తల్లి కాంగ్రెస్స్ పైకి తేలి ఊపిరితీసుకొంటోంది పిల్ల కాంగ్రెస్స్ మునుగుతోంది

తల్లి కాంగ్రెస్స్ పైకి తేలి ఊపిరితీసుకొంటోంది పిల్ల కాంగ్రెస్స్ మునుగుతోంది

రాష్ట్రంలో శూన్య స్థితికి వెళ్లిన కాంగ్రెస్స్, పోగొట్టుకొన్నది ఏమో తెలుసుకొంది. ఆంధ్రాకు అన్యాయం చేసి మరీ తెలంగాణాకు చేసిన ఉపకారం తో తమకు కృతజ్ఞతలేని అపకారమే జరిగిందని, అంతర్మధనం చేసుకొంది. ఆంధ్ర ప్రజలు మోసం చేయలేదు, ద్వేషించే స్థాయికి కేసీఆర్ అనే వ్యక్తిని నమ్మి దారుణంగా మోసపోయామని కాంగ్రెస్స్ తెలుసుకొంది. రాజకీయంగా మోసపోయినా పర్లేదు. కాని కాంగ్రెస్స్ పార్టీలోని వారిని కేసీఆర్ తన పార్టీలో చేర్చుకొని, మరింత దారుణంగా దెబ్బకొట్టాడు. సాయం చేసి నమ్మిన కాంగ్రెస్స్ ఆ బాధ అనుభవిస్తోంది. దానికి తోడు, కేసీఅర్ నేరుగా బిజెపి తో కలవకపోయినా, లోపాయకారిగా ఇంకా దాని కోసమే పని చేస్తున్నాడని కాంగ్రెస్స్ తెలుసుకొంది.

కెసీఆర్ కౌగిలిలో, కన్నూ మిన్నూ గానక, చంద్రబాబు ఢిల్లీలో నిరాహార దీక్ష చేసినా, ఈసడించుకొంది, పట్టించుకోలేదు. చంద్రబాబునే కాకుండా ఆంధ్రానే శత్రువుగా భావిస్తున్నట్టు బరితెంచి మరీ ఘోరీకట్టుకొంది. కాని ఆ శత్రువు చంద్ర బాబే, దేశ స్థాయిలో ఆంధ్రా కోసం తన శత్రువుకు బిజెపికి ఎదురొడ్డి నిలబడ్డప్పుడు, కాంగ్రెస్స్ కి తెలిసి వచ్చింది. ఆ ధైర్యం, తనకూ లేదు మిత్రులకూ లేదు, కారణం అందరూ ఏదో ఒక అవినీతి కుంభకోణంలో బిజెపికి బయపడాల్సిన పరిస్థితి. కాని చంద్రబాబుకు అటువంటివి ఏవీ లేదు. అందుకే ఎటువంటి మొహమాటం లేకుండా, మోడీ నుండి బిజెపి కుంభస్థలాన్నే మోదుతున్నాడు.

మిత్రుడు కెసీఅర్ శత్రువు అయ్యిన బాధలో, తము శత్రువు అనుకొన్న చంద్రబాబు, తమను తుడిచిపెట్టేస్తున్న శత్రువు బిజెపిని పట్టిన భల్లూకపట్టుకు, కాంగ్రెస్స్ కి కర్తవ్యం గుర్తుకు వచ్చింది. పోగొట్టుకొన్న చోటు నుండే మొదలెట్టాలని, ఏకంగా, తెలంగాణాలో ఏమైపోయినా పర్లేదని, దిద్దుబాటు చేద్దామని, తాము ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తామని ధైర్యం చేయడమే కాకుండా, ఈ శతాబ్దంలో దేశంలో ఎక్కువ మోసపోయింది ఆంధ్రా అని రాహుల్ నోట చెప్పించింది.

ఆ మాటలకు ఆంధ్రాలో వస్తున్న స్పందనకు బహుశా కాంగెస్స్ సిగ్గుపడుతూ వుండొచ్చొ. ఇలాంటి ప్రజలకా మనం కేసీఅర్ ని నమ్మి మోసం చేసింది అని. ఇది నిజం.

చిదంబరం నుండి డిఎంకె వరకు, లాలూ, కేజ్రీవాల్ మొదలగు పార్టీలు, బిజెపి అధికారానికి, బెదిరింపులకు, పెడుతున్న ఇబ్బందులకు ఎదురొడ్డి, రాజకీయం చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో, ప్రజల్లో వారికి మద్దతు పెరుగుతోంది. కాని పిల్ల కాంగ్రెస్స్ జగన్, పిల్లిలా లొంగిపోయాడు బిజెపికి, స్వయంకృతం. నేరుగా బిజెపి మీద దాడి చేయలేకపోయాడు. బదులు కేంద్రం కొనసాగిస్తున్న అన్యాయానికి ఎదురొడ్డిన చంద్రబాబును, బిజెపిని దొడ్డిదారిలో కలుసుకొనే జగన్ నిత్యం తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. అది చంద్రబాబుకు కలిసి వస్తోంది.

ఈ సమయంలో కాంగ్రెస్స్ ఒంటరిగా పోటీ చేయలేందు. పవన్ & కమ్యూనిస్ట్ లు కలిసి చేస్తున్న పోరాటంలో, చివరి దశలో మూడూ కలుస్తాయి. వీరికి చివరి రెండు నెలలు చిరంజీవి కూడా ప్రచారంలో కలుస్తాడు. ఇది జగన్ కి మాడు పగలకొట్టి ముంచే పరిస్థితి. ఆ మూడూ కలిస్తే, అవి చీల్చేది ప్రభుత్వ వ్యతిరేఖ ఓటే కాదు, జగన్ ఓట్లకు కూడా గండి కొడుతుంది. ఈ కూటమి ఎంత బలపడితే, అంత భారీ దెబ్బ జగన్ కు.

అది కొద్దిగా, కొద్ది కొద్దిగా అర్థం అయ్యింది జగన్ కు. ఆ నిస్పృహలో ఏమి మాట్లాడుతున్నాడో తెలియక కాపుల రిజర్వేషన్ నా పరిధి కాదు కేంద్రంలోనిది. కాబట్టి నేను ఏమీ చెయ్యలేను, కావాలి అంటే కార్పోరేషనుకు ముష్టేస్తా అన్నట్టు మాట్లాడ్డం, పూర్తిగా ఆశలు అడుగంటే. ఎంత అడుగంటినా అనాల్సిన మాటలు కావు అవి. ఎందుకంటే, రజకులు, వడ్డెర, ఇలా చాలా కులాలు ఈ రిజర్వేషన్లు అడుగుతున్నాయి, మార్చమంటున్నాయి. ఇప్పుడు వారి విషయంలో జగన్ ఏమీ చెప్పలేదు. అసలు నోరు తెరవలేడు. ఇంకెవరన్నా ఏమన్నా చేస్తామని వారికి చెప్పినా, జగన్ స్పందించలేడు రాజకీయంగా.

కడప నుండి ప్రతి చోటా ముస్లీం ఓటర్లలో భారీ మార్పు కంపిస్తోంది, జగన్ అంటే కంపరం కలుగుతోంది వారికి. ఈ రోజు ఎక్కువగా చంద్రబాబు వెంట వున్నారు అన్నది వాస్తవం. ప్రభుత్వం మీద వ్యక్తిగత వ్యతిరేఖత వున్న వారు, తప్పకుండా కాంగ్రెస్స్ కూటమి వైపు మరలుతారు. మథర్ తెరిసా పేరు మీద వున్న క్రైస్తవ అనాధాశ్రమాల మీద దాడులు గట్రాతో ఆగకుండా, ఏకంగా ఆమెకు ఇచ్చిన భారత రత్న కూడా వెనక్కు తీసుకోవాలి అని ఉత్తర భారతంలో బిజెపి ప్రతినిధులు చేస్తున్న విపరీత వాఖ్యలు కూడా జగన్ పార్టీ పై పడుతుంది. తక్షణం మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే శక్తుల ధైర్యానికే క్రైస్తవ మతం తమ శక్తియుక్తులు ధారబోయెచ్చు. ఒక్కో కులాన్ని, మతాన్ని దూరం చేసుకోవడమే కాదు, దేశంలో ఏ రాజకీయ పార్టీ ఇవ్వలేని, ధైర్యం చేయలేని, నమ్మశక్యం కాని హామీలు ఇస్తూ తన పార్టీకి చావో రేవో అనే ఒత్తిడితో, మరిన్ని తప్పులు చేస్తూ, కొంచం కొంచం మునుగుతున్నాడు.

బహుశా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక, బిజెపి మీద తిరగబడదామని అనుకొంటూ వుండవచ్చు. కాని అది కూడా చేసేస్తే, ఏ ప్రభుత్వం వచినా వారికి మోకరిల్లే జగన్ అని అసహ్యించుకొంటారే కాని రాష్ట్ర ప్రయోజనాలు మీద కనీస అవగాహన లేని వ్యక్తిగా ప్రజలకు మరింత దూరం అవుతాడు. ….చాకిరేవు.

ప్రకటనలు

1 Response to “తల్లి కాంగ్రెస్స్ పైకి తేలి ఊపిరితీసుకొంటోంది పిల్ల కాంగ్రెస్స్ మునుగుతోంది”


  1. 1 తాడిగడప శ్యామలరావు 12:39 సా. వద్ద జూలై 30, 2018

    బీజేపీ ఐనా కాంగీ అయినా వాళ్ళని ఎంతమాత్రమూ నమ్మే పరిస్థితిలేదు ఆంధ్రాలో. ఈరోజు హోదా ఇస్తాం అంటూ కబుర్లు చెబుతున్నా ఈ కాంగీ వాళ్ళు – అదీ ఇవ్వరు ఎలాగూ. ఏదో సంకీర్ణప్రభుత్వం తప్ప సొంతంగా దొరతనం వెలిగించే సీను లేదు కాంగీవాళ్ళకి. సంకీర్ణంలో మిగతా భాగస్వామ్యపక్షాల వాళ్ళు అభ్యంతరం చెబుతున్నారని ఒక చిన్న బాంబు వేసి తప్పుకుంటారు కాని వాళ్ళిచ్చేదీ చచ్చేదీ ఏమీ ఉండదు. అది మాత్రం మరవరాదు తస్మాత్ జాగ్రత జాగ్రత జాగ్రత. పైగా మమ్మల్లి ఈసారి 2024లో 350 లేదా 400 సీట్లు ఇచ్చి గెలిపించండీ అప్పుడు హోదా ఇస్తాం అని కూడా అనగలరు సుమా! ఎలాగూ ఒక్కసీటూ చచ్చినా ఇవ్వటానికి ఇంకేమాత్రమూ ఇష్టపడని అంధ్రాపై వీలైనంత కక్షతీర్చుకోవటం అన్నది బీజేపీ వాళ్ళ ఉద్దేశం అన్నది అందరికీ తెలిసిందే.

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 892,685

తడి ఆరని ఉతుకులు

జూలై 2018
సో మం బు గు శు
« జూన్   ఆగ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: