జనరేషన్ సి నాయకత్వంలో

జనరేషన్ సి నాయకత్వంలో

గమనిస్తే ఇప్పటికే కొన్ని గ్రామాలు
వృద్ధులతో మాత్రమే వుండడం నిజం

ఇది మీరు మొబైల్ లో చదువుతున్నారో
కంప్యూటర్ మానిటర్ మీద చదువుతున్నారో
ట్యాబ్ లో చదువుతున్నారో
చెప్పడం కష్టం

ఆ స్థాయి టెక్నాలజీ
వినియోగ విస్పోటం

ఇంకో 30 ఏళ్లలో
దేనిలో చదువుతూ వుంటారో ఊహించలేం
కాని అప్పటికి 70 శాతం సిటీల్లో వుంటారని
ఓ అంచనా

జిడిపిలో 80 శాతం
చేరేది సిటీల ఆదాయమే

మనం మనుషులతో నేరుగా
మాట్టాడ్డం మరిచిపోయి
జనరేషన్ సి అంటే
కమ్యూనికేషన్ జనరేషన్లో వున్నాం
ఇప్పటికే

మనం ఏం సాధించాలి అన్నా
మన సామర్థ్యం పెట్టాలి
అది తెలివి కావచ్చు, చదువు కావొచ్చు,
శ్రమ కావచ్చు, డబ్బు కావొచ్చు

ఓ కొత్త సిటీ అయినా అంతే
అమరావతి అయినా అంతే

మనం వుండాలనుకొనే సిటీ
మనం వెళ్లకూడదనుకొన్నా పరిస్థితుల వల్లా
అంటే పిల్లల ఉన్నత చదువుల కోసం కావొచ్చు
అనారోగ్యం వల్లా కోవచ్చు
లేదా మన ఆదాయ ఆర్జన కోసం కావొచ్చు
వెళ్లి వుండాల్సిన వచ్చే పరిస్థితులే

ఒక నాటి అమరావతి లా
ఆ వెలుగులు రావాలి అంటే
ప్రపంచంలోని సిటీల స్థాయికి ఎదగాలి
దానికి కష్టపడక తప్పదు

లేదంటే
వర్షం వస్తే మునగడం
వెలిస్తే తాగడానికి నీరు లేదనడం
గుంతలు లేకుండా రోడ్డేస్తే నీళ్లపైపులకో
కేబుల్ వెయ్యడానికో తవ్వడం
చెట్లు కొట్టేసి వేడికి అల్లాడ్డం
రోడ్ల విస్తరణకు కోర్టు సమస్యలతో ట్రాఫిక్
సవాలక్ష సమస్యలతో మూలిగే
దేశంలోని అన్ని సిటీల సరసన
హలో లక్ష్మణా అయిపోవడమే

గిరగీసుకొన్న మూస రాజకీయం నుండి
బాబు లాంటి వారు బయటకొచ్చి
చేస్తున్న ఆలోచనలతో

మన అమరావతి కట్టుకొంటే
మన తరమే కాదు
మరెన్నో తరాలు
దేశానికే 30% జిడిపి అందిస్తున్న
కొన్ని ప్రపంచ దేశాల సిటీలా

అదాయంతో
ఆరోగ్యంతో
ఆహ్లదంతో

కమ్యూనికేషన్ జనరేషన్
కాలుకదపకుండా స్మార్ట్ గా బతికేస్తుంది
అన్ని సౌఖర్యాలతో

ఆ తరం మనలను తలుచుకొంటూ
ఔరా మన ప్రాచీన ఆంధ్ర జాతి అంటూ
ప్రపంచంలో తలత్తుకొనే వుంటుంది. …..చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “జనరేషన్ సి నాయకత్వంలో”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 851,355

తడి ఆరని ఉతుకులు

జూలై 2018
సో మం బు గు శు
« జూన్   ఆగ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: