« ఆగ   అక్టో »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: