ఏప్రిల్ 13th, 2018ను భద్రపఱచు

మోడీ గమ్యంలో తొగాడియాది గాలిశీను త్యాగమా?

మోడీ గమ్యంలో తొగాడియాది గాలిశీను త్యాగమా?

తలుగు తమ్ముళ్లు చంద్ర బాబు విషయంలో మోడీ తప్పుజేసాడని ఆర్ ఎస్ ఎస్ క్లాసు తీసుకొన్నట్టు సోషల్ మీడియాలో కథనాలు తిప్పుతుంటే నవ్వొచ్చింది. ఎందుకో చివర్లో చెబుతా…

మోడీ మరియు తొగాడియా జోడి ఒకే స్కూటర్ లో తిరిగేవారు 80 దశకం చివర్లో, గుజరాత్లో. 75 లో ఇలాంటి జోడీగా ఊరూరా మోటర్ బైక్ లో కేశూభాయ్ పటేల్ మరియు శంకర్ సింగ్ వాఘేలా తిరిగేవారు, బిజెపి కి పునాది వేయాడానికి.

95 లో బిజెపి గెలవంగనే, అద్వానీ అండతో పటేల్ సిఎం అయ్యాడు, కాని ఎక్కువ మంది మద్దతు వున్న వాఘేలాను ఐదేళ్ల రెండో సగ భాగం లో సిఎం ను చేస్తామన్నారు. అప్పటికి మన కొత్త జోడీ తొగాడియా విహెచ్‌పి లో జనరల్ సెక్రటరీ, మోడీ బిజెపి ఆర్గనైజింగ్ సెక్రట్రరీ.

మోడీ గారి సలహాలతో పటేల్ వాఘేలాను దూరం పెడుతూ వచ్చాడు. అదే సమయంలో, రెండు వర్గాల మధ్య సమన్వయ కర్తగా మోడీకి బాధ్యతలు ఇచ్చారు. ఇక్కడ పటేల్ వర్గానికి అండగా వుండి వాఘేలా వర్గానికి అవమానాలు ఎదురయ్యేలా చేసారు. మండిన వాఘేలా, 48 మంది ఎమెల్యే లతో తిరుగుబాటు చేసాడు. అప్పుడు రంగంలోకి దిగిన వాజ్‌పాయి గారు మరియు అద్వానీ, అటు పటేల్ కి ఇటు వాఘేలాకు ఇద్దరికీ కాకుండా, వారి అగీకారంతో మధ్యలో సురేష్ మెహతా ని సిఎం ని చేసారు.

అప్పుడే ఇన్నిటికీ కారణం అని పటేల్, వాఘేలా మరియు మెహతా అంగీకారంతో మోడీని గుజరాత్ నించి ఢిల్లీ పంపేశారు.

తరువాత మెహతాను ఏడాది అవ్వంగనే దింపేసి వాఘేలా సిఎం అయ్యాడు ఆర్జెపి పార్టీ పేరుతో కాంగ్రెస్స్ అండతో. తరువాత పారిఖ్ కొన్ని నెలలు.

మళ్లీ జరిగిన సాధారణ ఎన్నికలలో 98లో బిజెపి అధికారం చేజిక్కించుకొన్నాక పటేల్ ని సిఎం ని చేసారు. కాని సంఘ్ కు ఇష్టం లేదు, మెల్లగా పటేల్ కుటుంబం మీద అవినీతి ముద్ర పడింది. విదేశాలనుండి వచ్చిన కరువు సహాయ నిధులలో అవినీతి అని కూడా జాతీయ మీడియాలలో ప్రాపగాండా అయ్యింది ఢిల్లీ కేంద్రంగా.

కాని అప్పటికి దేశంలో, పెట్టుబడుల ఆకర్షించడంలో రెండో స్థానంలో వుంది. పెద్ద ఎత్తున 10000 చేక్ డ్యాముల పనులు జరుగుతున్నాయి. దేశంలో అప్పటికే 60000 అడుగుల స్థలం ఐటి కోసం కట్టారు. పెద్ద ఎత్తున సాంకేతిక విద్యను ప్రోత్సహించడంలో దేశంలో ప్రథమ స్థానం.

ప్రధాని వాజ్‌పాయి గారికి పడలేదని ఇలా రక రకాలుగా పుకార్లు, సొంత మంత్రితో నిరాహార దీక్ష చేయించారు పటేల్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా. ఒక లోక్ సభ స్థాన ఉప ఎన్నిక ఓటమిని సాకుగా చూపి, పటేల్ స్థానంలో, దిగ్విజయంగా ఢిల్లీ నుండి మోడీని గుజరాత్ కు ఏకంగా, సిఎంగా పంపారు.

మోడీ సిఎం గా వచ్చీ రాంగనే మిత్రుడు తొగాడియా, సలహాదారుడు అయ్యాడు మోడీకి.
సిఎం అయిన నాలుగు నెలలకే గొద్రా అల్లర్లు, మతకలహాలు మరియు మారణ హోమాలు జరిగాయి. విహెచ్‌పి భజరందల్ సహకారంతో మోడీ హిందూత్వ నాయకుడిగా ఎదిగాడు. మరుసటి ఏడాది 2002 లో నే మోడీ & తొగాడియా జోడి 2/3 వంతు ఆధిక్యంతో బిజెపి అధికారం దక్కించుకొంది, గుజరాత్ లో.

యూత్ లీడర్ అమిత్ షా గారిని చేరదీసి, తొగాడియాను దూరం పెట్టారు. కాని విహెచ్‌పి లో అంతర్జాతీయ అధ్యక్షుడు అయ్యాడు తొగాడియా. కాని తనను దూరం పెట్టింది సహించలేని తొగాడియా, రామ మందిరం గురించి ప్రస్తావిస్తూ, నన్ను చంపే కుట్రలు చేస్తున్నారని, మీడియాకు ఎక్కాడు తొగాడియా. కొన్ని పాత కేసులు తిరగదోడారు రాజస్థాన్ నుండి గుజరాత్ నుండి ఈయన మీద. ఇటీవలే తొగాడియా ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు గుద్దింది. అప్పుడు కూడా నా మీద హత్యా ప్రయత్న కుట్ర జరుగుతోంది అని మీడియా ముందుకు వచ్చాడు తొగాడియా.

కాని విహెచ్‌పి మాతృ సంస్థ సంఘ్ కూడా రంగంలోకి దిగి తొగాడియాను, ఆయన శిష్యుడు అనుచరుడు రాఘవ రెడ్డిని కూడా అధ్యక్ష స్థానం నుండి తొలగించాలని పావులు కదుపుతోంది. మొట్ట మొదటి సారి, విహెచ్‌పి లో తదుపరి అధ్యక్షుని కోసం ఎన్న్నికలు జరుగుతోంది. రాఘవ రెడ్డి ఏమో విహెచ్‌పి లో సంఘ్ కొన్ని దొంగ వోట్లు చేర్పించింది అని ఆరోపిస్తున్నాడు. రేపు ఎళ్ళుండే ఎన్నికలు గురుగావ్ లో.

ఆర్ ఎస్ ఎస్ లో భీష్ముడైన 92 ఏళ్ల వైద్య గారు పార్టీ ప్రముఖ స్థానం నుండి గడ్కరీని తొలగించడంలో మోడీ కుట్ర వుందని ఆరోపిస్తే, ఆయన కొడుకు జానియర్ వైద్యతోనే ఆయన నాన్నకు వ్యతిరేఖంగా మాట్టాడించారు. రాం మాదవ్ కూడా మాట్టాడారు ఆయనకు వ్యక్తిరేఖంగా.

ఇప్పుడు చెప్పండి తెలుగు తమ్ముళ్లూ ఆర్ ఎస్ ఎస్ మోడీకి క్లాస్ తీసుకొనే స్థాయా? కీలు బొమ్మా?

కాని నివురుగప్పిన నిప్పులా వుంది ఇటీవల అద్వానీకి జరిగిన పరాభవం తరువాత.

ఇక తొగాడియాను విహెచ్‌పి కి దూరం చేసాక జరిగే పరిణామాలు కేసులు కుట్రలు అన్నీ చూడాల్సి వుంది. ఆయన గాలి శీను లా మోడీ గమ్యం లో త్యాగశీలి గా మిగిలిపోతాడా అన్నది, భవిషత్తులో తెలుస్తుంది.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 900,541

తడి ఆరని ఉతుకులు

ఏప్రిల్ 2018
సో మం బు గు శు
« మార్చి   మే »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: