పండరిపురం ఎక్కడ? కడప పురం ఎక్కడ?

పండరిపురం ఎక్కడ? కడప పురం ఎక్కడ?

విఠలా విఠలా
పాండురంగ విఠలా అని

ఆయన వెలసిన
మహరాష్ట్రలోని పండరీపురంలో కంటే
ఎక్కువగా

దేవుని కడపలో
నాయరాయణ దాసు కంఠంలో
భజనల రూపంలో వినిపిస్తే
ఆయనను గురువుగా భావిస్తూ
తెలుగు నేలంతా
ఆ పండరి భజనల భక్తిలో
తడిసిముద్దయ్యింది

ఎక్కడి కడప?
ఎక్కడి పండరిపురం?

కుండలు చేయు కుమ్మరి కులమున
పుట్టిన మొల్ల
కవయిత్రిగా
తెలుగు రామయాణాన్ని
అదే కడపలో వ్రాసింది

ఎక్కడి కడప?
ఎక్కడి అయోధ్య?

ప్రపంచంలో నేను తెలుగువాడు అని
చెప్పుకొనేవాడు ఎవడైనా
చివరికి పామరుడైనా
ఆయన పద్యం రానివారు వుండరు

ఎక్కడి కడప?
తెలుగు జాతి ఆ వేమన పద్యాలతో
ఎందుకు పులకిస్తోంది?

కర్ణాటకా సంగీత ఝరితో
తెలుగు జాతి తొలి పాటై
కొండలలో కోనేటి రాయుడి దగ్గర
ప్రతిధ్వనించే సంకీర్తన
ప్రపంచమంతా పాడుకొనే
అన్నమయ్య అమ్మా అన్న నేల

ఎక్కడి కడప?
అన్ని వేల కీర్తనలు వ్రాసే
భక్తిని ఆ నేల ఎలా అందించింది?

పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి
స్వాసించి గడ్డ

ప్రపంచానికే కాలజ్ఞానం చెప్పిన కడప

మన దేవుని కడప

ఈ రోజు ఉక్కు కర్మాగారానికి
అకుంఠిత దీక్షతో చేస్తున్న ప్రయత్నానికి

మన సంఘీభావం ప్రకటిద్దాం

రాష్ట్రంలో జరిగే
ప్రతి శుభానికి తగ్గట్టు
మన దేవుని కడపని కూడా అందంగా
అభివృద్ధితో అలరారేలా సిద్ధం అయ్యేప్పుడు
మనమూ చేదోడు వాదోడుగా వుందాం. …..చాకిరేవు.

ప్రకటనలు

2 Responses to “పండరిపురం ఎక్కడ? కడప పురం ఎక్కడ?”


  1. 1 Anon 4:17 సా. వద్ద జూన్ 29, 2018

    Fasting is good for health. Extra fat can be burnt

    మెచ్చుకోండి

  2. 2 Anon 5:10 సా. వద్ద జూన్ 30, 2018

    చింతకాయల దీక్ష నిమ్మకాయల్తో విరమణ. ఉక్కు కోసం కాదు లుక్కు కోసం చేసిన పుచ్చకాయ దీక్ష.

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • ఓ ఉత్తరాంధ్రా అబ్బాయి ఎర్రం నాయుడి అబ్బాయి ఇటీవలే ఓ ఇంటివాడైన అబ్బాయి పార్లమెంటులో ఎలా మాట్టాడాడో ఓ వంద సార్లు… twitter.com/i/web/status/1… 2 days ago

వీక్షణలు

  • 837,707

తడి ఆరని ఉతుకులు

జూన్ 2018
సో మం బు గు శు
« మే   జూలై »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: