జూన్ 14th, 2018ను భద్రపఱచు

కడప కదిలితే ఆపగలిగే వారు ఎవరూ లేరు

కడప కదిలితే ఆపగలిగే వారు ఎవరూ లేరు

అదివో అల్లదివో అని పాడిన
మహనీయ వాగ్గేయకారుడు
అన్నమయ్యను శ్రీవారికి అందించినది
దేవుని కడప

అదిగో ఇదిగో
ఉక్కు కర్మాగారం అంటూ
ఇప్పుడు అక్కడ కేంద్రం కుదరదంది

కడప నారాణదాసు గారు
గొప్ప పండరి నాధుడి భక్తుడు
ఆయన భజనలు
రాయలసీమ అంతా
ధ్వనిస్తోంటోంది ఇప్పటికీ

కాని ఆ నేలలో
మనుషులను కడతేర్చైనా
మనం ఎదగాలనుకొనే
వైఎస్ కుటుంబం వల్లా

చదువుకొన్నా అక్కడే
ఉద్యోగం చేసుకొనే పరిశ్రమలు లేవు
వున్న రాజంపేట ఆల్విన్ పరిశ్రమనూ
మూసేసారు

ఏ రోజూ
ఆ ఊసే పట్టని
వై ఎస్ కుటుంబంలో

వారసుడు జగన్
కేంద్ర పెద్దల పాదసేవా భజనలో
ప్రతిపక్ష నేతగా రాష్ట్రం కోసమే కాదు
కడప కోసమూ కూడా
నోరు మెదపడం రాదు
ఎప్పుడూ నాలుక నరం తెంపుకొనేది
బాబు గారి మీదే

కనీసం కడప ఉక్కుకోసం కూడా
కనీస ఉక్రోసం కేంద్రం మీద చూపలేదు
చూపలేదు కూడా

తన బతుకు
తన సంపాదన అంతే

దశాబ్దాలు ఆ కుటుంబాన్ని
ఆదరించిన ఆ కడప
ఏమయిపోయినా
ఏమీ పట్టదు

ప్రత్యక్షంగా వేలల్లో
పరోక్షంగా కలిపి
లక్షా ఏభై వేల వరకు
ఉద్యోగాలు వచ్చి వుండేది
ఉక్కు పరిశ్రమ వచ్చి వుంటే

తన కేసుల భయంతో
కాళ్లు పట్టుకొనే సరికి
కేంద్రం కేవలంగా చూస్తోంది

కడపలో చదువుకొన్న వారిలోనే కాదు
సామాన్య జనంలో
నా కళ్లతో చాలా రాజాకీయ మార్పులు చూసా

సుమో లో ఎక్కండ్రా అనే
వైఎస్ రాజా రెడ్డి రోజులు పోయాయి

ఆలోచన వివేకం
అసహ్యంగా చూస్తోంది
ఆ అరాచక రాజకీయాన్ని

వచ్చే నీటితో రక్తపుటేరులను కడిగి

ఏడాదిలో అది మార్పు దిశగా సాగి
మనకోసం అని కడప కదిలితే

ఆపగలిగే వారు ఎవరూ లేరు
అభివృద్ధి చెంది
దేవుని గడపగా మారితే
ఇప్పటికే సచ్చిన ఫ్యాక్షన్ పాము కూడా
ఎప్పటికీ లేచి బుసకొట్టలేందు

పొరుగు అనంతపురం
ఆ ఆలోచన ఇస్తోంది. ….చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 900,539

తడి ఆరని ఉతుకులు

జూన్ 2018
సో మం బు గు శు
« మే   జూలై »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: