ఫిబ్రవరి 5th, 2018ను భద్రపఱచు

తన పేరుకు బదులు, బాబు పేరు వాడి, తన ఆత్మ కథ వినిపిస్తున్న జగన్

తన పేరుకు బదులు, బాబు పేరు వాడి, తన ఆత్మ కథ వినిపిస్తున్న జగన్

ఈ రోజు బాబు తీరును వివరిస్తూ వైఎస్‌ జగన్‌ ఓ కథ చెప్పారు. సాక్షి లో కూడా వచ్చింది.

‘అనగనగా ఒక ముద్దాయి.. ఆ ముద్దాయి కోర్టు బోనులో నిలబడ్డాడు. కాసేపటికి జడ్జ్‌ వచ్చాడు. జడ్జ్‌ రాగానే ముద్దాయి బిగ్గరగా ఏడ్వడం మొదలుపెట్టాడు. ‘తల్లిదండ్రీ లేనివాడిని.. నేను అనాథను.. నాకు దిక్కెవరు లేరు సార్‌’ అంటూ తనను విడ్చిపెట్టాలని జడ్జ్‌గారిని వేడుకున్నాడు. జడ్జ్‌గారు.. ఈ ముద్దాయి తల్లీదండ్రీ లేని అనాథ అంటున్నాడు. పోలీసులు ఎందుకు తీసుకొచ్చారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను అడిగారు. ఏమిటి ఇతడు చేసిన తప్పు అని ప్రశ్నించారు. దానికి.. ‘ఇతనివన్నీ దొంగ ఏడ్పులు. నమ్మకండి సార్‌. తల్లిదండ్రీని చంపి.. బోనులో నిలబడి.. ఇప్పుడు దొంగ ఏడ్పులు ఏడుస్తున్నాడు’ అని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తెలిపారు.. అచ్చం ఆ ముద్దాయి తరహాలోనే ఇప్పుడు చంద్రబాబు ఉంది’ అని వైఎస్‌ జగన్‌ వివరించారు.

ఇంతబాగా నేర్చుకొచ్చి, తన స్థాయికి చంద్ర బాబును తీసుకొచ్చేయచ్చనే ఇలాంటి కథలతో, జగన్ జనానికి ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు? వారం వారం కోర్టుకు హాజరు అవుతూ, ఆ కోర్టు బాష వంటబట్టించుకొని, ఆ ప్రావీణ్యాన్ని ప్రజా సమస్యల మీద కాకుండా, ఇలాంటివి చెబితే, జగన్ కు ఒరిగేది ఏంటి? ఇంకా పదే పదే తనకు తానే గుర్తు చేసి పలచన అవ్వడంలేదూ? తనకు తానే నాశనం అవ్వడం లేదూ? కొనే సలహాలు నాశనం చేస్తున్నాయా? కొంచం తెలివి వున్న జగన్ అభిమానులు ఎవరైనా స్పందించగలరు. …..చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 795,085

తడి ఆరని ఉతుకులు

ఫిబ్రవరి 2018
సో మం బు గు శు
« జన    
 1234
567891011
12131415161718
19202122232425
262728  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: