వేరే దారి చూపించాక ముక్తకంఠంతో ఖండిద్దాం

వేరే దారి చూపించాక ముక్తకంఠంతో ఖండిద్దాం

అమిత్‌షా దగ్గర చీటీ రాయించుకు వస్తే
విభజన చట్ట అమలుపై
పార్లమెంటులో ప్రకటన చేస్తానన్నాడు
ఆర్థిక మంత్రి హోదాలో వున్న అరుణ్ జైట్లీ

చట్టం చేసింది పార్లమెంటు కదా
దాని అమలుకు అమిత్‌షా ఎవరు చీటీ ఇవ్వడానికి?

వాళ్ల పార్టీకి ఆల్ ఇండియా ప్రెసిడెంటు అయినంత మాత్రాన
ఇప్పుడు మనం గాని
భవిష్యత్తులో దేశంలో ఎవరైనా గాని
ఆయన ముందు బానిసల్లా నిలబడాలా?

ప్రజాస్వామ్యంలో వున్న మార్గం
చట్ట సభలు
అక్కడ చేసిన వాటికే దిక్కులేదని
అక్కడే దిక్కులు పిక్కటిల్లేలా
దేశం అంతా తెలిసేలా నిరశనలు తెలిపినా
పార్లమెంటునే మూసుకొని పోయారు

అంటే చట్ట సభల
ద్వారాలు మూసుకొన్నాయి

దాని పై మార్గం

న్యాయ వ్యవస్థ
సాక్షాత్తు సుప్రీం కోర్టులో కొలీజియం సిఫార్సుల నుంచి
రోస్టర్ చేస్తున్న విధానం వరకు రచ్చలు
ప్రధాన న్యాయమూర్తి పైన అభిశంసన కొట్టేయించారు
దాని మీద అక్కడికే వెళితే ఐదు మంది ధర్మాసనం అన్నారు
అదెవరు నిర్ణయించారు అంటే, చెప్పమన్నారు
అంటే సగటు మనిషికి వచ్చే అనుమానం
అభిశంసన ఎదుర్కొంటున్న వ్యక్తే అయ్యుండొచ్చు అనే కదా
అందుకే కదా ప్రధాన ప్రతిపక్షం ఆ కేసును వెనక్కు తీసుకొంది

వాళ్ల జడ్జీ చనిపోతే జాతీయ పార్టీ అధ్యక్షుడి మీద
అనుమానాలు వున్నాయి అంటేనే
మూసేసారు కేసును

వీళ్ల మీద అభియోగాలకు
అత్యున్నత ధర్యాప్తు సంస్థ
సిబిఐ తలుపు తట్టాలి అంటే భయం

అంటే ప్రజాస్వామ్య పార్లమెంటునుండి
న్యాయవ్యవస్థ ముందు కు
మన విభజన చట్టంతో వెళ్లినా

న్యాయం సాగదీయవచ్చు
ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు
అనే అనుమానాలు ప్రజాస్వామ్యంలో ప్రభలుతోంది

బిజెపి మీద వ్యతిరేఖ మీడియా సంస్థలు
అత్యాచారం నుండి చాలా కేసుల్లో వున్నారు
అధికార సంస్థల దాడులు జరిగాయి

ముందులా కుంభకోణాలు వెలికితీసి ప్రచురించే
స్వేచ్చ లేదు
రోజు వారి మతాలను కులాలను రెచ్చగొట్టే వాఖ్యలు
ప్రసారం చేసుకోవడం
దుమారం రేపి ప్రచారం కల్పించి
మరుసటి రోజు వక్రీకరించింది అనే ఖండనలు
ప్రసారం చేసే స్థాయికి దిగజారారు
లేదంటె చర్చలని అర్థం పర్థం లేని రచ్చలు

ఇక వేరే మార్గం

ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని దింపడమే
కాని ఆ పని చేసే లోపు
దాని బెదిరింపులు శృతిమించుతోంది

సాక్షాత్తూ తమ రాష్ట్ర పార్టీ
రాజ్యసభ స్థాయి సభ్యులతో
మీ రాష్ట్రం సంగతి చూస్తాం అనే
రోజు వారి బెదిరింపులు

ఇలాంటి పరిస్థితులలో

ఇలాంటి నిరసనలు తప్ప

ఏ మార్గం వుంది ప్రజలకు & పార్టీలకు

ఆ దారి కనిపించాక
ముక్త కంఠంతో ఖండిద్దాం

అమిత్ షా అధ్యక్షుడిగా పార్టీ బిజెపికి వున్న అదృష్టం
మరో మూడు అనుబంధ సంస్థలు
ఆర్ఎస్ఎస్, విహెచ్‌పి & భజరంగ్‌దల్

మన లౌకికవాద దేశంలో
ఏ మతాన్ని అయినా నేరుగా దూషించడానికి
పార్టీ బిజెపి ని కాకుండా విహెచ్‌పి వాడతారు

ఆహారపు అలవాట్ల నుండి సంస్కృతుల వరకు
బహిరంగ దాడులు చేయడానికి భజరంగదళ్

రాజకీయాలకు & అధికారానికి బిజెపి

దేశభక్తి ముసుగులో కొన్ని భావజాలాలు నూరిపోసి
వ్యూహాల అమలుచేయడానికి
ఈ అన్ని వ్యవస్థలను పర్యవేక్షించడానికి ఆర్ఎస్ఎస్

ఇలాంటి వ్యవస్థ దేశంలోని ఏ పార్టీకీ లేదు

అవి ఏ మాత్రం ఆవేశపడినా & శృతిమించినా
బిజెపి తన పవిత్రత చూపుతూ
రాజకీయ దాడి చేస్తుంది
ఎందుకంటే మట్టి అంటకుండా
తన అనుబంధ సంస్థలుకదా చేసేది

సహించలేని తెలుగువాడు
భరించలేని స్థితికి వచ్చాక
ఎదురు తిరిగాడు

మోసగించిన శ్రీవారి పాదం దగ్గరే

అధికారం లో వున్న బిజెపి పార్టీ
బాధ్యత గా మెలిగేవరకు
ప్రధాని బాధ్యతగా ప్రవర్తించేవరకు

సమాజంలో ఇలాంటి ప్రవర్తన ఆశ్చర్యం కలిగించదు
ఆవేదనతో చూడ్డం తప్ప ఏమీ చెయ్యలేము

గత ఎన్నికల వరకు దశాబ్దాలుగా బిజెపి అంటే
మంచి అభిప్రాయం వుండి
నేడు గతి తప్పిన దాని మీద జాలిపడుతూ . ….చాకిరేవు.

 

ప్రకటనలు

2 Responses to “వేరే దారి చూపించాక ముక్తకంఠంతో ఖండిద్దాం”


 1. 1 Haribabu Suraneni 8:23 ఉద. వద్ద మే 12, 2018

  గత ఎన్నికల వరకు దశాబ్దాలుగా బిజెపి అంటే
  మంచి అభిప్రాయం వుండి
  నేడు గతి తప్పిన దాని మీద జాలిపడుతూ
  ——
  యూరోపియన్ ప్రభువులకి తాము బతికుండగానే తమ సమాధుల మీద వ్యాఖ్యలు రాయించుకునే అలవాటు ఉంది.ఒక రాజుగారి ముందుకి ఒక దారుణమైన వ్యాఖ్య వచ్చింది:
  “ఒక్క మంచిఓని చెయ్యలెదు!
  ఒక్క చెడ్డమాట మాట్లాడలేదు!”
  ఆ రాజుగారు దాన్ని చాలా శ్రద్ధగా చదువుకుని “మొదటిది అధికారులు చెయ్యాల్సిన పని,రెండవది నేను చెయగలిగిన పని!” అని వూరుకున్న్నాడట.
  మీరు భాజపాకి రాసిన ఎలిజీ కూడా అంత గొప్పగా ఉంది!

  మెచ్చుకోండి

 2. 2 Anon 2:06 సా. వద్ద మే 12, 2018

  అవును బయ్యా. అమిత్ షా మీద పచ్చ పార్టీ కార్యకర్తలు భౌతికదాడి కూడా సమర్ధిస్తున్నావా? దుంపతెగ. అదే దాడి పచ్చనేతలపై జరిగితే
  గుండెలుబాదుకొని అఘాయిత్యం చేసేవాళ్ళు కాదూ.

  మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

 • 889,951

తడి ఆరని ఉతుకులు

మే 2018
సో మం బు గు శు
« ఏప్రి   జూన్ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: