ఏప్రిల్ 6th, 2018ను భద్రపఱచు

బిజెపి మానసికస్థితి

బిజెపి మానసికస్థితి

ఈశాన్యం లో ఇరగదీసామనుకొని
లోకానికి ఆర్భాట ఆనందం చూపలనుకొనే ముందే

పార్టీలో ఏదో అంతర్గత అలజడి

ముఖ్యంగా మోడీ లో పార్టీ పట్ల
అసహనం అపనమ్మకం అంతర్లీనంగా

అది ఈశాన్య రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార సభలో
బహిరంగంగా చేతల్లో చూపాడు
దేశం అంతా అసహ్యించుకొనేలా
చేతులు జోడించిన గురువు అద్వానీకి ప్రతినమస్కారం పెట్టకుండా
యధాలాపం కానట్టు తన సంస్కార లోపాన్ని
రెండోసారి లోకం ముందు దాయలేనంత

ఉత్తర ప్రదేష్ బీహార్ ఫలితాలలో కూడా
ప్రతిపక్షాల ఐక్యత కన్నా
అంతర్గత పోరు ఘోర ఓటమిని
లోకానికి తెలిసేలా చేసింది

అంతకు ముందు నుంచే
మిత్రుడు చంద్ర బాబు దూరం అవ్వడం

అంతకు ముందే ఆంధ్రాకు రాష్ట్రపతి రావడం పొగడ్డం
పైగా అద్బుతం ఆశ్చర్యం దేశం తెలుసుకోవాలని
ఇరవైకి పైగా ట్వీట్లు పెట్టడం

వెంటనే అంబానీ సందర్శించడం
ఆయన గంటలు గంటలు గడపడం
మీరు మరింత ఉన్నత పదవిలో వుంటే
దేశానికి మేలు జరుగుతుంది అని బాబుతో అనడం

వేరు వేరుగా జరిగాయి

పార్టీ పెద్దలు మిత్రధర్మం గురించి సలహాలిచ్చినా
తన పంతాన్ని వీడక పైగా పెంచుకొని
పదవి స్థాయికి వుండాల్సిన మానసిక పరిణితి దిగజారేలా
పదుల కేసుల్లో వున్న మిత్రుల శత్రువు తో చేతులు కలిపిన ఫోటోలకు
ఫోజులు ఇచ్చి తెలిసేలా చేసి

నిండు సభలో మిస్టర్ పిఎం అని
అనిపించుకొనేంత స్థాయికి పతనం అయ్యి

ఆంధ్రాలో తమ మంత్రుల రాజీనామా క్రమంలో
ముఖ్యమంత్రి పాటించిన కనీస స్థాయి హుందాతనం కూడా కోల్పోయి

కేంద్ర మంత్రుల రాజీనామాలో బాబు ముందస్తు చివరి టెలిఫోన్ మాటలకు కూడా
అక్కసుతో దూరమై మొహం చాటేసి
ఆలోచించుకొని మరుసటి రోజు ముక్తసరి ముక్తాయింపుతో
మమ అని అనిపించుకొని

మాజీ మిత్రుడైన బాబు మీద మాటల దాడిని
తన మందతో చేయించి అధికార మదాన్ని చాటి

కలవలేని దూరం జరిగి
చేతులారా శతృత్వం పెంచుకొనేలా చేసుకొని

ఆంధ్రా శాసన సభ నుండి వచ్చే మాటల శరాలకు
తమ పార్టీ కుక్క మూతి పిందెలతో ఎంత ఎదురుదాడి చేసినా

ఆ శరాలు ఆగక పోగా
నేరుగా బాబు ఢిలీ వచ్చి
అతి దగ్గరగా గంటన్నర పైగా
తన మోసాలను
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో
చూపే సరికి

ఏకమైన అన్ని పక్షాలు
వారితో కలుస్తోన్న సొంత పార్టీ పెద్దలు

కర్ణాటకలో ముందస్తు ఓటమి వాసనలు పసిగట్టి
పార్టీ అధ్యక్షుడైన అమిత్ షా కూడా
ఒత్తిడికి గురై సొంత పార్టీ నేత యడ్డీనే విమర్శించిన తడబాతు

ఒక్క రోజు కూడా ఉభయ సభలు నిర్వహించలేని చేతకానితనం
ఎవరితో మాట్టాడి ఎలా ప్రభుత్వ హుందాతనం నిలుపుకోవాలో తెలియక
మెజారిటీ సంఖ్య వున్నా అవిశ్వాసాన్ని ప్రవేశ పెట్టలేని అధైర్యాన్ని
దేశానికి చాటుతూ

పారిపోయిన పలాయన ప్రయాణంలో
దేశం అంతా విస్తరిస్తున్నామనుకొనేంతలో
ఎదిగిన గూజరాత్ నుండే గుబులు పెరిగి

వైరి పక్షాల ఐఖ్యత మీద అక్కసుతో
ఏకంగా పాలక జాతీయ అతి పెద్ద పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా
తన స్థాయి దిగజార్చుకొనేలా
ఎక్కడి నుండి వచ్చాడో వేలెత్తి చూపేలా
హీనంగా దేశంలోని పార్టీలను
పిల్లులు కుక్కలు పాములు అంటూ
బయట పడ్డం
బహిరంగంగా మాట్టాడ్డం

బిజెపి పార్టీ వినాశ మానసిక స్థితిని
దేశం విస్తుపోయేలా చూసింది. ….చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 889,951

తడి ఆరని ఉతుకులు

ఏప్రిల్ 2018
సో మం బు గు శు
« మార్చి   మే »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: