జూన్ 29th, 2018ను భద్రపఱచు



కడప చరిత్రలో కొత్త అధ్యాయం

కడప చరిత్రలో కొత్త అధ్యాయం

కడప కోసం
పస్తులున్న మనుషుల చరిత్ర
ఆ కడపకు పరిచయం లేదు

ఈ కాలంలో దీక్షలంటే బరువు తగ్గించుకొనేవని
స్వపక్షంలో కూడా భావిస్తున్నా

పదో రోజు అయినా
పట్టు సడలించడం లేదు

ఆ దీక్ష జరుగుతున్నది
డేగ కళ్లతో పరిశీలించే
ప్రతి పక్షనాయకుడైన
జగన్ కడపలో

ఏ మాత్రం అటూ ఇటూ అయినా
ఈ పాటికి గగ్గోలు పెట్టేవారు

అక్కడ నిజాయితీగా జరుగుతోంది అని
అందరికీ అర్థం అయ్యింది

ఆ ఉక్కు సంకల్పం
ప్రజల్లో ఉద్వేగాన్ని రగుల్చుతోంది
ఉదాసీన కేంద్రం పై ఉక్రోషాన్ని పెంచుతోంది

కడప మీద మహానేత కుటుంబం పడగతో
దశాబ్దాల ఫ్యాక్షన్ ఘత చరిత్ర

వీలైతే బుసలుకొట్టాలనే ఉబలాటంతో
ఆ కుటుంబం వున్నా…..

గడ్డం పెంచి పంతం పట్టి
సతీష్ రెడ్డి సిఎం తో
ప్రవహింపజేసిన నీటితో

కాలంతో పాటు
రాష్ట్రం తో పాటు
ఎంతో మార్పు

బంద్ పిలుపులతో
రైళ్లు తగలబెట్టి హింసాకాండతో
కాకుండా

శాంతి యుతంగా
కడప నేల మీద
కడుపు పస్తులు పెట్టుకొని
పది రోజులుగా
సి ఎం రమేష్
జనం మధ్య చేస్తున్న

దీక్ష

జాతీయ స్థాయిలో
కడప గురించి చర్చ
మొదలయ్యేలా చేస్తోంది

జెడి లక్ష్మీ నారాయణ నుండి
పొరుగు రాష్ట్రాల పార్టీ నాయకుల వరకు

ఒక్కొక్కరి సంఘీభావం
ఆ దేవుడి కడపకు పెరుగుతోంది

కడప కోసం ఈ రాష్ట్రం అంతా
ఓ తాటి మీద వచ్చింది

కేంద్రంతో తాడో పేడో తేల్చుకొని
మన కడపకు ఏదన్నా చేస్తే
బావుంటుంది అనే భావనకు
రాష్ట్రం యావత్తూ వచ్చింది

కడప ప్రజల ఉక్కు సంకల్పానికి జేజేలు

జై కడప జై జై కడప
కడప ఉక్కు – మన హక్కు. ….చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 900,539

తడి ఆరని ఉతుకులు

జూన్ 2018
సో మం బు గు శు
« మే   జూలై »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: