మోడీ గారు మార్చి పరీక్షలకు వద్దని జూలై టెస్ట్ కి ఎందుకు

మోడీ గారు మార్చి పరీక్షలకు వద్దని జూలై టెస్ట్ కి ఎందుకు

సంవత్సరం అంతా చదివిన సిలబస్ మొత్తానికి పరీక్ష పెడితే, చదవని విద్యార్థి ఎలా బెదురుతాడో, అలా బెదిరి పారిపోయింది బిజెపి, మార్చ్ పార్లమెంటు సెషన్ లో ఇచ్చిన అవిశ్వాస తీర్మానాల నుండి.

డైమండ్ మోడీ గారి సిలబస్ గైడ్‌తో దావోస్ లో ఫోటో తీసుకొన్నాడు గాని, ఆ డైమండ్ నీరవ్ ఆర్థిక నేరం చేసి తుర్రుమన్న సబ్జెక్ట్ నుండి ఏ సబ్జెక్టూ అర్థం కాలేదు, ఎంత చదువుతున్నా బుర్రకెక్కడంలేదు.

అట్టాంటి సమయంలో పార్లమెంటులో అవిశ్వాస పరీక్షలో అటూ ఇటూ అయితే, కర్ణాటకా సెలక్షన్స్ కి మొద్దబ్బాయి మోడీ అంటారనే భయంతో మార్చ్ పరీక్షలను ఎగ్గొట్టారు.

కర్ణాటకలో తెలుగోళ్లు ఆడిన తొక్కుడుబిల్లతో గెలుపు ముంగిట బోర్లా పడి, జాతీయ స్థాయిలో దేశానికి ధైర్యం వచ్చిన వేళ, బిక్కసచ్చిపోయింది బిజెపి.

తరుముకొస్తొన్న మూడు రాష్ట్రాల ఎన్నికలు, దాని తరువాత వచ్చే లోక్ సభ ఎన్నికల్లో, బిజెపి వస్తుందో రాదో తెలియదు కాని, మోడీని పక్కన బెట్టేస్తారని దేశం అంతా అనుకొంటున్న వేళ,

తనకంటే సీనియర్ అయిన చంద్రబాబును, తను తొక్కిపడుతున్నా, అడ్డంకులు సృష్టిస్తున్నా, ఒక విధంగా పాలనలో తనకే కాదు దేశానికి గురువులా, మార్గదర్శిలా రోజు రోజుకూ, తన ప్రభుత్వం చేతే గండపేరండం తొడిగించుకొనేలా, జాతీయ స్థాయి ర్యాంకులుతో విజృభిస్తుంటే, స్వాతి కిరణంలో మమ్ముట్టిలా అసూయ తో దిగజారి దిగజారి అర్భక పాలన అందిస్తున్నాడని దేశం అంతా కోడై కూసే స్థాయికి వెళ్లి, సొంత పార్టీలో కూడా గుసగూస లాడుకొనే పరిస్థితికి నెట్టబడ్డాడు.

కర్ణాటక ప్రమాణస్వీకారం తరువాత, అక్కడ విపక్షాల విశ్వరూప ప్రమాణస్వీకారం చూసాక, ఆర్ ఎస్ ఎస్ నుండి అంతటా ఓ విధమైన నైరాశ్యం. ఆ స్థితిలో కూడా ఆంధ్రాలో, మెతక్కా వున్నారని రాష్ట్ర పార్టీలో మార్చి, కన్నా చేత , ఏ మాత్రం ఆంధ్రా మీద అవగాహన లేని జీవిఎల్ చేత కట్టడి చేసేద్దామని తెగించి, తమ పార్టీ అధ్యక్షుడినే అమిత్ షానే అలిపిరిలో నిలదీసే స్థాయి నుండి కంగుతిని, కన్నా మీద చెప్పుల దాడితో మరింత కృంగి కృషించిపోయారు.

పార్లమెంటు సాక్షిగా తన వాగ్దాటినే అస్త్రంగా సంధించి పులైపోదామని తలపోసినట్టున్నారు మోడి గారు. అందుకే ఎక్కువ సమయం కూడా తీసుకోకుండా శుక్రవారాన్నే ముహుర్తంగా పెట్టుకొన్నాడు. బహుశా తను ఇన్నాళ్లూ వాగుడు మీద కేంద్రీకరించి సిద్ధపడి వుండవచ్చు. కాని ఇవతల చంద్రబాబు బిజెపి ప్రభుత్వం మొండిగా మూర్ఖంగా సాధిస్తోందని, దేశంలోని పార్లమెంటు సభ్యులకంతా ముందుగానే లేఖాస్త్రాన్ని సంధించారు.

తన పాలనా సామర్థ్యం మీద దృష్టిపెట్టకుండా, ఎదుటివారి నీడకు భయపడి అసూయపడి, దిగజారే పాలనతో ఆంధ్ర ప్రజలను హింసించడానికీ వెనకాడని మనస్తత్వ మోడీ గెలవచ్చు గాక, కాని దేశం ముందు నిస్సిగ్గుగా నిలబడి తన వాగుడుతో తెగబడవచ్చు గాని, మిస్టర్ ప్రైం మినిస్టర్ అనే తొలి తెలుగు ఆంధ్రుని పిలుపుకు, ఉలిక్కిపడి నేరుగా సమాధానం చెప్పలేక ఓడిపోవడం మాత్రం ఖాయం. …చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “మోడీ గారు మార్చి పరీక్షలకు వద్దని జూలై టెస్ట్ కి ఎందుకు”  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 889,951

తడి ఆరని ఉతుకులు

జూలై 2018
సో మం బు గు శు
« జూన్   ఆగ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: