మరో టంగుటూరి ప్రకాశం పంతులులా ఈ మహేష్

మరో టంగుటూరి ప్రకాశం పంతులులా ఈ మహేష్

కన్నా లక్ష్మీ నారాయణ గారు, అనుభవమున్న రాజకీయ నాయకుడు. అదే అనుభవంతో, బిజెపి మీద రాష్ట్ర ప్రజల అసహ్యాన్ని అంచనావేసి పార్టీ మారదామని ఆలోచన చేసినవాడు. ఆఖరి నిమిషలో ఆగి అధ్యక్షుడు అయ్యాడు. ఆ హోదాలో జనంలోకి వచ్చాడు.

కాని రోజూ మీడియాలలో, రాష్ట్రంలో పంచాయితీ వార్డులో గెలవలేని వారు, రాష్ట్రం గురించి వాగుతుంటే, ప్రజల్లో పెల్లుబుకుతోంది ఆగ్రహం. దానికి తోడు మోడీ అమలుచేయ చేతకాని నల్లధన, నోట్ల రద్దు, జిఎస్టి నిర్ణయాలతో… దేశంలో బిక్షగాడి నుండి కోటీశ్వరుల వరకు కోపంగా వున్నారు.

ఇవన్నీ అనుభవజ్ఞుడైన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడికి తెలుసు. ఎన్నికల వరకు సహనంతో వుండలేక, జనం లో కొందరు సంయమనం కోల్పోయి రెచ్చిపోతారని తెలుసు. తెలిసీ జనంలోకి వీరుడిలా, కేంద్రంలో పాలకులమనే అహంకారంతో వెళ్లడం, ప్రజాస్వామ్యం లో చట్టబద్దమే.

బ్రిటీష్ వారికి చొక్కా విప్పి గుండెను చూపి కాల్చమన్న నాటి టంగుటూరి ప్రకాశం పంతులులా, ఆవేశంతో సమయమనం కోల్పోయి చెప్పులు విసరడం చట్టబద్దంగా తప్పే. అతనిని పోలీసులకు అప్పగించకుండా, తలో చెయ్యి వేసి దారుణంగా ఒక్కడిని చేసి కొట్టడం అంతకన్నా పెద్ద తప్పు. మానవత్వం అనిపించుకోదు.

అధికార బలంతో అహంకారంతో, జనంలోకి వెళ్లి, సహించక తిరగబడే వారిని, అణిచేసేలా కొట్టవచ్చు. కాని, ప్రజాస్వామ్యంలో ఓటుకు రాజకీయ పార్టీ సచ్చిపోతుంది. కన్నా గారి మాతృ జాతీయ పార్టీ కాంగ్రెస్స్, ఈ రోజు రాష్ట్రంలో శూన్య పక్షం.

ఓ రాజకీయ నాయకుడిగా కన్నా గారికి పార్టీలు మారి అధ్యక్ష హోదా పొందే అవకాశం వుండొచ్చు. కాని కేంద్ర ప్రభుత్వ అసమర్థ నిర్ణయాల వల్లా జీవితాలు అస్తవ్యస్థం అయిన సామాన్యుడికి, ఆ అవకాశం దొరకదు. ఆ నిస్పృహలో నుండి ఆవేశమే వస్తుంది, మనిషిగా సంభాలించుకోలేనప్పుడు.

రాజకీయ నాయకులే ప్రజల మనస్తత్వాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే ఇలాంటి అవాంచనీయ ఘటనలను ఏ ప్రభుత్వాలు ఆపలేవు. అనివార్యమయ్యే ఘోర అవమాన పరాభవ భంగపాట్లు స్వయంకృతం చేసుకొన్నప్పుడైనా, కనీసం మనుషులుగా అయినా ఆత్మపరిశీలన చేసుకోవాలి.  …..చాకిరేవు.

ప్రకటనలు

1 Response to “మరో టంగుటూరి ప్రకాశం పంతులులా ఈ మహేష్”


  1. 1 Anon 6:09 సా. వద్ద జూలై 5, 2018

    అన్నగారి మీద చెప్పులు వేసినవారి ముచ్చట చెప్పు బయ్యా.

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

  • జగన్ ప్రమాదకారి అని తన సాక్షిలో తెలియక పోవచ్చు, తెలుసుకొనే స్వేచ్చను తనను నమ్మిన శ్రేయోభిలాషులకు కూడా ఇవ్వలేదు. chaakirevu.wordpress.com/2019/02/14/%e0… 1 day ago

వీక్షణలు

  • 884,613

తడి ఆరని ఉతుకులు

జూలై 2018
సో మం బు గు శు
« జూన్   ఆగ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: