దేశ న్యాయ’అవస్థ’
దేశ సర్వోన్నత న్యాయ వ్యవస్థ పరిపాలన
అస్తవ్యస్త అవస్థల్లో వుందని
ఆందోళనతో దేశ మీడియాతో
ఆ న్యాయమూర్తులే మొరపెట్టుకోవడం
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం పట్ల
అంతర్జాతీయ స్థాయిలో
విశ్వాసం సడలేదే
2014 ఎన్నికల ఫలితాలు వచ్చాక
గుజరాత్ షోబ్రుద్దీన్ ఎంకౌంటర్ కేసులో
అమిత్ షా మీద తీర్పును వెలువరించాల్సిన
సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి
పెళ్లికని వెళ్లి అనుమానాస్పదంగా చనిపోవడం
ఆ తరువాత ఆ తీర్పులో
బిజెపి అధ్యక్షుడు నిర్దోషని
బయటపడ్డం నుండి
మెడికల్ కాలేజీల అక్రమాలు
దర్యాప్తులలో న్యాయమూర్తుల పాత్రల మీద
సందేహాలు ఇలా ఎన్నో ఎన్నెన్నో వరుసగా
వ్య్విశ్వాసం సన్నగిల్లి
పరువు పాతాళంలోకి పోవడానికి
దశాబ్దాల అకారణ జాప్యాల జాడ్యాలతో
ప్రముఖుల్లో 10 శాతం కూడా జీవించివుండగనే
శిక్ష అనుభవించలేదనే
సామాన్యుడి అనుమానానికి తోడు
ఇలాంటి లుకలుకలు
అరాచకానికి దారితీయగలవు. ….చాకిరేవు.
0 Responses to “దేశ న్యాయ’అవస్థ’”