చంద్రబాబును చూస్తేనే, నేడు రాష్ట్ర ప్రజలకు ఓ ఆనందం
వాన చినుకు పడేప్పుడు, మట్టి వాసనకే మనసు పరవశిస్తుంది.
అలాంటిది దశాబ్దాలుగా, బీటలు వారి నెర్రెలు చీలిన నేలను చూసి చూసి, బతుకు భయం పట్టుకొన్న అనంత ప్రజల ఆవేదన ఎలా వుంటుందో, ఓ సారి ఊహించండి. దానికి తోడు, వీధి నాయకుడి నుండి జాతీయ స్థాయి నాయకుడి వరకు అనంత కరువు అని నోటి కరువు లేకుండా ఉపన్యాసాలు ఇచ్చిన వారే. లోకం మాటలు విని వినీ, ఎడారి లాంటి తమ ప్రాంతాన్ని చూసి చూసి, ఈ జన్మకు మన బతుకులు ఇంతే అనుకొనేలా అయిపోయింది అనంతపురం.
ఇటీవల చెవులు నింపి కాలువల్లో నీరు వస్తున్నా, ఇంకా కలా నిజమా అని గిల్లు కొని చూసుకొంటున్నారు, అనంతలో. అంతలోనే ఇవి నీళ్లే అని తెలుసుకొని, వాటిలో ప్రభుత్వ విప్ లాంటి స్థాయిలో వున్నా, తనను తాను మరిచి పోయి బుక్కపట్నం చెరువులో ఈత కొట్టే ఆనందాలు.
కరువు అంటే భయపడిన సీమలో, ఇక ఎప్పటికీ అది దరిదాపులకు రాదనే ధీమా.
రోజూ నడవండి ఆనందం గా వుండండి, వారాంతాలు ఉల్లాసంగా గడపండి ఆనందంగా వుండండి. సంకల్పం చేసుకొందాం సాధించలేనిది లేదు. అంటూ దేశాన్ని, ప్రపంచ దేశాల దృష్టిని మన రాష్ట్రం వైపు త్రిప్పి చూసేలా తలెత్తుకొని చేసేలా చేసిన నాయకుడు చంద్రబాబును చూస్తేనే, నేడు రాష్ట్ర ప్రజలకు ఓ ఆనందం. ….చాకిరేవు.
0 Responses to “చంద్రబాబును చూస్తేనే, నేడు రాష్ట్ర ప్రజలకు ఓ ఆనందం”