ఏప్రిల్ 11th, 2018ను భద్రపఱచు

ఆనందాన్నిచ్చే పట్టణం అమరావతేనా? – మొదటిభాగం

ఆనందాన్నిచ్చే పట్టణం అమరావతేనా? – మొదటిభాగం

బిజెపి వచ్చాక
స్మార్ట్ సిటీల జాబితా వస్తోంది అంటే
చూసుకొని గర్వపడకుండా వున్న వారు లేరు

అందులో తప్పినా అమృత్ సిటీగా
చూసుకొని మురిసిపోని వారు లేరు

పొంగిపోయి సోషల్ మీడియాలో
గొప్పలు పోయారు

కారణం

ఆ జాబితాలో చూసిన తమ పట్టణ రాత
మారిపోతుందనే వెఱ్రి నమ్మకం తో

కాని
ఎవరో వస్తారని ఏదో చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా అనే
పాట ను దేశంలోని
ఆ జాబితా లోని ప్రతి నగర వాసితో
పాడుకొనేలా చేసింది కేంద్రం
వెలగబెట్టిన శూన్యంతో

ఇంకా

మన దేశంలో
ఏ పట్టణంలో
గంట పాటు వర్షం వచ్చి
వెలిసినా

సోషల్ మీడియాలో వరద వస్తుంది
జోక్ ల తో

నీళ్ల ట్యాంకర్ల మాఫీయాల గురించి
అపార్ట్మెంట్ అసోసియేషన్లలో
వాడి వేడి సమావేశాలు జరిపి
కిక్కురుమనకుండా చెప్పింది
చెల్లించే పట్టణవాసులే

ట్రాఫిక్ జాం లలోని
అంబులెన్స్ లలో పోయే ప్రాణాలు

పొద్దున నడకకు వెళ్లడానికి ప్రయత్నిస్తే
ఎక్కడ చూసిన రగిలే చెత్తతో వచ్చే పొగలతో
అనారోగ్యం వస్తుందనే భయం

పట్టణ విస్తీర్ణాలు పెరిగి
పట్టణం మధ్యలోకి వచ్చిన
రసాయాన కారకాలు వెదజల్లే పరిశ్రమలు
తరలించక ఎప్పటికప్పుడు ఎన్ ఒ సి ఇచ్చే
కాలుష్య నియంత్రణ సంస్థలు

 

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కార్యాలయం కొలువున్న
సాక్షాత్తు దేశ రాజధాని ఢిల్లీ లో
కాలుష్య కాలిగోటిని కదపలేక
ఇంకెన్ని దశాబ్దాలు గడిపేస్తారో తెలియదు

లేఔట్లల ప్లాన్ లలో చూపే ఆటస్థలం గుడి స్థలం తో
సహా చివర్లో అమ్మేసుకొని పోయే వాల్లే
నిర్మాణాలలో చొట్టూ సెట్ బ్యాక్ లు వదలరు
గాలి ఆడని నిర్మాణాలు
అంటు వ్యాధి వస్తే నగరం నగరం
ఆసుపత్రిలో పట్టక అవస్థలు పడ్డమే

ఏదో పాపం చేసో
ఈ నగరమే నరక కూపంగా అనుభవిస్తున్నా అని
మనసుకు సర్దిచెప్పుకొనే మనుషులతో

కాని వాతావరణం ఉద్యోగాలు సంపాదన
రిటర్మెంట్ తరువాత బెంగుళూరు మేలని అనుకుని
వచ్చి వాలిన దేశానికి కూడా
దాని వేడి ఖర్చులు ట్రాఫిక్ వర్షం
నిర్మాణాల అక్రమాలు అడ్డు అదుపూలేక
చెయ్యెత్తేసిన ప్రభుత్వం అనుభవమే

చెన్నై, హైదరాబాదు ఇలా
దేశం లో ని ప్రతి నగరం
ఒక్కో రకమైన అనుభవాన్ని మిగుల్చుతోంది

అంతా బావుంది అనుకొనే శ్రీనగర్ లో
మంచే కాదు మనుషుల ప్రాణాలూ పోవడమే

దేశంలో ఈ పట్టణం బావుంది అని
గర్వంగా చెప్పుకొనే పరిస్థితి లేదు

ఇలాంటి సమయంలో
రాజధాని లేని రాష్ట్రం శాపం అంటారు అందరూ
కాని ఇది ఆంధ్రా ప్రదేశ్ కు వచ్చిన అదృష్టం

ఎలాగో తరువాయి భాగం లో …..చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

  • జగన్ ప్రమాదకారి అని తన సాక్షిలో తెలియక పోవచ్చు, తెలుసుకొనే స్వేచ్చను తనను నమ్మిన శ్రేయోభిలాషులకు కూడా ఇవ్వలేదు. chaakirevu.wordpress.com/2019/02/14/%e0… 1 day ago

వీక్షణలు

  • 884,613

తడి ఆరని ఉతుకులు

ఏప్రిల్ 2018
సో మం బు గు శు
« మార్చి   మే »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: