జూన్ 4th, 2018ను భద్రపఱచు

పవన్ కళ్యాన్ గారూ… ముంచనంతవరకు పగటికలల విహారం మంచిదే

పవన్ కళ్యాన్ గారూ… ముంచనంతవరకు పగటికలల విహారం మంచిదే

మనసులోని పగటికలలతో, భవిష్యత్తును ఉన్నతంగా, అందనంత ఎత్తుగా ఊహించుకోవచ్చు. కాణీ ఖర్చు లేకుండా సాహసోపేతంగానూ ఊహించుకోవచ్చు. ఎటువంటి రిస్క్ లేకుండా, ఊహలకు పట్టపగ్గాలు లేకుండా, ఏ స్థాయికైనా ప్రయత్నించవచ్చు.

ఆ క్రమంలో మనలోని సృజనాత్మకత బయటపడవచ్చు. దానితో అద్భుతాలు సృష్టించవచ్చు. కాని మనం దానిమీద దృష్టి పెట్టి కష్టపడితేనే సాధ్యమే.

ప్రస్తుత పనిని వదిలిపెట్టి, మెదడులో పుట్టే ప్రతి ఆలోచన వెంటా పరిగెట్టి అలసిపోతే కష్టం. అదే అలవాటుగా మారితే, సాధారణ పనులకు ఆటంకం ఏర్పడుతుంది, ఇతరులతో సంబంధాలు దెబ్బతింటాయి.

ప్రస్తుతం మీద అజమాయిషీ కోల్పోతాము. మన చేతులనుండి ప్రస్తుతాన్ని జారవిడుచుకొంటాం.

ఆదాయం, కీర్తి ఏదైనా మన కష్టంతో వస్తుంది. ఇతరులకు ఉపయోగపడేవరకే అవి మనకు వస్తాయి. బురిడీ కొట్టిస్తేనో, మానసిక స్థాయి లేని వారిని మెప్పించో మొత్తం సమాజాన్ని ప్రభావితం చేయలేము.

మనమంటే బలహీనత వున్న వారినే, పెట్టుబడిగా పెట్టి, మంచిని ధ్వంసం చేసి, ఆదాయం ఆర్జించొచ్చనే తెలివి తేటలకు సమాజం మొత్తం తలొగ్గదు. ఎందుకంటే వారికీ బతుకు, కుటుంబం వుంటుంది. సినిమా కాదు, రెండున్నర గంటల వినోదంగా భావించుకోడానికి, భవిష్యత్తు.

మనకున్న ఓవరేక్టివ్ ఇమేజినేషన్ జబ్బుకు చికిత్స తీసుకోకుండా, జనంలోకి వెళ్లి, జనం ఎన్నుకొన్న వారిని తిరగనియ్యను తలచుకొంటే అని పిచ్చి తలపులు ఆ కోవలేవే. నేను ఫలానా వారిని గెలవనియ్యను, కాలడ్డం పెట్టే సామర్థ్యం నాకుంది అనే స్థాయి ఊహలు, జనంలోకి వెళ్లినప్పుడు బయటకి చెప్పుకోవడం, వ్యక్తిగతంగా కూడా ప్రమాదకరంగా పరిణమించవచ్చు.

బట్టలిప్పిన అమ్మాయితో బూతులు తిట్టించుకొని, అమ్మా, అన్న బామ్మరిది గట్రా మొత్తంతో వెళ్లి, లాయర్ల సమావేశం పెట్టుకొంది ఆ కోవలోనే. మనకు సంబంధంలేని విష్యాలలో మన ఆలోచనా స్థాయి అంచనా వేసుకోలేక, తగుదునమ్మా అని వెళ్లిన ఓవేరేక్టివ్ ఇమేజినేషన్ పరిణామమే అది.

వెనుకబడిన ఉత్తరాంధ్రాకు ఏమి ఊడిగం చేసాం, ఏమి చెయ్యగలమో చెప్పవచ్చు. మిగిలిన ప్రాంతాలతో పోల్చి ఉద్యమాలు వచ్చేస్తాయి అని పోయే ఊహలకు హద్దు వుండాలి. అమరావతిలో ఏ ఏ కులాలు వున్నాయో తెలుసుకోకుండా, తను భూమి పూజ చేసిన స్థలం ఎక్కడ వుందో జనానికి తెలియదనుకొని, అమరావతి గురించి ఊహలతో ఆడిపోసుకొంటే, ఆ స్థాయికన్నా తక్కువ ఆలోచనల వ్యక్తిత్వం వున్న వారు హర్షించవచ్చు, ప్రజలంతా కాదు.

సమాజ విచ్చిన్నం కాకుండా చాలా చట్టాలు వున్నాయి. మనుషులు కూడా తమ మానవ్త్వంతో అంటుకడుతున్నారు. తెర మీద నటనతో అలరించడం మాని, రాజకీయ పావై తెగ నరికే కసాయిగా మారకు.

దయచేసి మానసిక వైద్యుడిని సంప్రదించండి మీకు కలిగే నష్టం కన్నా, సమాజానికి ముప్పుగా పరిణమిస్తోంది, మీ అంటురోగం.  ….చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 900,539

తడి ఆరని ఉతుకులు

జూన్ 2018
సో మం బు గు శు
« మే   జూలై »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: