పవన్ గారికి క్షమాపణలతో

పవన్ గారికి క్షమాపణలతో

హిందీలో శ్రీ రెడ్డి తిట్టిన తిట్టు అర్థం కాక వీడియో షేర్ చేసా, దాని అర్థం తెలుసుకొని తొలగించా. అలా వైకాపా రాజ్యసభ సభ్యుడి నుండి శ్రీ రెడ్డి వరకు ఎవరు మాట్లాడినా తప్పే, తెలుసుకోకుండా పోస్ట్ చేసినందుకు క్షమాపణలు.

కాని ఆ అమ్మాయికి మీరు కేసు పెట్టమనో లేదా కోర్టుకు పొమ్మనో సలహా ఇచ్చి వుండకూడదు. మీకు ఆ అర్హత లేదు. మీ వ్యక్తి గత జీవితంలో, మీ భార్యలు కాని మీరు కాని అలా కేసులు పెట్టుకోకుండా, కోర్టులకు వెళ్లకుండా తెగతెంపులు చేసుకొని ఒక అవగాహనకు వచ్చారు కదా. అలా మీ సినిమా పరిశ్రమ కూడా చర్చించుకొని పరిష్కారం చూడొచ్చు కదా.

ఒక శ్రీ రెడ్డి సమస్యే కాదు, చిన్న సినిమా ఏదో అక్రమ సంబంధానికి పుట్టినట్టు, విడుదలకు నోచుకోకుండా యూట్యూబు కు విసిరేస్తోంది చిత్ర పరిశ్రమ. మిధునం లాంటి ఆణిముత్యాలు అలా చెత్తకుప్పల్లో విసరబడ్డవే. చెత్త వారసుల చిత్రాల విడుదలకే పండగ రోజులు దొరుకుతున్నాయి. వెయ్యికి పైగా థియేటర్లలో వేస్తూ చిన్న వాటిని గొంతునులిమేస్తున్నారు.

ఇలాంటి చిత్ర పరిశ్రమ సమస్యల నుండి పారిపోయి వచ్చి ప్రజా నాయకుడిగా ప్రయత్నిస్తున్నావు. అందులో మొన్న అమరవాతి మీద మాట్లాడావు.

అన్నదాతల త్యాగంతో,
రాష్ట్ర లోని పల్లె పల్లె నుండి వచ్చిన పవిత్ర మట్టి జలాలతో,
ఒక అనుభవజ్ఞుడి నిరంతర శ్రమతో,
కలల అమరావతికి విదేశాలు సైతం సాయం చేస్తుంటే,
కక్ష గట్టి కోర్టుకెళ్లినవారినుండి కాపాడుకొంటూ,
కేంద్ర సాయం లేకున్నా
కడుతున్న అమరావతి మీద
అమాయకత్వం మరియు అవగాహన రాహిత్యంతో కాకుండా
కులతత్వాన్ని రెచ్చగొడుతూ
ప్రాంతీయతత్వన్నీ రెచ్చగొట్టేలా
నీ రొచ్చు ఆలోచనలతో
నోటితో చిచ్చుపెట్టాలని చూసావు.

ప్రజలు నీ అభిమానులు కాదు
అసహ్యించుకొంటున్నారు

అన్నా అన్న శ్రీ రెడ్డి కూడా
చెప్పు తీసుకొని తనను తాను కొట్టుకొంది

కొంచం ఆలోచించండి

నీవు పరిష్కరించలేని విషయాలలో
చేతకాని సమస్యలలో వేలు పెట్టి
సమాజ చీత్కారాలు పొందకు. …..చాకిరేవు.

ప్రకటనలు

3 Responses to “పవన్ గారికి క్షమాపణలతో”


 1. 1 Anon 3:36 సా. వద్ద ఏప్రిల్ 17, 2018

  వ్యక్తిత్వ హననం చేయడంలో పచ్చ మీడియాకు నోబుల్ బహుమతి ఇవ్వాలి. కులపిచ్చితో నిప్పులు పోసుకుంటున్నారు గదంట్రా.

  మెచ్చుకోండి

 2. 2 అనామకం 4:12 ఉద. వద్ద ఏప్రిల్ 21, 2018

  వాడెవడొ ఆమె తో, నేనే తిట్టించాను అని డైరెక్ట్ గా చెబితే, వెళ్ళి అలా తిట్టించినందుకు కేసు పెట్టకుండా, ఈ డ్రామాలు ఎందుకు? అందులోకి లోకెష్ దగ్గరనుండి, ABN వరకు లాగటం అదీ పెద్ద సీను క్రెయేట్ చేయడం ఎందుకు? తన లాయర్ల తో, సంప్రదించాలంటే సంప్రదించాలి కాని దానికి ఓ పబ్లిక్ మీటింగ్ పెట్టి హడావుడి చేయాలా? శాంతిభద్రతలకు భంగం కలిగించాలా? ఇంతకాలం ప్యాకేజి లు ఇచ్చినందుకు లోకెష్ గ్యాంగ్ కు, అనవసరం గా ఓ పిచ్చోడి కి ప్రచారం కల్పించినందుకు ABN లాంటి మీడియా వారికి బాగానే తిక్క కుదిరింది అనుకోండి.

  ఇక పైన అనామకుడా, పై పోస్ట్ లో నే నీకు కులపిచ్చి కనిపిస్తే, మీ జఫ్ఫా గ్యాంగ్ విషయం లో జనాలకు ఎంత కనిపించాలి?

  మెచ్చుకోండి

 3. 3 అనామకం 4:13 ఉద. వద్ద ఏప్రిల్ 21, 2018

  ఇక పైన అనామకుడా, పై పోస్ట్ లో నే నీకు కులపిచ్చి కనిపిస్తే, మీ జఫ్ఫా గ్యాంగ్ విషయం లో జనాలకు ఎంత కనిపించాలి?

  మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

 • ఆంధ్రాకి ఏమిస్తే అది మాగ్గావాలె అనండం తప్ప విభజన చట్టం చదివి తెలంగాణాకు ఏమి రావాలో కైపులో లేకుండా ఎప్పుడన్నా అడి… twitter.com/i/web/status/1… 14 hours ago

వీక్షణలు

 • 879,786

తడి ఆరని ఉతుకులు

ఏప్రిల్ 2018
సో మం బు గు శు
« మార్చి   మే »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: