ఏప్రిల్ 25th, 2018ను భద్రపఱచు

తమ్ముడి కోసం అజ్ఞాతవాసం నుండి వచ్చిన అన్నయ్య

తమ్ముడి కోసం అజ్ఞాతవాసం నుండి వచ్చిన అన్నయ్య

సినిమాల్లో పేరు మార్చుకొంటే
దశ మారి మహర్దశ పడుతుందని
చాలా మంది మార్చుకొన్నోళ్లే

అలా శివశంకర ప్రసాద్ అనే అబ్బాయి కూడా
తెలుగు చిత్ర పరిశ్రమను చిరంజీవిగా అలరించాడు

అభిమానుల రక్తం కళ్ల తో సేవా కార్యక్రమాలు చాలా చేసి
ప్రజలకు అంతకన్నా ఎక్కువ చెయ్యాలని వచ్చి
ప్రజా రాజ్యాన్ని గాంధీ భవన్ లో కలిపేసాడు

అమాత్యుడిగా వెలగబెట్టి
రాజ్యసభ ఎంపి పదవి మొన్నటి వరకు వున్నా
మన తెలుగు ఎంపీలు నిరసనలు తెలిపుతున్నా

కొడుకు సినిమా ప్రమోషన్ ల కోసం అమెరికావాసానికి వెళ్లి
మళ్లీ కనిపించలేదు

ఆ గుర్తొచ్చింది…. పల్లెం గరిట సంగీత దర్శకుడి
దీక్షకు మద్దతుగా ఓ హోటల్ లో సమావేశం పెట్టి
మొహం చూపారు

తరువాత మన శాసన సభలో కాపుల కోసం
రిజర్వేషన్ కోరుతూ కమిటీ రిపోర్ట్ జత చేసి
కేంద్రానికి పంపినా

ఏ రోజూ తన కులం కోసం
అడగడానికి కాని విచారించడానికి కాని
డిల్లీ వెళ్లలేదు

ప్రధాని గారి కులం కూడా ఒకప్పుడు
అగ్రవర్ణ కుల జాబితాలో వుండేది

ఆయనను కలిసి
మీ కులాన్ని మా కాంగ్రెస్స్ ఎలా
ఇతర వెనుకబడిన జాబితాలో పెట్టిందో
అలా మా కులాన్ని పెట్టండి అని
ఓ సారి అయినా ఆయనను కలిసి అభ్యర్థించింది లేదు

ప్రధాని ఏమన్నా కేవలం ఎ2 విజయ సాయి రెడ్డినే కలుస్తా అనలేదు కదా

ఒకవేళ సమస్య వున్నా మోడీ కి పరిచయం వున్న తమ్ముడు పవన్ ద్వారా అయినా
ప్రయత్నించి విన్నవించి వుండవచ్చు

అయినా చిరంజీవి అజ్ఞాతవాసం వీడలేదు

తమ్ముడు అజ్ఞాతవాసితో అచ్చి రాని
ప్రజారాజ్యం పేరు మార్చి
జనసేన 1.0 గా పెట్టించి
బిజెపి సాయంగా పెట్టి చేయిస్తున్న రాజకీయలలో

ఎవరో బాధితురాలు బట్టలిప్పుకొని బాధపడుతుంటే
తమ్ముడు ఇచ్చిన ఉచిత సలహాలకు అనుచిత వాఖ్యలు
ఆ అమ్మాయి చేత అనిపించుకొని

కుటుంబ బాధను
ఏదో తెలుగు జాతి సమస్యగా
పరిశ్రమ సమస్యగా మార్చడానికి
అన్నా తమ్ముళ్లు బామ్మర్ది మొత్తం కుటుంబం అంతా వచ్చేసి

మీడియా సంస్థలను నిషేదించేయాలని
శాసించాలనుకోవడం నవ్వొస్తోంది

గతంలో దాసరి నాయకత్వంలో
ఈనాడు సంస్థకు ఇంటర్వ్యూలు ప్రకటనలు
సినీ పరిశ్రమ నుండి ఇలా నిలిపేస్తే

చిత్రం తో మొదలు వరుసగా మూడు సూపర్ హిట్
సినిమాలు నిర్మించి చూపాడు రామోజీ రావు గారు

ఆయన సినిమాల ప్రకటనలతో హోరెత్తించాడు
బేజారు పడింది చిత్ర పరిశ్రమే కాని
ఆయనను ఏమీ ప్రభావితం చేయలేక పోయారు
ఆ తరువాత ఆయనతో కలిసారు
ఫిల్మ్ స్టుడియోలో నిర్మాణాలు చేసుకొంటున్నారు

అరడజనుకు పైగా కుటుంబం అంతా వున్న సినీపరిశ్రమకు
మీడియా అండ అవసరం కాని
మీడియాకు వీళ్ల కుటుంబం అవసరం ఏముంటుంది
లోకంలో వార్తలకు కొదవా?

కుటుంబ స్వార్థం తగ్గించుకొంటే
పై మెట్టులో కులం కనిపిస్తుంది
దాని పైన ప్రజలు కనిపిస్తారు

మేమే హీరోలు
లోకం పాలకులుగా
నెత్తిన పెట్టుకొని పాలించాలి అంటే
కులమూ కలిసి రాదు
సమాజం కుళ్లబొడిచేస్తాది. …..చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 889,951

తడి ఆరని ఉతుకులు

ఏప్రిల్ 2018
సో మం బు గు శు
« మార్చి   మే »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: