ఏప్రిల్ 27th, 2018ను భద్రపఱచు

మోడీ గారికి,

మోడీ గారికి,

చైనా వెళ్లిన మీరు ఆ దేశ అధ్యక్షుడితో
“నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు,
త్రీ గోర్జెస్ డ్యాం నిర్మాణ వేగం, భారీతనం, ప్రయోజనాల గురించి విని
అధ్యయన యాత్ర చేయడానికి వచ్చి ఇక్కడ ఓ రోజు గడిపా” అని
ప్రశంసించడం, మీ పాతకాల మధురాల జ్ఞప్తికి తెచ్చుకోవడం అద్భుతం.

మీరు ప్రధాని అయ్యాక మొదలెట్టిన పోలవరానికి
ఆనాటి మీ చైనా అధ్యయన అనుభవం పంచి
అంతకంటే వేగంగా
స్వయంగా వచ్చి పర్వేక్షిస్తూ
నిర్మించి
మన దేశాన్ని మరియు చైనాను కూడా
విస్మయపరిచి వుండచ్చు

కాని మనం భారతీయత గురించి గర్విస్తూ
బయట గడిపి
వాటి అధ్బుతాలను పొగడ్డానికే పుట్టిన
శాపగ్రస్తుల్ల పాలకుల్లా ప్రవర్తిస్తూ

ఓ రోజు కూడా పోలవరం వైపు చూడక పోతిరి
పైగా దానికి మీరు విదిల్చే నిధులతో
ఈ జన్మలో అవ్వదని ముందస్తుగా పెట్టుకొన్న
వేల కోట్ల రూపాయలకు వడ్డీ కట్టుకొంటున్న
రాష్ట్రం పరిస్థితి గురించి ఆలోచించే తీరికాజేయకపోతిరి

కనీసం ఈ రోజైనా రాత్రి పడుకొనే ముందు
ప్రశంసించన ఆ దేశంలో అయినా కొంచం
పోలవరం ఎడల మీరు కావాలని చూస్తున్న చిన్న చూపుకు
కమిటీలు తనిఖీలతో తాత్సారం చేయిస్తున్నందుకు
మనసులో అయినా మీకు మీరు సమాధానం చెప్పుకొని గడిపి వస్తే
ఆంధ్ర రాష్ట్రం సంతోషిస్తాది. ….చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 851,240

తడి ఆరని ఉతుకులు

ఏప్రిల్ 2018
సో మం బు గు శు
« మార్చి   మే »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: