ఫిబ్రవరి 9th, 2018ను భద్రపఱచు

నరేంద్ర మోడీ గారు నేర్చిన రామాయణం ఇంకెవరికన్నా తెలుసా?

నరేంద్ర మోడీ గారు నేర్చిన రామాయణం ఇంకెవరికన్నా తెలుసా?

నరేంద్ర మోడీ గారు,

మీరు 1985 లో ఆర్ఎస్ఎస్ నుండి బిజెపి లో చేరి, 1986 లో వచ్చిన రామాయణం సీరియల్ చూసారు. బహుశా, రాముడి పేరుతో రాజకీయాలు ఎలా నడపాలి అని, ఆ సీరియల్ నే చూడమని మీ పార్టీ చెప్పి వుండవచ్చు, మీరు చూస్తూ గడిపేసి వుండొచ్చు.

కాని ఆపాటికి రామాయణ, భాగవత మరియు భారత ప్రథాన ఘట్టాలను రామారావు ధర్మాన సినిమాలుగా చూసేసి, పద్యాలు పాటలు కూడా నేర్చుకొని, మీకన్న ఓ సంవత్సరం ముందే అదే 1984 లో అన్నగారి తెలుగు దేశంలో చేరింది, రేణుకా చౌదరి. మీరు రామాయణం సీరియల్ చూస్తున్న సమయానికి, అదే 1986 లో, ఆవిడ రాజ్య సభలో వున్నారు.

మీరు 2001 లో గుజరాత్ ముఖ్యమంత్రి అవ్వకముందే, అదే నాలుగేల్లకు ముందే 1997లో, ఆవిడ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి, కేంద్రంలో.

ఆవిడ సభలో నవ్వితే దుర్యోధనుడిలా భగపడ్డం ఎందుకు, రామాయణం పేరున అవమానించడం ఎందుకు. పోనీ ఆ రామాయణం మీద గౌరవం వుంటే, స్త్రీలను అలా గౌరవించేవారా? అయోధ్యలో రాములవారి గుడి కట్టేసినట్టు, మాటలతో రామాయణం చెప్పడం కాదు, అందులో భావాలు కూడా పట్టించుకోవాల. ….చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 841,952

తడి ఆరని ఉతుకులు

ఫిబ్రవరి 2018
సో మం బు గు శు
« జన   మార్చి »
 1234
567891011
12131415161718
19202122232425
262728  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: