రమణదీక్షితులు గారు,

రమణదీక్షితులు గారు,

మీకు కలియుగ వైకుంఠనాధుడైన వెంకటేశ్వర స్వామి అర్చకులుగా సేవలు చేసే అదృష్టం, ఎన్ని జన్మలో పుణ్యమో. మీ అర్థాంగితో మహద్వార ప్రవేశ నియమం వుంది. కాని మీతో పాటు మనవళ్లకు మరియు అబ్బాయిలకు లేదు. అయినా తీసుకు వెళ్లారు, ఏకంగా గర్భగుడిలోకి. మీ అబ్బాయిని సూర్య ప్రభ వాహనం పై ఎక్కించి, విధులు మీకు మీరే కేటాయించారు.

ఇన్ని వివాదాలు ఎందుకు స్వామి. బృగు మహర్షి అహంకార ప్రదర్శనా ఫలితంగానే కదా శ్రీవారు వెలసింది. అలాంటి శ్రీవారి పాలక మండలి నియమాలు, మీరు ఆచరించలేనివా. మీకే అతీతం అయితే, మిగిలిన మీకంటే ఎక్కువ అధికారం వున్న వారిని కట్టడి చేయడం అయ్యేపనేనా?

మీ అబ్బాయిలిద్దరినీ, తిరుపతిలో నియమించారని, ఏకంగా ప్రధాని & ముఖ్యమంత్రికే ఫిర్యాధులు చేసారు, గతంలో. మీరు ఆడమన్నట్టు, ప్రభుత్వాలు ఆడకపోతే, వున్నట్టుండి స్వామి వారి పవిత్రతకు & ఆగమాలకు ఆటంకాలు కలుగుతున్నాయని గుర్తుకు వచ్చిందా?

ఏం స్వామి, గతంలో ఏడుకొండలు కావు రెండు కొండలే అన్నప్పుడు మీరు తపస్సులో వున్నారా? పైన ఇతర మతాల చిహ్నాలు, ప్రచారాలు చేసినప్పుడు గాని, నాస్తికుడిని పాలకమండలిలో నియమించినప్పుడు గాని, మీరు రాష్ట్రపతికి, ప్రధానికి, సిబిఐ కి లేఖలు వ్రాసినట్టు, ఎవరికీ గుర్తు లేదే. ఆఖరికి నడిచి వచ్చే దారిలోని దుప్పులు కూడా ఇడుపులకు తరలిస్తామన్నప్పుడు, మీరు తల్లడిల్లినట్టు, ఎక్కడా చూడలేదు.

స్వామికి భక్తులకు మధ్య వారధి లాంటి వారు. మీరే వివాదాస్పదంగా మారి, రాజకీయ నాయకుల ఆటలో, మీ స్వార్థంతో, పావు గా మారి, ఆలయ పవిత్రత గురించి చర్చలకు తెరదీసి, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, బహిరంగంగా మీడియాకు ముడి సరుకు అవ్వడం విచారకరం. ….చాకిరేవు.

ప్రకటనలు

4 Responses to “రమణదీక్షితులు గారు,”


 1. 1 kinghari010 4:26 సా. వద్ద మే 16, 2018

  Mr. Babu,
  I cannot agree with your arguments in criticizing Raman deekshitulu.
  First thing you have to understood is:He is right in his each and every word! Do you want to propose that savannas should be replaced with Indian constitution?
  It is not correct to ask questions like “why don’t you ask then and why you ate silent at somebody did something” and referencing unrelated issues.
  Hindu temples must be independent in their maintenance. No govt. Should interfere in its day today affairs. Why govt took only Hindu temples into govt undertaking? Why churches and majors were not taken? Do you know why? Just for booties of the temples. So many intellectuals like me are trying to make temples autonomous and he is urging the same.
  DONT FEEL TOO MUCH SECULAR – YOU WILL BE SICKULAR! .

  మెచ్చుకోండి

 2. 2 Anon 3:02 ఉద. వద్ద మే 17, 2018

  అవును బయ్యా అనిత సుధాకర్ యాదవ్ ను నియమించింది పచ్చసోదరులే గదా. ఆ ముచ్చట చాలా కన్వేనియంట్ గా మరచిపోయావు.

  మెచ్చుకోండి

 3. 3 Anon 3:05 సా. వద్ద మే 18, 2018

  అవును బయ్యా. ఇవాళే ఒక వీడియో లో ఒక అర్చకుడు అడిగాడు. రమణ దీక్షితులు మనవడిని స్వామి దగ్గరికి తీసుకుపోతే తప్పా. అయితే బాబుగారు మోక్షజ్ఞను ఉగాది రోజు ఆస్థానంలో తీసుకురావచ్చా. ఏమి సమాధానం చెబుతారు బయ్యా. ప్రశ్నిస్తే చాలు పచ్చ పైశాచిజం చేస్తారు గదంట్రా. ఏమి అర్హత ఉందని లోకేశ్ బాబుకు ఎమ్మెల్సీ మంత్రి పదవి ఇచ్చారు చెప్పు పచ్చ సోదరా.

  మెచ్చుకోండి

 4. 4 అనామకం 11:30 సా. వద్ద మే 18, 2018

  స్వామి ప్రధాన పూజారిని రాజకీయనాయకులతో పోల్చుతున్నారా? ప్రధాన పూజారే ఆచారాలకు విరుద్దంగా ఇంతకాలం పనులు చేసి, తనకు నెప్పి కలగగానే ఇవ్వాళే మిన్ను విరిగి మీద పడ్డట్టు, నానా హడావుడి చేస్తుంటే ఆయన మీద సానుభూతి ఎందుకు?

  చాలా ఏళ్ళ నుండి స్వామి వారి సేవల విషయం లో ను, కొండ మీద తప్పుడు పనులు జరుగుతుంది నిజం. అందులో ఇప్పుడు యాగీ చేస్తున్న ఈ పెద్దమనిషి పాత్ర లేదా? ఆయన మీద సానుభూతి లేకుండా, ముందు కొండ ను, స్వామి కార్యాలను పవిత్రం గా ఉంచటం అనేది మన (హిందువుల) అందరి కర్తవ్యం. ఆ పవిత్ర యగ్నం లో భాగమే ఈ పూజారులను పీకేయటం అని నేను భావిస్తున్నాను. ఇక చచ్చిన దేవుడు ఏడుకొండలను, రెండు కొండలు చేయటానికి ప్రయత్నించినపుడు ఏమయ్యాడు ఈ పవిత్ర పూజారి. హైదరాబాదు వెళ్ళి మరి (అలా వెళ్లి దిగజారిన మొదటి ప్రధాన పూజారి) చచ్చిన దేముడిని కలసి వచ్చేవాడు స్పెషల్ గా. వీడా నీతులు చెప్పేది, దానికా బైబుల్ బ్యాచ్ వంతపాడుతూ సమర్ధిస్తూ కామెంట్ ఎట్టేది??

  హైందవం లో కాని, స్వామి పూజలలో కాని లోపాలు జరిగితే వాటి మీద ఉద్యమించాల్సిందే ప్రతి ఒక్కరము, అందులో అనుమానం లేదు, కాకపోతే ఇలాంటి పూజారి భాధ్యతలో ఉండి, స్వార్ధం కప్పేసి రాజకీయనాయకుల చేతిలో పావులు అయిన కొద్దిమంది మాటలు పట్టించుకోవలసిన పనిలేదు.

  వీళ్లు పోతే ఆగమ శాస్త్రాలు నియమాలతో పూజలు నిజాయితీ గా జరిపించే పూజారులకు కొండమీద లోటు లేదు. ఈయన కొడుకులకు క్రిద ఉద్యోగం వేస్తే, కొంపలు ఏమీ మిగిలి పోలేదు. మీకు తెలిసిన వారు కొండ మీద పూజారులు ఎవరయినా నిజాయితి పరులు ఉంటే, ఈయన గురించి అడగండి, ఇప్పుడు ఈయాన యాగీ చేస్తున్న విషయాలలో ఈయన పాత్ర ఎంతో వాళ్లే చెపుతారు.

  మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

 • జగన్ ప్రమాదకారి అని తన సాక్షిలో తెలియక పోవచ్చు, తెలుసుకొనే స్వేచ్చను తనను నమ్మిన శ్రేయోభిలాషులకు కూడా ఇవ్వలేదు. chaakirevu.wordpress.com/2019/02/14/%e0… 1 day ago

వీక్షణలు

 • 884,613

తడి ఆరని ఉతుకులు

మే 2018
సో మం బు గు శు
« ఏప్రి   జూన్ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: