పాత నాన్న ప్రేమ పూర్వక పలకరింపులతో పోల్చుకొంటూ ఆ పసి హృదయాలు

పాత నాన్న ప్రేమ పూర్వక పలకరింపులతో పోల్చుకొంటూ ఆ పసి హృదయాలు

కన్నవారు విడిపోయి
విడివిడిగా
చెరొకరిని చేసుకొంటే

పనిమనుషులు
మందీ మార్బలం
సంపద వున్నా

ఆ పసి హృదయాలు

అమ్మ దగ్గర వుంటే
పాత నాన్నను తలచుకొంటూ
కొత్త నాన్న దగ్గర బెరుగ్గా

నాన్న దగ్గరకు చుట్టంగా వెళితే
కొత్త నాన్న పలకరింపులను
పాత నాన్న ప్రేమ పూర్వక పలకరింపులతో పోల్చుకొంటూ
అక్కడున్న మరో అమ్మకేసి బెరుగ్గా చూస్తూ

కన్న వారి పెళ్లివయసు
తమకొచ్చే వరకు
ఆ వయసు కోరికలు అర్థం అయ్యే వరకు
పిల్లలు ఆ కల్లోలాలను భరిస్తూ
మానసిక సంఘర్షణ అనుభవించాల్సిందే

సహనం లేని కన్నవారి తప్పుకు
శిక్ష పసి హృదయాలకే

మొగుడు మాజీ అయితే
అందులోనూ మరొక్కరికి మొగుడు అయితే

తన జీవితాంతం
తను మరొక్కరికి పెళ్లాం కాకుండా
పాత మొగుడి మీద ప్రేమను
నిరూపించుకోవాల్సిన అవసరం లేదు

పాత పెళ్లాం కొత్త మొగుడిని వెతుక్కొంటే
శుభాకాంక్షలంటూ
సోషల్ మీడియా లో
బహిరంగంగా చెప్పి
మాజీ మొగుడు
తన మంచితనాన్ని లోకానికి చాటినా

రాజీ పడని మాజీల మధ్య
ముడిపడిన పసిహృదయాల
సంఘర్షణలో

ఇద్దరూ పరాజితులే

జీవితాంతం కలిసి వుంటామనే
నమ్మకం వచ్చే వరకు
పిల్లలకొసం తమకంతో తపించకండి

పద్దతులు చట్టబద్దం కావొచ్చు
భారత సమాజం ఇంకా ప్రాశ్చాత్యమయం అవ్వలేదు
అలవాటుపడని సమాజం
పసివాళ్లను సానుభూతిగా చూస్తూనే వుంటుంది

సెలెబ్రిటీలు అయితే సోషల్ మీడియాలోకెక్కి
అభిమానుల చర్చలలో జీవితాలను
రచ్చ చేసుకొని
గాయపడి బాధపడకండి

అభిమానులకు అవగాహన వుండాలనే నిబంధనలేదు
పిచ్చితో సోషల్ మీడియాలో రక్కేయడమే తెలుసు వాళ్లకు. ….చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “పాత నాన్న ప్రేమ పూర్వక పలకరింపులతో పోల్చుకొంటూ ఆ పసి హృదయాలు”  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

  • జగన్ ప్రమాదకారి అని తన సాక్షిలో తెలియక పోవచ్చు, తెలుసుకొనే స్వేచ్చను తనను నమ్మిన శ్రేయోభిలాషులకు కూడా ఇవ్వలేదు. chaakirevu.wordpress.com/2019/02/14/%e0… 1 day ago

వీక్షణలు

  • 884,614

తడి ఆరని ఉతుకులు

జూన్ 2018
సో మం బు గు శు
« మే   జూలై »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: