కార్పోరేషన్లు పెట్టాక ప్రభుత్వాన్ని కుల్లబొడుస్తున్నాయి

కార్పోరేషన్లు పెట్టాక ప్రభుత్వాన్ని కుల్లబొడుస్తున్నాయి

ఇంతకు ముందు
ఎన్నికల సమయంలో
మాకు సీట్లు ఇవ్వండి అని
కొన్ని కుల సంఘాలు డిమాండ్లు చేసేవి

అలా ఎన్నికయిన వారు
కులానికంతా ఎలా ఉపయోగపడతారో
అర్థం అయ్యేకొద్ది
అవి తగ్గాయి

కులాల వృత్తులు కూడు పెట్టడం లేదని
క్రమంగా చదువులమీద శ్రద్ధ పెట్టమని
వారసులను మళ్లించాయి చాలా కులాలు

పేరుకు అగ్ర వర్ణం
పేదరికం లో కూడా అగ్రస్థానంతో
ఆ చదువుల నుండి చాలా అగచాట్లే

కొన్నింటికి కార్పోరేషన్లు పెట్టి
సాయం చెయ్యడం మొదలయ్యింది

ఎక్కడ ప్రభుత్వం లో వున్న పార్టీకి
అనుకూలమైపోతాయో ఈ కులాలని

చాలా చాలా కొద్ది మందిని చేరదీసి
ఆ సంఘాల పేరుతో కుంపట్లను రగిలిస్తున్నారు

ప్రభుత్వాన్ని కుల్లబొడవడం మొదలయ్యింది

ఆ సాయం విలువ తెలిసీ
అలాంటి కార్పోరేషన్లు లేని
మరి కొన్ని అగ్రవర్ణాలు

ఈ కుల సంఘాలను
కొంత ఏహ్యభావంతో చూడ్డం మొదలయ్యింది

రాజకీయ కారణాలతో బహిరంగంగా చెప్పకపోయినా
సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు

లబ్దిదారులు ఖచ్చితంగా రుణం తీర్చుకోమని
ఎవరూ కోరుకోవడం లేదు

మొత్తం కులం అంతా అలా కుల్లబొడవడం లేదు

తిన్నింటి వాసాలు లెక్కబెడుతున్నారని
అందరినీ ఆ గాటన కట్టేలా వున్న ప్రవర్తన
ఆ కులాలకే చెడు చేయవచ్చు

తొలి తొలిగా చేసే వారికీ విసుగు వచ్చి
మొదటికే మోసం వస్తే నష్టపోయేది పేదవాడే
రాజకీయ పావు సంఘ ముసుగులు కాదు

కేంద్ర పాలక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా
తమ సామాజిక వర్గ సభ్యుడు అయితే కలిసిన
కుల ముద్ర గడ గడ గారు
ఆయన లాబీయింగ్ ద్వారా కేంద్రం లో
తమ రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టించి
ఆమోదించండి అని
ఎందుకు బహిరంగంగా కోరడం లేదు

రాష్ట్రాన్నే ఎందుకు విమర్శిస్తున్నారు
కులం మీద ప్రేమ ఇదా?
కులాన్ని రాజకీయ జీవితానికి వాడుకోవడం కాదా? ….చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “కార్పోరేషన్లు పెట్టాక ప్రభుత్వాన్ని కుల్లబొడుస్తున్నాయి”  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 860,177

తడి ఆరని ఉతుకులు

మే 2018
సో మం బు గు శు
« ఏప్రి   జూన్ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: