జూలై 3rd, 2018ను భద్రపఱచు

వైకాపా & జనసేన నకిలీ పేడ – తెలుగుదేశంకు ఎరువుగా

వైకాపా & జనసేన నకిలీ పేడ – తెలుగుదేశంకు ఎరువుగా

బాబు గారి పాలనపై పేడ వెయ్యాలని
సోషల్ మీడియాలో వికృత నకిలీలతో
విజృంభిస్తున్న వైరి పక్షాలు

ఎవరికి నష్టం?
ఎవరికి లాభం?

ఓ విశ్లేషణ

ఎక్కడో ఇండోనేషియాలో రోడ్డు మీద
నాట్లు వేసే బొమ్మ తీసుకువచ్చి

బాబు గారు వేసిన సింగపూర్ రోడ్లలో
నాట్లు వేస్తున్నారని

ఎక్కడో ఉత్తరాది రాష్ట్రాలలో

పిల్లలు బురదలో వెళుతున్న
బొమ్మలు తీసుకొచ్చి

మన పల్లెల్లో బురదని

ఇలా

జనసేన నుండి వైకాపా వరకు
పోటా పోటీగా నకిలీ బొమ్మలు తెచ్చి
సోషల్ మీడియాలో

ప్రభుత్వం మీద పేడ వేస్తున్నారు

గతంలో సినిమాల పోస్టర్ల మీద
ఒక హీరో అభిమానులు
మరో హీరో పోస్టరు మీద
వేసే పేడ లాంటిదే

ఇందువల్లా ఏమి ఉపయోగం వుండేది కాదు
సత్తా వున్న సినిమాలు ఆడేవి

ఇక సోషల్ మీడియాలో
నకిలీలు మార్ఫింగ్ లతో
బురిడీ కొట్టిస్తే ఎంతవరకు ఫలితాలు ఇస్తాయి? చూద్దాం…

నకిలీలు చేసే వారు మరచిపోతున్నది
పాలక పార్టీ శక్తిని
పాలక పార్టీ ఐటి అభిమానులను
వారి టెక్నాలజీని

ఓ చిత్రాన్ని కాపీ చేసి తీసుకువస్తే
ఎక్కడ నుండి తెచ్చారో క్షణాల్లో కనిపెట్టవచ్చు
అది మరెక్కడెక్కడ వుందో కూడా కనుక్కోవచ్చు

నకిలీలు ఈ విషయం మరిచిపోతున్నారు

గతంలో బిజెపికి పనిచేసిన ప్రశాంత్ కిషోర్
వైకాపాకు వచ్చిన కొత్తలో
వాడిన రోబో / డమ్మీ సోషల్ మీడియా అకౌంట్లనే
పాలక పార్టీ అభిమానులు
బయటపెట్టి ఖంగుతినిపించారు
నీళ్లు నమిలేలా చేసారు

ఇప్పుడు నకిలీ చిత్రాలు తీసుకువచ్చి
ఇలా పెట్టే సరికి
అలా ఎక్కడి నుండి తెచ్చారో
పాలక పార్టీ అభిమానులు
వెంటనే ఆ పోస్ట్ లను స్క్రీన్ షాట్లతో సహా
పెట్టి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు

అదేమవుతోంది అంటే

వైకాపా & జనసేనను నమ్మి
ఇతరులకు పంపిన వారు
వెఱ్రిమాలోకాలు అవుతున్నారు

చూసి వారు కూడా
వెఱ్రిమాలోకాలు అవుతున్నారు

ఓ సారి రెండు సార్లు అంటే పర్లేదు
ప్రతి సారి అంటే

సోషల్ మీడియా వాడే ప్రతివారి
దృష్టిలో వెఱ్రిమాలోకాలు అవుతున్నారు

అంటే ఇక వీరు నిజమైనవి పెట్టినా
నమ్మే వారు లేకుండా తయారు చేసుకొంటున్నారు

అంటే ఏమవుతోంది వీరు వేసిన పేడ
కుళ్లిపోయి
పాలక పార్టీకి ఎరువుగా మారుతోంది

ఇక ప్రజల దృష్టి
కీలకమైన పోలవరం, అమరావతి మరియు పెట్టుబడుల మీద వుంటుంది

అందులో ఈ నకిలీలు ఏమీ చెయ్యలేరు

మిగిలిన రోడ్లు, నీటి ప్రాజెక్టులు & లైట్లు
గట్రా మనకు స్థానికంగా వచ్చాయా లేదా చూసుకొంటారు

అంటే శ్రీకాకులంలో తమ ఇంటి ముందు సంక్రాంతి అప్పుడు
సిమెంటు రోడ్డుమీద అందమైన ముగ్గు వేసి పెట్టిన
గొబ్బెమ్మ ను చూసి మురిసిపోయినవారికి
అదే గుర్తుండిపోతుంది

ఎక్కడో చిత్తూరు పల్లెలో బురద వుంది అని పెట్టిన
రోడ్డు తాలూకూ నకిలీ చిత్రాలు
శ్రీకాకులం వారు చూస్తే వెంట్రుక లా భావిస్తూ
చిత్తూరు లో రోడ్డును వేసుకొనే స్థానిక నాయకుడు లేదనుకొంటారు
చంద్రబాబును చెడ్డగా అనుకోరు

ఇటు చిత్తూరు లో ఆ బురద వున్న రోడ్డే వుండదు

ఎటు తిరిగి పేడ వేసిన వారి చేతికి
ఆ కంపు మిగుల్తుంది

మర్చిపోయిన అందమయిన రోడ్ల గురించి మరో సారి
ఈ నకిలీలు గుర్తు చేస్తున్నారు

అంటే ఆ పేడ ఎరువుగా మారి
పాలక పార్టీకి ఉపయోగపడుతోంది అన్నమాట.

ఇక సామాన్యుడు ఫించను వచ్చిందా
బియ్యం తెచ్చుకొంటున్నామా
లైటు వెలుగుతోందా
గట్రా గట్రా చూసుకొంటారు

అరవై ఏళ్లకు పైగా వున్న వారికి
కొంత జాగ్రత్త కూడా ఎక్కువ
తన వేలి ముద్ర కనుపాపలు లేకుండా
తన ఫించనూ ఎక్కడికీ పోదు అనేది
వారికి ఎక్కువ ధీమాను ఇస్తుంది

వారి అనుభవం తో
దొంగ ఎవరు అసలు ఎవరివల్లా అది అవుతుంది
గట్రా గట్రా విశ్లేషణలు నెరిసిన తమ తలలకు
పదును పెట్టి బురిడీ కొట్టించేవాళ్లను చూసి
నవ్వుకొంటూ వుంటారు

ఇక్కడా నకిలీలు ఏమీ చెయ్యలేవు

నకిలీలను ఆపరేట్ చేసున్న వారు
మర్చిపోతున్నది తాము చంద్రబాబు కంటే
గొప్పవాళ్లం కాకపోయినా
కనీసం ఆ స్థాయిలో చేయగలం అని
చెప్పుకోవాలి
మనుషులను తిప్పుకోగలగాలి

ఆ విషయం అసలు పట్టించుకోకుండా
చంద్రబాబు కూడా మా లాంటి బాపతే అని
ఎంత బాదుకొన్నా

ప్రయోజనం శూన్యం.

మరింత చులకన అవ్వడం తోపాటు
ఎదుటివారి దృష్టిలో ఏదో ఉన్మాద లక్షణాలు కూడా
వున్నట్టున్నాయని
వారు మొహం మీద చెప్పలేక మౌనంగా వున్నా
మనసులో అసహ్యం పెంచుకొంటూ వున్నా
అర్థం చేసుకోకుండా
అదేపనిగా అదేపనిని మళ్లీ మళ్లీ చేసి వెగటు పుట్టిస్తూ
పాలక పార్టీకి సానుభూతి కూడా తెస్తున్నారు. ….చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

  • జగన్ ప్రమాదకారి అని తన సాక్షిలో తెలియక పోవచ్చు, తెలుసుకొనే స్వేచ్చను తనను నమ్మిన శ్రేయోభిలాషులకు కూడా ఇవ్వలేదు. chaakirevu.wordpress.com/2019/02/14/%e0… 1 day ago

వీక్షణలు

  • 884,614

తడి ఆరని ఉతుకులు

జూలై 2018
సో మం బు గు శు
« జూన్   ఆగ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: