హస్తిన రాయబారిగా లేఖా?

హస్తిన రాయబారిగా లేఖా?

ప్రత్యేక హోదా బదులు, ప్రకటించిన ప్యాకేజీ తరపున ఎంత రావాలో, లెక్కలు కట్టించాడు. అవన్నీ పొందుపరుస్తూ, ఓ లేఖ వ్రాసి, దేశ ఆర్థిక శాఖామాత్యుడికే కాదు, ప్రజలకు చేరేలా పత్రికలకు కూడా విడుదల చేసాడు.

ప్రత్యేక హోదా నుండి, ప్రకటించిన సంస్థలకు ప్రహరీలకు మాత్రం విదిల్చిన నిధుల నుండి, ఆర్థిక లోటు వరకు, విదల్చతామన్న ప్యాకేజీని త్రిశంకు స్వర్గం లో పెట్టడం వరకు, లో లోపల చాలా లోతైన కేంద్ర అసూయను ప్రజలు గ్రహించారు. ఫలితంగా రాష్ట్రం మీద అణచివేత కొనసాగుతోందని కూడా, దేశానికి అర్థం అయ్యింది.

మోడీ పార్టీకి గుండె లాంటి గుజరాత్ లో గుగుర్పాటు ఫలితాలు వచ్చాక, చంద్ర ప్రసన్నత వేళకు వాచారు. మేము పిలిచాం, అన్నీ చేసేస్తామని అక్కడే బాబుతో చెప్పించేసి, టాటా చెప్పి ప్రజల దగ్గర నిజాయితీని నిరూపించుకొని, మళ్లీ వెసులుబాటు చూసుకొని, ఆంధ్రాతో ముసుగులో గుద్దులాట మొదలెట్టవచ్చని, తక్షణ చర్యలతో బాబు కు ఆహ్వానానికి తలూపినట్టున్నారు.

రాష్ట్రానికి ఇవి రావాలి అని, వెళ్లక ముందే, లేఖ విడుదల చేసారు బాబు. ఇక్కడే, నాకు కేంద్రంతో భయపడాల్సిన పని లేదు, రాష్ట్రం పట్ల రాజీ లేదు అని ప్రజలకు, తన నిజాయితీని & ధైర్యాన్ని తెలియజేసుకొనే అవకాశం దక్కింది బాబుకు. పోలవరం దగ్గరకు, ప్రజా ప్రతినిధులను తీసుకుపోయి, చెయ్యించిన పనులు చూపి, నిండు సభలో ఇలాగే తెలివిగా, కేంద్రం నిధులు ఇస్తే గడువులోపల పూర్తి చేయగలుగుతాము, పోలవరాన్ని కేంద్రం తీసుకొన్నా పరవాలేదని ప్రకటన చేసి కేంద్రం మెడకు పోలవరం బాధ్యతను తగిలించాడు.

అచ్చం అలా రావాల్సిన సాయం & నిధుల మీద, హస్తిన రాయబారిగా లేఖ ను ఎంచుకొని, పంపాడు. ఇక అక్కడ ముసుగులో ఏమి మాట్లాడినా, ప్రతిపక్షాలు ఎన్ని రాద్దాంతాలు చేసినా అనవసరం. ఎందుకంటే, ముఖ్యమంత్రి హోదాలో ఆ లేఖలో సంతకం పెట్టాడు. అవి నెరవేర్చితే కేంద్రానికి మంచిపేరు, లేదంటే దానిదే బాధ్యత.

ఓ సమస్యను మరీ ఎక్కువ చేసి బాబు మీద ప్రయోగిస్తే, దానిని ఎప్పుడూ అవకాశంగా మలుచుకోకుండా వదులుకోని అనితర సాధ్యుడు బాబు. జరిగింది అదే ప్రస్తుతం. బహుశా రాయబారిగా లేఖ వస్తుందని ఊహించి వుండదు కేంద్రం. ఈ హఠాత్పరిణామమే గవర్నర్ తో సంతకం పెట్టించి వుండవచ్చు నాంచిన నాలా బిల్లు పై. మానసిక వేధింపులు భరించే స్థితి ఎప్పుడో దాటాడు, రాష్ట్రం కోసం మాత్రం సహనానికి హద్దులు మాత్రం పెట్టుకొంటాడు. అది కేంద్రానికి అర్థం అయ్యేసరికి ఆలస్యం అయ్యింది. ఇక వేగంగా సహకరించక తప్పని సరి పరిస్థితి. అమరావతి వాస్తా మజాకా. అన్నీ సవ్యంగా జరుగుతాయి. ……చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “హస్తిన రాయబారిగా లేఖా?”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • ఓ ఉత్తరాంధ్రా అబ్బాయి ఎర్రం నాయుడి అబ్బాయి ఇటీవలే ఓ ఇంటివాడైన అబ్బాయి పార్లమెంటులో ఎలా మాట్టాడాడో ఓ వంద సార్లు… twitter.com/i/web/status/1… 2 days ago

వీక్షణలు

  • 837,707

తడి ఆరని ఉతుకులు

జనవరి 2018
సో మం బు గు శు
« డిసెం   ఫిబ్ర »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: