పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు

పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు

రైతులకోసం స్పందించినందుకు కృతజ్ఞతలు. ముద్ద అన్నం మనం చేతికి వచ్చేలా, రైతు కష్టపడుతున్నాడు కాబట్టి అన్నదాత అని పిలుస్తారు. బీడు చూస్తే తట్టుకోలేడు, నష్టం వస్తున్నా ఆ మట్టిలోనే బతకాలనే తాపత్రయం.

తన కష్టం మిగిలితే చాలని అనుకొంటాడు. అందుకే అన్నం తినేప్పుడు మెతుకు ప్రక్కన పడ్డా తీసి కంచంలో వేసుకొంటాడు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటూ.

చెమట జోకొడుతుంది, కష్టం నిద్రపుచ్చుతుంది.

యాచన తెలియని మనసు కాబట్టి ఎవరినీ సాయం ఆశించక వ్యవసాయం చేసి తృప్తి పొందుతాడు.

అందుకే ప్రభుత్వం చేస్తున్న వంతుల వారి రుణమాఫీ మీద, రైతు బాధపడ్డం లేదు. ఎందుకంటే, ఆ మాత్రం సాయం కూడా గత ఎన్నికల సమయంలో ఎవరూ చేస్తామని హామీ ఇవ్వలేదు.

అన్నదాత బిక్షం అడగడం లేదు, సాగు నీరు కావాలి అంటున్నాడు. ప్రకృతి కి కోపం వచ్చి నష్టపోతే ప్రభుత్వాలను పలకరించమంటున్నాడు. తన కష్టం మిగిలేలా ధర ఇచ్చి, తిని త్రేంచుకోమంటున్నాడు.

చేతిలో ఎంతుంది, సాగులో దేని దేని కి ఎంత ఖర్చు పెట్టాలి. అమ్మింది ఎంత? నష్టం ఎంత? లాభం ఎంత? లెక్కలు ప్రతి పంటకు వేసే రైతుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థం అవుతుంది. రెచ్చ గొట్టే మాటలు మాట్టాడితే తన రెక్కల కష్టం నమ్ముకొనే రైతు నవ్వుకొంటాడు. ప్రభుత్వం దగ్గర వున్న డబ్బు ఎంత, దానితో ఏమేమి చెయ్యవచ్చో, ఎందులో నిర్లక్ష్యంగా వున్నారో చెబితే వింటారు.

దానికన్నా ముఖ్యంగా ప్రస్తుతం మామిడి దిగుమతి తగ్గింది. పంట తక్కువ కాబట్టి, ధరైనా వస్తుంది అనుకొంటున్న రైతును మోసం చేస్తూ తగ్గిస్తున్నారు, వ్యాపారులు సిండికేట్ అవుతూ. ఇలాంటి సమస్యలు నోరున్న మీరు మాట్టాడితే ప్రజల వింటారు, ప్రభుత్వం ఆలోచిస్తుంది.

అది వదిలి చిచ్చుకోసం ప్రయత్నిస్తే నొచ్చుకొని, పవన్ కళ్యాణ్ కి కూడా పరిణితిలేదనుకొంటాడు. బిందెడు సాయం అని తీర్థం పోసారని ప్రభుత్వం గురించి చేసే విమర్శ బదులు. కంచం అన్నంలో అన్నదాత చుక్క విషం కలుపుకొంటున్నప్పుడు రుణమాఫీ ఆశ రేపి వుండొచ్చు కదా. ఆ ఆశ లక్షలాది అన్నదాతలను బతికించి వుండొచ్చు కదా. ఆలోచించే రాజకీయం హత్తుకొంటుంది, అన్నదాతను ఆలోచింపజేస్తుంది. విమర్శా రాజకీయలు వినీ వినీ విసిగిపోయిన రైతును దయచేసి విసిగించకండి.  …..చాకిరేవు.

ప్రకటనలు

1 Response to “పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు”


  1. 1 sai 2:21 సా. వద్ద జూలై 6, 2018

    pavan ki bane chepparu,.mari anubavam unna chandrbabu,prime minister mata ichina special status emaindi?nammakam to mimmalini gelipiste emi chesaru?matti neeru icharu…

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

  • జగన్ ప్రమాదకారి అని తన సాక్షిలో తెలియక పోవచ్చు, తెలుసుకొనే స్వేచ్చను తనను నమ్మిన శ్రేయోభిలాషులకు కూడా ఇవ్వలేదు. chaakirevu.wordpress.com/2019/02/14/%e0… 1 day ago

వీక్షణలు

  • 884,613

తడి ఆరని ఉతుకులు

మే 2018
సో మం బు గు శు
« ఏప్రి   జూన్ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: