మార్చి, 2018ను భద్రపఱచు

చిరంజీవి గారు – గౌరవ వీడ్కోలు

చిరంజీవి గారు – గౌరవ వీడ్కోలు

ప్రజలు పిలిచారు అని
తనే వచ్చి

కొత్త వృత్తిలో
తొమ్మిది నెలల వైఫల్యాన్ని
తాకట్టు పెట్టేసి

నేరుగా రాజ్యసభతో
ఓ కేంద్ర మంత్రి అయ్యి

కీటకం పాటి కించిత్ సాయం
రాష్ట్రానికి చేయక

కాంగ్రెస్స్ చేసిన
పాపపు విభజన సమయంలో
కనీసం చేతనైన
నటనతో కూడా
నిరసన తెలపక

కిమ్మని
వుండిపోయి

తరువాతి ఎన్నికలలో
తనకేమీ పొడిచే పాత్రలేక

స్తబ్దుగా వుండిపోయి

తనకన్నా ఎన్నో ఏళ్లు చిన్న అయిన
తమిళ విజయ్ సినిమాను

తన పాత వృత్తికి
పునః ప్రవేశంగా ఎంచుకొని

వుండాల్సిన హుందాతనానికి దూరంగా
అసహజ వయసు తక్కువ పాత్రలో కనిపించి
అక్కడా ఆశాభంగం పొంది

అమ్మడూ కుమ్ముడూ అని పాడి
మరింత అసహ్యాన్ని మూటగట్టుకొని

ఓ విధమైన నైరాశ్యం లో
కొట్టుమిట్టాడుతూ

కనీసం
రాజకీయ వృత్తిలో
రాజ్య సభనుండి
గౌరవ వీడ్కోలుకు కూడా
మొహం చాటేసి

హుందాతనం పాటించక
సంకుచిత జీవిగా
రాజకీయ జీవితానికి
సశేషం పలకడం

ప్రజాసేవ వేషం వేసే
ప్రతి ఒక్కరికీ ఓ పాఠం.

“ప్రతి ఒక్కరికీ జీవితంలో
అనూహ్య అసహన రోజు వస్తుంది
దానిని గౌరవించాల్సిందే”. . …..చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 851,355

తడి ఆరని ఉతుకులు

మార్చి 2018
సో మం బు గు శు
« ఫిబ్ర   ఏప్రి »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: