నేను మతం మారను బ్రహ్మర్షి చాగంటి గారు, కాని భావితరం గురించి భయంగా వుంది

నేను మతం మారను బ్రహ్మర్షి చాగంటి గారు, కాని భావితరం గురించి భయంగా వుంది

ఆంధ్రా మీద అమరలోక అనుగ్రహం అనుకొంటా, బృహస్పతిలాంటి మిమ్మల్ని అనుగ్రహించారు. మీ ప్రవచనాల ప్రవాహం గొదావరిలా పొంగుతుంటే పులకించిపోయింది, ప్రతి తెలుగు హృదయం. ప్రతి ఒక్కరూ మనశ్శాంతిని వెతుక్కొంది మీ మాటలలోనే.

ఎందుకంటే, వై ఎస్ తన అల్లుడు, ఆలి, కూతురు మొత్తాన్ని ఆంధ్రా అంతటా, ఓ ప్రక్క ప్రభువు గురించి పలికిస్తుంటే, మరో ప్రక్క ఏడు కొండలు కావు రెండు కొండలే అని జిఒలు ఇస్తుంటే, తిరుమల దారిలో వున్న జింకలూ దుప్పులూ కూడా తన ఇడుపులకు తరలించుకుపోడానికి ప్రయత్నిస్తుంటే, నాస్తికుడైన కరుణాకర్ రెడ్డిని, కలియుగ వైకుంఠ ఆలయ కమిటీ అధ్యక్షుడిని చేస్తే, మీరు చెప్పే ధర్మమే కాపాడుతుంది అని నమ్మాము.

అదే నిజం అయ్యింది.

ఆ తరువాత, ఓం నమో వెంకటేశాయ అని మాత్రమే వింపించే, ఆ కలియుగ వైకుంఠ ఆలయ సన్నిధిలో, జై జగన్ మోహన్ రెడ్డి అనే జయ జయ ధ్వానాలు విన్నప్పుడు కూడా, మీ ప్రవచనాలే మనుషుల మీద పని చేసాయి.

నామకరణం నుండి తద్దినం వరకు నిర్వహించే బ్రాహ్మనోత్తములలో పేదరికం వుండకూడదని కార్పోరేషన్ పెడితే ఏ కులమూ అడ్డు చెప్పలేదు. అంతటి గౌరవం ఆంధ్రాలో, బ్రాహ్మణుల మీద. మిగిలిన అగ్రవర్ణాలకు ఆ కార్పోరేషన్లు ప్రకటించకపోయినా. ఎటువంటి కుళ్లు, అసూయ కలగలేదు. ఎందుకంటే, వేదం ఈ వేద భూమిలో కాళ్లూనుకొని వుండాలనే కాంక్ష. అదీ మన ఆంధ్రాలో అయితే మరింత ఆనందదాయకమని.

రాజు విష్ణు స్వరూపుడు అని చెబుతుంది ధర్మం. రాజకీయం నేర్చిన కొంత బ్రాహ్మణీయం, ఏహ్యంగా రాజును చూసి ఏడ్చినా, ఎగతాళి చేసినా, తప్పు పడుతున్నా, ప్రజలు ఎవరూ ఏమీ అనలేదు.

అదే ఒక బ్రాహ్మణుడు మొన్న కలియుగ వెంకటేశ్వర మలయప్ప స్వామిని తన మడత పడిన కాలుతో, భూమి మీద పడేసినా, ఎవరూ ఏమీ అనలేదు, పల్లెత్తి మాటనలేదు. అది మానవ తప్పిదం అనుకొన్న బ్రాహ్మణత్వం మీద వున్న గౌరవం.

కాని నిన్న విశాఖలో, వైఎస్ఆర్ లో వై అంటే యజుర్వేదం, ఎస్ అంటే సామవేదం, ఆర్ అంటే రుగ్వేదం అని వేదం పలికే భ్రాహ్మణుల నోట పలికితే బాధేసింది, జాలేసింది.

ఎప్పుడు సామవేదం అని విన్నా, నాకు గుర్తుకు వచ్చేది సామవేదం షణ్ముఖశర్మ గారు. ఇక నుండి నన్ను వైఎస్ఆర్ ని గుర్తుకు చేసుకొమంటుంటే, నేనేం పాపం చేసానని, హిందువులు ఏం పాపం చేసారని, ఇలా బ్రాహ్మణులే హిందూ మతానికి ఎందుకు వక్రబాష్యం చెబుతున్నారో, అర్థం కావడంలేదు.

హిందూమతం ఇంకా బతికి బట్టకడుతూ వుంది అంటే అగ్రజులు బ్రాహ్మణుల వలన, తరువాత ఇతర కుల మనుజుల వల్లా.

మా తాత, నాన్న వారసత్వ నమ్మకం తో, నేను మతం మారననే నమ్మకం, నాకుంది. కాని భవిష్యత్తులో ఇలాంటి వక్ర బాష్యాలతో, బ్రాహ్మణత్వం గౌరవం కోల్పోయి, ఏహ్యభావం ఏర్పరుచుకొంటే, హిందూత్వం మాత్రం ఖచ్చితంగా వుండదు. ఈ వేద భూమిలో కనిపించకుండా పోతుంది. అదే లేకపోతే బ్రాహ్మణ పదాన్ని, మా అంత గౌరవంగా ఉచ్చరించడానికి కూడా భయపడే పరిస్థితులు వస్తాయి.

రాజకీయం చేయడం తప్పు కాదు, పివి నరసింహా రావు గారిని, ఏకగ్రీవంగా ఎన్నిక చేసి, ఆంధ్రా నుండి అత్యున్నత పీఠం అయిన హస్తిన గద్దె మీద నిలిపి, గౌరవంగా చూసుకొన్న గడ్డ ఇది.

మూడు సింహాల దేశ ముఖ చిత్రం మార్చిన మహా నాయకుడు. అదే మనిషి పార్థీవ దేహం హైదరాబాదు వస్తే, ఖననంలో కూడా కండకావర రాజకీయం చేసిన వైఎస్ఆర్ అనే మనిషిలో మూడు వేదాలు చూసుకోమనే మనుషులైన బ్రాహ్మణుల ఉవాచలను, ఈ చెవులతో, ఈ జన్మలో వినాల్సి వస్తుంది అనే కర్మ, ఊహించలేదు.

కాని దృతరాష్ట్రుడి రేయి అయితే విదురుడు చెప్పేది విని, నేను దుర్మార్గుడిని మారలేను అంటూ, కళ్లు లేకపోయినా శ్రీ మహా విష్ణువు విశ్వరూపాన్ని వీక్షించాడు అని ప్రతి రోజూ ఏదో సమయంలో వినే మీ ప్రవచనంలో, విన్నట్టు గుర్తు. అలా నాది శూద్ర కులం అయినా, మాంసాహారం తింటూ, మానకున్నా, మీ మాటలు వింటూ పుణ్యం వస్తుంది అని నమ్మే సగటు శూద్ర శిష్యుడిని. ఏదో ఒక రోజు మీ దర్శనం కలిగేలా దేవుని కోరుకొంటూ. ….చాకిరేవు.

ప్రకటనలు

3 Responses to “నేను మతం మారను బ్రహ్మర్షి చాగంటి గారు, కాని భావితరం గురించి భయంగా వుంది”


 1. 1 Jagadeesh Reddy 10:53 ఉద. వద్ద సెప్టెంబర్ 11, 2018

  మీ ఆవేదనలో అర్ధం ఉంది.. మీ భయం నిజం కాకూడదని నేను కూడా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  మెచ్చుకోండి

 2. 2 తాడిగడప శ్యామలరావు 11:11 సా. వద్ద సెప్టెంబర్ 11, 2018

  . . . వైఎస్ఆర్ అనే మనిషిలో మూడు వేదాలు చూసుకోమనే మనుషులైన బ్రాహ్మణుల ఉవాచలను . .

  శాంతమ్ పాపమ్.

  మెచ్చుకోండి

 3. 3 anon 11:28 ఉద. వద్ద సెప్టెంబర్ 12, 2018

  బోడిగుండుకి మోకాలికి ముడిపెట్టినట్టు వాళ్ళేదో వెర్రి అభిమానంతో ఏదో చెబితే నువ్వు మతం మార్చుకోవడమేమిటి. అయినా పచ్చ బ్యాచికి ఉన్న బ్రాహ్మణద్వేషం అందరికీ తెలిసిందే కదా.

  మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

 • జగన్ ప్రమాదకారి అని తన సాక్షిలో తెలియక పోవచ్చు, తెలుసుకొనే స్వేచ్చను తనను నమ్మిన శ్రేయోభిలాషులకు కూడా ఇవ్వలేదు. chaakirevu.wordpress.com/2019/02/14/%e0… 1 day ago

వీక్షణలు

 • 884,614

తడి ఆరని ఉతుకులు

సెప్టెంబర్ 2018
సో మం బు గు శు
« ఆగ   అక్టో »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: