ఏం చేస్తున్నావు?

ఏం చేస్తున్నావు?

డిగ్రీ పట్టా వచ్చీ రాగానే
ప్రతి వారూ అడిగే ప్రశ్న

మనకన్నా ముందు ఉద్యోగాల్లో చేరిన కొందరితో
ఇంటా బయటా పోల్చి పోల్చి
కాల్చుకు తింటారు

క్యాంపస్ లో రాలేదంటే
అనుభవం అడుగుతారు

అనుభవం అడగకుండా వచ్చే
ఒకటీ అరా ఉద్యోగానికి
వందలమందితో పోటీ పడాలి

మన బలహీనత మనకే తెలుసు
ఇంగ్లీషులో ప్రావీణ్యం కావొచ్చు
కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలు కావొచ్చు
దానిని అధిగమించడానికి

అంతవరకు డిగ్రీలకు ఖర్చు పెట్టిన ఇంట్లో
అడగాలంటే మనసుకు కష్టం
మళ్లీ మళ్లీ అడగాలి అంటే
మానసిక సంఘర్షణ

ఇంట్లో అర్థం చేసుకొని ఇస్తే పర్లేదు
చేసే స్నేహాలవల్లానో
వయసు ప్రభావ బలహీనతలతోనో అయితే
మహా నరకం

నిత్యావసరాలైన
ఫోను రీచార్జీల డాటా నుండి
ఇంటర్వ్యూలకు ఫార్మల్ డ్రెస్స్ మరియు షూ వరకు
ఎన్నో ఖర్చులు

చిన్న చిన్న ఖర్చులకు
డబ్బొచ్చే చిన్న చిన్న పనులు చేస్తే
ఇంట్లో నుండి సమాజం వరకు
చిన్న చూపు చూస్తుందేమో
మరింత సూటిపోటి మాటలు
అంటుందేమో అనే బాధ

కన్నవారు కూడా సమాజం నుండి
ఎదుర్కొనే పోలికలతో
ఎదిగిన యువతను తిట్టలేక
నలిగిపోతుంటారు

నావాడూ ఎదుగుతాడు
స్థిరపడతాడనే ఆశలతో సహిస్తుంటారు

ఈ నిరుద్యోగ సంఘర్షణలో
కులం కాపాడదు మరింత కుల్లబొడుస్తుంది

సినిమా వినోదం గంటలే
జోలపుచ్చుతుంది

నిరుద్యోగి అనే పేరు చెరుపుకొనే వరకు
నరకమే

ప్రభుత్వం ఇచ్చే నిరుద్యోగ భృతి వరమే

కలలను పండించుకొనే మార్గానికి వాడుకొంటే
కన్న వారి నమ్మకాన్ని నిలబెట్టుకొంటే గర్వమే. …..చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “ఏం చేస్తున్నావు?”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 832,170

తడి ఆరని ఉతుకులు

జూన్ 2018
సో మం బు గు శు
« మే    
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: